World Shortest: ప్రపంచంలో అత్యంత పొట్టి వ్యక్తికి గిన్నీస్ రికార్డ్

: నేపాల్‌కు చెందిన దార్ బహదూర్ ఖపాంగి అనే టీనేజర్‌కు ప్రపంచంలోనే అత్యంత పొట్టివ్యక్తి రికార్డు దక్కింది. 2004 నవంబర్ 14న పుట్టిన ఖపాంగికి ఇప్పటికి 17ఏళ్లు. నేపాల్ లోని కాట్మండులో 2022 మార్చి 23న కొలతలు కొలిచి నిర్ధారించారు.

World Shortest: ప్రపంచంలో అత్యంత పొట్టి వ్యక్తికి గిన్నీస్ రికార్డ్

World Shortest

World Shortest: నేపాల్‌కు చెందిన దార్ బహదూర్ ఖపాంగి అనే టీనేజర్‌కు ప్రపంచంలోనే అత్యంత పొట్టివ్యక్తి రికార్డు దక్కింది. 2004 నవంబర్ 14న పుట్టిన ఖపాంగికి ఇప్పటికి 17ఏళ్లు. నేపాల్ లోని కాట్మండులో 2022 మార్చి 23న కొలతలు కొలిచి నిర్ధారించారు.

నేపాల్ రాజధానిలో, ఖపాంగి సగటు ఎత్తు 73.43 సెం.మీ (2 అడుగుల 4.9 అంగుళాలు)గా కన్ఫామ్ అయింది. నేపాల్ టూరిజం బోర్డు సీఈవో ధనంజయ్ రెగ్మీ ఆధ్వర్యంలో ఖపాంగికి గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ సర్టిఫికెట్‌ను అందజేశారు.

“మా అన్నకు గిన్నిస్‌ వరల్డ్‌ రికార్డ్‌ సర్టిఫికేట్‌ రావడం సంతోషంగా ఉంది’’ అని ఖపాంగి అన్నయ్య నారా బహదూర్‌ ఖపాంగి అన్నారు.

నేపాల్ లోని రైతు కుటుంబానికి చెందిన ఈ వ్యక్తి ఇంట్లో చిన్న కొడుకు.. ఖపాంగి తన తల్లిదండ్రులు, తోబుట్టువులతో సింధులి జిల్లాలో నివసిస్తున్నారు. ప్రస్తుతం తన గ్రామంలోనే చదువుకుంటున్నాడు. గిన్నీస్ వరల్డ్ రికార్డ్స్ ద్వారా గుర్తింపు పొందడం ఖపాంగి చదువుకు మరింత సహాయపడుతుందని అతని సోదరుడు ఆశిస్తున్నాడు.

Read Also: 75ఏళ్ల వ్యక్తి చేసిన ఈ ఫీట్‌తో గిన్నీస్ వరల్డ్ రికార్డ్

“దోర్ బహదూర్ పుట్టినప్పుడు అంతా బాగానే ఉన్నాడు. ఏడేళ్ల వయస్సు నుంచి ఎదుగుదలలో మార్పులేదు. అతనితో పాటు ఉన్న వాళ్ల ఎత్తులో మార్పు కనిపించింది. ఎందుకో మాకు తెలియదు,” అని నారా బహదూర్ ఖపాంగి వెల్లడించారు.

ఇంతకుముందు, అత్యంత పొట్టిగా జీవించే పురుషుడు టైటిల్ ఖగేంద్ర థాపా మగర్ చేతిలో ఉండేది. ఖగేంద్ర కూడా నేపాలీయే. అక్టోబరు 1992లో జన్మించిన ఖగేంద్రకు ఆదిమ మరగుజ్జు ఉంది. 65.58 సెం.మీ (2 అడుగుల 1.8 అంగుళాలు)

ప్రపంచంలోనే పొట్టి స్త్రీగా భారతదేశానికి చెందిన జ్యోతి అమ్గే 62.8 సెం.మీ (2 అడుగుల 0.72 అంగుళాలు) పేరు దక్కించుకున్నారు.