NeoCov: కరోనా కొత్త వేరియంట్ కనుగొన్న సైంటిస్టులు.. ముగ్గురిలో ఒకరి మృతి ఖాయం | NeoCov: Wuhan Scientists Warn of New Coronavirus Strain

NeoCov: కరోనా కొత్త వేరియంట్ కనుగొన్న సైంటిస్టులు.. ముగ్గురిలో ఒకరి మృతి ఖాయం

వూహాన్ సైంటిస్టులు మరో కొత్త వేరియంట్ ను కనుగొన్నారు. ప్రస్తుతం దక్షిణాఫ్రికాలో కనిపిస్తున్న NeoCov అనే వేరియంట్ అత్యంత ప్రమాదకరమైనదిగా భావిస్తున్నారు..

NeoCov: కరోనా కొత్త వేరియంట్ కనుగొన్న సైంటిస్టులు.. ముగ్గురిలో ఒకరి మృతి ఖాయం

NeoCov: వూహాన్ సైంటిస్టులు మరో కొత్త వేరియంట్ ను కనుగొన్నారు. ప్రస్తుతం దక్షిణాఫ్రికాలో కనిపిస్తున్న NeoCov అనే వేరియంట్ అత్యంత ప్రమాదకరమైనదిగా భావిస్తున్నారు. సౌతాఫ్రికాలోని గబ్బిలాల్లో కనుగొన్న ఈ వైరస్.. హై డెత్, ట్రాన్స్ మిషన్ రేట్ రెండూ ఎక్కువే అని వివరించారు.

NewCov పూర్తిగా కొత్త వేరియంట్. చైనాలోని వూహాన్ సైంటిస్టులు జరిపిన పరిశోధనల్లో ఇంట్రస్టింగ్ విషయాలు బయటపడ్డట్లు రష్యా అధికారిక మీడియా సంస్ధ వెల్లడించింది. జంతువుల వరకే ఉన్న వైరస్ మనుషులకు వ్యాప్తి చెందకపోవడం శుభపరిణామం.

నియో కోవ్ వైరస్ గబ్బిలాల్లోని యాంజియోటెన్సిన్ – కన్వర్టింగ్ ఎంజైమ్ (ACE2) ప్రభావంతగా వాడుకుంటోందని గమనించారు. దీనితో పోలిస్తే మనుషుల్లోని AC2ను ఏమార్చి శరీరంలోకి ప్రవేశించే సామర్థ్యం కొంత తక్కువగా ఉన్నట్టు శాస్ర్తవేత్తలు గుర్తించారు. వుహాన్ యూనివర్సిటీ, బయోఫిజిక్స్ ఆఫ్ ది చైనీస్ అకాడమీ ఆప్ సైన్సెస్ కు చెందిన శాస్ర్తవేత్తలు సంయుక్తంగా జరిపిన పరిశోదనల్లో ఈ విషయం వెల్లడైంది.

2012, 2015లలో మిడిల్ ఈస్ట్ దేశాల్లో కనిపించిన.. మెర్స్ – కోవ్ మాదిరిగా భిన్నమైనదే కాకుండా ప్రమాదకరమైనదిగా హెచ్చరిస్తున్నారు. ఇది సోకిన ప్రతి ముగ్గురిలో ఒకరు కచ్చితంగా చనిపోతారని హెచ్చరిస్తున్నారు. మనుషుల్లోకి వ్యాపిస్తే సంక్రమణ వేగంగా ఉంటుందని సూచిస్తున్నారు.

Read Also: ఆగిపోయిన బాహుబలి వెబ్ సిరీస్.. మన వాళ్ళకి అంత సీన్ లేదా?

2012, 2015లలో మిడిల్ ఈస్ట్ దేశాల్లో కనిపించిన.. మెర్స్ – కోవ్ మాదిరిగా భిన్నమైనదే కాకుండా ప్రమాదకరమైనదిగా హెచ్చరిస్తున్నారు. ఇది సోకిన ప్రతి ముగ్గురిలో ఒకరు కచ్చితంగా చనిపోతారని హెచ్చరిస్తున్నారు. మనుషుల్లోకి వ్యాపిస్తే వేగంగా సంక్రమిస్తుందని సూచిస్తున్నారు.

×