హ్యాట్సాఫ్ : 14 వేలమంది చివరి కోరిక తీర్చిన అంబులెన్స్ డ్రైవర్

  • Published By: veegamteam ,Published On : February 5, 2020 / 06:04 AM IST
హ్యాట్సాఫ్ : 14 వేలమంది చివరి కోరిక తీర్చిన అంబులెన్స్ డ్రైవర్

నెదర్లాండ్స్‌కు చెందిన పారామెడికో అంబులెన్స్ డ్రైవర్ కీస్ వెల్దోబోర్‌ 14 వేల మంది చివరి కోరికను తీర్చాడు. ప్రస్తుతం అతని వయస్సు 61 సంవత్సరాలు. 20ఏళ్లు అంబులెన్స్ డ్రైవర్ గా పనిచేసి రిటైర్ అయిన తరువాత కూడా తన అంబులెన్స్ సేవల్ని కొనసాగించాడు. అంబులెన్స్ విష్ ఫౌండేషన్ స్థాపించి..సొంతగా ఓ అంబులెన్స్ ను కొని అవసరమైనవారికి సహాయం చేసేవాడు.  రోజుకు కనీసం ఆరుగురుకి సహాయం చేసేవాడు.

వెల్దోబోర్ చేసే సేవల్లో అతని భార్య ఇనేకే సహాయ సహకారాలు ఎంతగానో ఉండేవి. ఈ క్రమంలో కీస్ వెల్దోబోర్‌కు ఎదురైన ఓ ఘటన అతని జీవితాన్నే మార్చివేసింది. తన అంబులెన్స్ సేవల్లో భాగంగా కీస్ వెల్దోబోర్‌ ఒకసారి దీర్ఘకాలిక వ్యాధితో బాధపడుతున్న ఒక వ్యక్తిని ఆసుపత్రికి తీసుకువెళుతున్నాడు. ఈ సమయంలో కీస్ వెల్దోబోర్‌ అతనితో ఆదరంగా మాట్లాడటంతో ఆ పేషెంట్ కూడా తన మనస్సువిప్పి మాట్లాడాడుతూ..తనకు తన భార్యతో కలిసి  మంచును చూడాలని ఉందని తెలిపాడు. అలా సదరు పేషెంట్ చివరి కోరిను తీర్చాడు. మంచు వద్దకు తీసుకెళ్లాడు. అది చూసిన ఆ వృద్ధ జంట ఎంతగా సంతోషపడ్డారు.  కీస్ వెల్దోబోర్‌ మా జీవితంలో చూడలేమనుకున్నది చూపించావంటూ ధన్యవాదాలు తెలిపారు. 

అలా అలా ఇప్పటి వరకూ కీస్ వెల్దోబోర్‌ 14 వేలమంది రోగుల చివరి కోర్కెను తీర్చాడు.ఈ సందర్భంగా వెల్దోబోర్‌ మాట్లాడుతూ..తన అంబులెన్స్ లో ఫుట్‌బాల్ మ్యాచ్ చూడాలనుకునేవారికి మ్యాచ్ చూపించటం, కార్ రేస్ కోర్స్ చూపించడం, ఎగ్జిబిషన్, జూ పార్కులకు తీసుకువెళ్లడం ఇలా రకరకాలుగా వారి చివరి కోర్కెలను తీర్చానని ఇప్పటి వరకూ తన అంబులెన్స్ లో 14వేల మంది చివరి కోరికలు తీర్చానని తెలిపారు. 

1

అలా నెదర్లాండ్ కు చెందిన ఓ టీనేజర్ ను స్విట్జర్లాండ్ లోని పర్వతాలను చూడాలని ఉందని చెప్పటంతో కీస్ వెల్దోబోర్ అక్కడకు తీసుకెళ్లటంతో ఒళ్లంతా కళ్లు చేసుకుని ఆ పర్వతాలను చూస్తూ మనసారా ఆస్వాదించింది. ఆతరువాత ఆమె రెండు రోజులకు మరణించింది. అలా ఆ  టీనేజర్  చివరి కోరిక తీర్చాడు వెల్దోబోర్. 

ఓ వృద్ధురాలు మరణించే సమయంలో తనకు బాగా కావాల్సిన వారి వివాహం చూడాలని అనుకుంది.అలా ఆమెను అంబులెన్స్ లో వివాహానికి తీసుకెళ్లారు కీస్ వెల్దోబోర్ జంట. మరొక రోగి తనకు బీచ్ చూడాలని ఉందని చెప్పటం వారుతీసుకెళ్లటం. మరో అమ్మమ్మ తన మనుమడిని చూడాలని చెప్పటంతో వారు తీసుకెళ్లటం.. మరో ఇద్దరు మహిళలు లేడీస్ ఎల్బర్గ్ లోని ఇసుక శిల్పాల మ్యూజియంను చూడాలనుకోగా వారిని అక్కడకు తీసుకెళ్లారు.ఇలా 14వేలమంది చివరికోరికను తీర్చారు కీస్ వెల్దోబోర్ జంట.

2

కాగా..అనారోగ్యంతో బాధపడుతున్న రోగులకు 24 గంటల వైద్య సంరక్షణ అవసరం. అందుకోసం కీస్ వెల్దోబోర్ స్థాపించిన ‘‘విష్ ఫౌండేషన్’’ సంస్థలో 270 మంది  వైద్య శిక్షఃణ పొందిన వాలంటీర్లు సిద్ధంగా ఉంటారు. అత్యవసర పరిస్థితుల్లో వీరు 24 గంటలూ సేవలో అందుబాటులో ఉంటారు. రోగులతో ఆత్మీయంగా మాట్లాడుతుంటారు. వారి కుటుంబ సభ్యులు..స్నేహితులో జరిగిన తీపి జ్నాపకాలను అడిగి తెలుసుకుంటారు. రోగులు నీరసంగా ఉన్న సమయంలో వాటిని గుర్తు చేసి వారిలో ఆనందాన్ని నింపుతారు. రోగుల చివరి రోజుల్లో వారు ఆనందంగా ఉంచటంతో కీస్ వెల్దోబోర్ జంటతో పాటు వాలంటీర్లు అంకిత భావంతో పనిచేస్తుంటారు. 

3

 

4