మైక్ ముట్టుకుంటే వస్తుందా కరోనా! NBA ప్లేయర్‌‌ జోకేశాడు, తీరా అతనికే పాజిటీవ్ అనేసరికి హాస్పటల్‌కి పరిగెత్తాడు

  • Published By: sreehari ,Published On : March 12, 2020 / 06:10 AM IST
మైక్ ముట్టుకుంటే వస్తుందా కరోనా! NBA ప్లేయర్‌‌ జోకేశాడు, తీరా అతనికే పాజిటీవ్ అనేసరికి హాస్పటల్‌కి పరిగెత్తాడు

Utah Jazz center జట్టు బాస్కెట్ బాల్ ఆటగాడు రూడీ గోబెర్ట్‌కు కరోనా వైరస్ సోకింది. అతడు కరోనా వ్యాప్తిపై జోక్ పేల్చిన రెండు రోజుల తర్వాత అతడిలోనే వైరస్ పాజిటివ్ లక్షణాలు ఉన్నట్టు స్ర్కీనింగ్ పరీక్షలో తేలింది. దాంతో NBA లీగ్ సీజన్ నిలిచిపోయింది. గోబెర్ట్ పాజిటివ్ పరీక్షకు ప్రతిస్పందనగా.. గురువారం నుంచి లీగ్ నిరవధికంగా నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది.

సోమవారం విలేకరుల సమావేశం తరువాత గోబెర్ట్ తన ముందు పోడియంలో ఉంచిన మైక్రోఫోన్లు రికార్డింగ్ పరికరాలన్నింటినీ సరదాగా తాకి చూపించాడు. అందరికి ఏదైనా తాకితే కరోనా వైరస్ వస్తుందా? అన్నట్టుగా చమత్కరించాడు. అయితే నాకు కూడా వస్తుందా? అంటూ జోకు పేల్చి వెళ్లాడు. అంతే.. దురదృష్టవశాత్తూ అతడికి కూడా కరోనా వైరస్ పాజిటివ్ రావడంతో షాక్ అయ్యాడు.

షెడ్యూల్ ప్రకారం.. బుధవారం, గోబెర్ట్ తన ప్రత్యర్థి జట్టుThunderతో ఆడటానికి రెడీగా ఉన్నాడు. థండర్ జట్టు కొద్ది క్షణాల ముందు ఆటను పిలిచే వరకు బాగానే ఉన్నాడు. ఆ తర్వాతే అతడిలో వైరస్ పాజిటివ్ లక్షణాలు బయటపడ్డాయి. వెంటనే క్రీడాకారులంతా కోర్టును విడిచిపెట్టారు. అభిమానులను కూడా అక్కడి నుంచి బయటకు వెళ్లాల్సిందిగా సూచించారు. కొద్ది నిమిషాల తరువాత, NBA సీజన్ నిరవధికంగా నిలిపివేశారు.

ఒక ఆటగాడు వైరస్ బారినపడితే, ఆ ఆటగాడితో పాటు జట్టు 14 రోజుల పాటు నిర్బంధించాల్సి ఉంటుందని లీగ్ సోర్స్ ఇన్‌సైడర్‌కు తెలిపింది. అప్పుడు జట్టు ఎదుర్కొనే ప్రత్యర్థులకు కూడా వైరస్ విస్తరించే అవకాశం ఉంది. వైరస్ వ్యాప్తిని నివారించడానికి కఠినమైన చర్యలు తీసుకునే ఏకైక లీగ్ NBA కాదు.

రాబోయే పురుషుల మహిళల కాలేజీ బాస్కెట్‌బాల్ ఛాంపియన్‌షిప్ టోర్నమెంట్లు అభిమానుల లేకుండానే జరుగుతాయని NCAA అధ్యక్షుడు మార్క్ ఎమ్మర్ట్ బుధవారం ప్రకటించారు. ప్రత్యేకించి ప్రీమియర్ లీగ్ మాత్రమే కాకుండా కరోనావైరస్ కారణంగా మిగిలిన సీజన్‌ను రద్దు చేయాల్సిన పరిస్థితి ఎదురైంది.