Neeraj Chopra : ఫైనల్‌కు ముందు.. నీరజ్‌ను టెన్షన్ పెట్టిన పాకిస్తానీ
టోక్యో ఒలింపిక్స్‌లో జావెలిన్ త్రో విభాగంలో స్వర్ణం సాధించి భారత జావెలిన్ త్రోయర్ నీరజ్ చోప్రా చరిత్ర సృష్టించిన సంగతి తెలిసిందే. తొలిసారి ఒలింపిక్స్ ట్రాక్ అండ్ ఫీల్డ్ ఈవెంట్‌లో ఇ

Neeraj Chopra
Neeraj Chopra : టోక్యో ఒలింపిక్స్‌లో జావెలిన్ త్రో విభాగంలో స్వర్ణం సాధించి భారత జావెలిన్ త్రోయర్ నీరజ్ చోప్రా చరిత్ర సృష్టించిన సంగతి తెలిసిందే. తొలిసారి ఒలింపిక్స్ ట్రాక్ అండ్ ఫీల్డ్ ఈవెంట్‌లో ఇండియాకు గోల్డ్ మెడల్ సాధించిపెట్టాడు. ఆ విధంగా భారత అథ్లెటిక్స్ చరిత్రలో వందేళ్ల నిరీక్షణకు ముగింపు పలికాడు. కాగా, కీలకమైన ఫైనల్‌కు ముందు జరిగిన ఓ ఆసక్తికర ఘటనను నీరజ్ చోప్రా బయటపెట్టాడు.
తాను ఫైనల్‌కు సిద్ధమవుతున్న సమయంలో సడెన్‌గా తన జావెలిన్ కనిపించకుండా పోయిందని నీరజ్ చెప్పాడు. ఎంత వెతికిన జావెలిన్ కనిపించ లేదన్నాడు. అయితే సడెన్‌గా అది పాకిస్తాన్ కు చెందిన నదీమ్ అర్షద్ చేతుల్లో కనిపించింది. నా జావెలిన్‌తో అతడు అటూఇటూ తిరుగుతున్నాడు. అది చూసి.. భాయ్ ఆ జావెలిన్ ఇవ్వు. అది నాది. నేను ఫైనల్లో దానినే విసరాలి అని అడిగాను. దీంతో అర్షద్ దానిని తిరిగి ఇచ్చేశాడని నీరజ్ చెప్పుకొచ్చాడు. ఈ గందరగోళం వల్లే తాను తన తొలి త్రోను హడావిడిగా విసరాల్సి వచ్చిందని నీరజ్ వివరించాడు.
కాగా జావెలిన్ త్రో ఫైనల్లో పాకిస్తాన్ కు చెందిన నదీమ్ అర్షద్ 6వ స్థానాన్ని దక్కించుకోవడానికి బాగా కష్టపడ్డాడని నీరజ్ తెలిపాడు. ఎప్పటినుంచో మా ఇద్దరి మధ్య మంచి బంధం ఉందని వెల్లడిచాడు.
గోల్డ్ మెడల్ గెలిచి వచ్చినప్పటి నుంచీ నీరజ్ సన్మాన కార్యక్రమాలతో బిజీగా ఉన్నాడు. ఈ క్రమంలోనే అతడు అనారోగ్యానికి కూడా గురయ్యాడు. దీనిపై స్పందిస్తూ.. ఇది సరైన పద్ధతి కాదు. మెడల్ గెలవగానే ఇలా అన్నీ ఒకేసారి చేసేయడం. నెల రోజుల తర్వాత పట్టించుకోకపోవడం మంచిది కాదు. స్పోర్ట్స్‌కు ఎప్పుడూ ఇదే విధమైన అటెన్షన్ ఉండాలి. సిస్టమాటిక్ గా ఉండాలి అని 23ఏళ్ల నీరజ్ చెప్పాడు.
కాగా, బిజీ సన్మాన కార్యక్రమాలతో నీరజ్ కొంత అసౌకర్యానికి గురయ్యాడు. ఒక్కోసారి వేడి వాతావరణంలో సన్మానాలు జరిగాయి. మరోసారి ఏసీలో ఉండాల్సి వచ్చింది. నాకసలు రెస్ట్ దొరికేది కాదు. సరైన ఆహారం కూడా తీసుకోలేదు అని నీరజ్ వాపోయాడు.