Cook Islands : కోవిడ్-19 మొదలైన రెండేళ్లకు ఆ దీవిలో తొలి కేసు నమోదు..10 ఏళ్ల బాలుడికి పాజిటివ్

కోవిడ్-19 మొదలైన రెండేళ్లకు ఆ దీవిలో తొలి కేసు నమోదు అయ్యింది. 10 ఏళ్ల బాలుడికి పాజిటివ్ గా నిర్ధారణ కావటంతో ఆ దీవి ఆందోళన చెందుతోంది.

Cook Islands : కోవిడ్-19 మొదలైన రెండేళ్లకు ఆ దీవిలో తొలి కేసు నమోదు..10 ఏళ్ల బాలుడికి పాజిటివ్

Cook Island Reports Its First Positive Case

cook island reports its first positive case : చైనాలో పుట్టిన కరోనా మహమ్మారి ప్రపంచ అంతా చుట్టేసింది. కొత్త రూపాల్లో హల్ చల్ చేస్తోంది. సౌతాఫ్రికాలో వెలుగు చూసిన కొత్త వేరియంట్ ఒమిక్రాన్ జెట్ స్పీడ్ తో 38 దేశాలకు పాకేసింది. కరోనా సోకని ప్రాంతాలు కూడా ఉన్నాయి ఈ భూమ్మీద. ఇప్పటి వరకు ఒక్క కరోనా కేసు కూడా నమోదు కాని ప్రాంతం పసిఫిక్‌లోని కుక్ ఐలాండ్ .కానీ కరోనా వచ్చిన రెండేళ్ల తర్వాత కుక్ ఐలాండ్ లో తొలి కేసు నమోదు అయ్యింది. డిసెంబరు 2019లో వెలుగుచూసిన కరోనా వైరస్ ఇప్పటి వరకు కుక్ ఐలాండ్ ని టచ్ చేయలేకపోయింది. కానీ రెండెళ్ల తరువాత కుక్ ఐలాండ్ లో తొలి కేసు నమోదు అయ్యింది. న్యూజిలాండ్ నుంచి వచ్చిన 10 ఏళ్ల బాలుడికి పాజిటివ్ గా నిర్ధారణ కావటంతో కుక్ ఐలాండ్ లో తొలి కరోనా కేసు నమోదు అయిందని ప్రధాన మంత్రి మార్క్ బ్రౌన్ శనివారం (డిసెంబర్ 4,2021) ప్రకటించారు.

దాదాపు 17,000 మంది జనాభా ఉన్న పసిఫిక్‌లోని కుక్ ఐలాండ్ ప్రపంచంలోనే అత్యధికంగా వ్యాక్సినేషన్ రేటు ఉంది. ఈక్రమంలో కరోనా వైరస్ మహమ్మారి మొదలైన దాదాపు రెండేళ్ల తర్వాత ఆ దీవుల్లో కోవిడ్ కేసు నిర్దారణ కావడం ఇదే మొదటిసారి. టీకాకు అర్హులైనవారిలో 96 శాతం మందికి రెండు డోస్‌లు పూర్తి అయ్యాయి. కరోనా వ్యాప్తితో కుక్ ఐలాండ్ ప్రభుత్వం తమ సరిహద్దులను మూసివేసింది. ఇటీవలే తిరిగి పర్యాటకాన్ని పునఃప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తోంది.

Read more :  విదేశీయులకు నో ఎంట్రీ, రాష్ట్రంలో ఒక్క కరోనా కేసు లేకున్నా సిక్కిం ప్రభుత్వం కీలక నిర్ణయం

ఈ సమయంలో ఐలాండ్ లో తొలిసారి కోవిడ్ కేసు నమోదుకావడంతో ఆందోళన చెందుతోంది. గురువారం (డిసెంబర్2,2021) న్యూజిలాండ్ నుంచి స్వదేశానికి వచ్చిన విమానంలోని 10 ఏళ్ల బాలుడికి వైరస్ నిర్ధారణ అయినట్టు కుక్ ఐలాండ్ ప్రధాని మార్క్ బ్రౌనే ప్రకటించారు. బాలుడు తల్లి తన సోదరులతో కలిసి న్యూజిలాండ్ నుంచి వచ్చినట్టు తెలిపారు. బాలుడి తల్లి వ్యాక్సిన్ రెండు డోస్‌లు తీసుకుందని..ముగ్గురు పిల్లలు వ్యాక్సిన్‌కు అర్హులు కాకపోవడంతో టీకా తీసుకోలేదని వెల్లడించారు. ప్రయాణానికి ముందు నవంబరు 30న బాలుడికి ప్రయాణానికి ముందు నిర్వహించిన కోవిడ్ పరీక్షల్లో నెగెటివ్ వచ్చిందన్నారు.

కుక్ ఐలాండ్ కు వచ్చిన తర్వాత నిబంధనల ప్రకారం పరీక్షలు చేయగా..10ఏళ్ల బాలుడికి పాజిటివ్‌గా తేలిందని తెలిపారు. మొత్తం విమానంలో 176 మంది రాగా.. 10 ఏళ్ల బాలుడికే పాజిటివ్ గా నిర్ధారణ అయ్యిందని పేర్కొన్నారు. దీంతో బాలుడి కుటుంబాన్ని ఓ రిసార్ట్‌లో క్వారంటైన్‌లో ఉంచామని తెలిపారు. ఇక వారి కుటుంబంలో ఎవరికీ కోవిడ్ లక్షణాలు కనిపించలేదని వివరించారు.

Read more : No corona case : పర్యాటక ప్రాంతమైనా..ఒక్క కరోనా కేసు లేని గ్రామం..

ప్రధాని తమ దేశం గురించి మాట్లాడుతు..‘మా సరిహద్దులను తిరిగి తెరవడానికి మేము సిద్ధం చేస్తున్నాం…సరిహద్దుల వద్ద ఈ కేసును గుర్తించడం ద్వారా మా పరీక్షా విధానాలు నిర్వహిస్తున్నాం అని తెలిపారు. కరోనా వ్యాప్తితో సరిహద్దులను మూసివేసిన కుక్ ఐలాండ్.. జనవరి 14 నుంచి న్యూజిలాండ్‌తో ఎటువంటి ఆంక్షలు లేని ప్రయాణాలు ప్రారంభమవుతాయని ఇటీవలే ప్రకటించింది. 2021 ప్రారంభంలో ఆక్లాండ్‌లో వైరస్ వ్యాప్తి చెందడంతో న్యూజిలాండ్‌తో స్వల్పకాలిక ట్రావెల్ బబూల్‌ ఒప్పందం చేసుకుంది కుక్ ఐలాండ్.