బంగారంలా మెరిసిపోతున్న ఈ చెట్టును చూడాలంటే రిజర్వేషన్ ఉండాల్సిందే

బంగారంలా మెరిసిపోతున్న ఈ చెట్టును చూడాలంటే రిజర్వేషన్ ఉండాల్సిందే

Reservation To See A Beautiful Tree

reservation to see a beautiful tree  : ఎక్కడికైనా వెళ్లాలంటే సౌకర్యం కోసం ముందుగానే రిజర్వేషన్ చేయించుకుంటాం. బస్సుల్లో, రైళ్లలో, విమానాల్లో సీట్లును ముందే కొనుక్కోవటానికి రిజర్వేషన్ చేయించుకోవాలి. అలాగే హోటల్స్, లాడ్జ్ ల్లో రూములు కావాలన్నా ముందుగానే బుక్ చేసుకుంటాం. అలా సినిమాలు చూడ్డానికి..హోటల్స్ లో టేబుల్స్ కూడా రిజర్వేషన్ చేసుకుంటూ ఉంటాం. ఇప్పుడీ సోది అంతా ఎందుకు? ఇవన్నీ సర్వసాధారణం పెద్ద విశేషమేమీ లేదు.. ఇంతోటి విషయం మాకు తెలీదా ఏంటీ? అంటారా? ఇదంతా తెలిసిన విషయం కాదనటంలేదు. కానీ.. ఓ చెట్టును చూడాలంటే ముందుగానే రిజర్వేషన్ చేయించుకోవాలనే సంగతి మీకు తెలుసా? ఆ చెట్టు ప్రత్యేకత అదే మరి..

1

 4

చైనాలోని షాంగ్జీ రాష్ట్రంలోని జోంగునాన్ కొండల్లో ఉందీ అరుదైన..అద్బుతమైన అందం ఈ చెట్టు సొంతం. బంగారంలా పసుపు పచ్చగా మెరిసిపోతుంటుంది. ఆ చెట్టు ‘‘గునియిన్ గమియవో’’ అనే బౌద్ధ ఆలయంలో ఉంటుంది. ఆ వృక్షరాజం ‘‘గింకో జిలోబా’’ అనే జాతికి చెందింది. దీని వయసు 1400 సంవత్సరాలు. ఈ భూమి మీద దీనికంటే వయసులో పెద్దవైన చెట్లు చాలానే ఉన్నాయి.

2

7

కానీ ఆకట్టుకునే రంగులో..అందానికే అందంగా..చందానికే చందంగా కనిపించే ఈ చెట్టు తర్వాతే ఏ చెట్టయినా అని ఆ చెట్టుని చూస్తే తప్పకుండా అనుకుంటాం. మిగతా కాలాల్లో ఆకపచ్చగా ఉండే ఈ చెట్టు ఆకులు శరత్కాలంలో మాత్రం మంత్రం వేసినట్లు మొత్తం బంగారు రంగులోకి మారిపోతుంది.

3

9

నేలపై రాలిన ఆకులను, చెట్టుపై ఉన్న ఆకులను చూస్తూ ఉంటే బంగారం ముద్దలు కట్టిన మరో ప్రపంచంలో ఉన్నట్లు అనుభూతి కలుగుతుంది. ఈ చెట్టుని చూసే కొద్దీ చూడాలనిపిస్తుంది. కళ్లు తిప్పుకోనివ్వని అందం దీని సొంతం. ఇది చెట్టా? లేదా బంగారమా? అనిపిస్తుంది. అత్యంత సుందరంగా కనిపించే ఈ చెట్టుని చూడటానికి జనం తండోపతండాలుగా భారీ సంఖ్యలో వస్తుంటారు. ఈ చెట్టు నుంచి రాలిపడ్డ ఆకుల్ని చూస్తే ఇవి ఆకులా? బంగారంతో చేసిన రేకులా? అనిపిస్తాయి.

8

 

10

అక్టోబర్, డిసెంబర్ నెలల మధ్య రోజూ 60 వేల మంది దీన్ని చూడ్డానికి వస్తున్నారంటే సీన్ అర్థం చేసుకోవచ్చు. దీన్ని చూడాలంటే క్యూలో నాలుగైదు గంటలు నిలబడాలి. అంతమంది ఉంటారు పర్యాటకులు. కరోనా టైం కాబట్టి రద్దీని తగ్గించడానికి ప్రస్తుతం పరిమిత సంఖ్యలో మాత్రమే అనుమతిస్తున్నారు. అందుకే ఈ చెట్టును చూడాలనుకునే వారు ముందే రిజర్వేషన్ చేయించుకోవాలి.

6

దీని కోసం ఓ వెబ్ సైట్ కూడా ఉందీ అంటే ఈ చెట్టు అందం ఎలా ఉంటుందో..దాన్ని ప్రత్యక్ష్యంగా చూస్తే ఎంత గొప్ప అనుభూతి కలుగుతుందో ఊహించుకోండీ..