అప్పుడే పుట్టిన శిశువుకు కరోనా పాజిటివ్!! గర్భంలో ఉండగానే వైరస్ సోకిందా?!

  • Published By: veegamteam ,Published On : March 14, 2020 / 10:55 AM IST
అప్పుడే పుట్టిన శిశువుకు కరోనా పాజిటివ్!! గర్భంలో ఉండగానే వైరస్ సోకిందా?!

పొత్తిళ్లలో పసిబిడ్డ కరోనా సోకింది. బిడ్డ పుట్టిందని ఆ తల్లి సంతోషంతో మురిసిపోతున్న సమయంలో బిడ్డకు కరోనా సోకిందని తెలిసి ఆ తల్లి తల్లడిల్లిపోతున్న ఘటన లండన్‌లో నార్త్ మిడిల్‌సెక్స్ విశ్వవిద్యాలయ హాస్పిటల్ లో చోటుచేసుకుంది. అప్పుడే పుట్టిన శిశువుకు కరోనా సోకిందనే వార్త.. బ్రిటన్ మీడియాలో శుక్రవారం ప్రముఖంగా ప్రచురితమైంది. కరోనా సోకి అతి బిడ్డ ఈ శిశువే కావడం ఆందోళన కలిగించే మాట. 

తల్లి న్యుమోనియా వచ్చిందేనే అనుమానంతో డాక్టర్లు ఆమెకు ప్రసవానికి కొద్ది గంటల ముందే నార్త్ మిడిల్‌సెక్సె ఆసుపత్రికి తరలించారు. కాసేపట్లో డెలివరీ అవుతున్న ఆమె అటువంటి పరిస్థితుల్లో ఉండటంతో డాక్టర్లు ఆందోలన పడ్డారు. వెంటనే కరోనా కరోనా  పరీక్షలు నిర్వహించారు. కానీ రిపోర్టు వచ్చే లోపే ఆమె ప్రసవించింది. పండంటి బిడ్డ పుట్టింది. (కరోనా వైరస్‌పై కీలక నిర్ణయం : మార్చి 31 వరకు హైదరాబాద్ షట్ డౌన్)

కానీ టెస్టుల రిపోర్ట్ వచ్చాయి. ఆమెకు కరోనా సోకినట్టు నిర్ధారణ అయ్యింది.దీంతో డాక్టర్లు..పుట్టిన బిడ్డకు (నవజాత శిశువుకు’ కూడా కరోనా పరీక్షలు చేశారు. రిపోర్ట్ వచ్చాయి. బిడ్డకు పాజిటివ్ అని తేలింది. దీంతో తల్లిని ప్రత్యేక ఆసుపత్రికి తరలించారు.బిడ్డను వేరే హాస్పిటల్ కు తరలించి ఇద్దరికీ  వేర్వేరు హాస్పిటల్స్‌లో డాక్టర్లు వైద్యం అందిస్తున్నారు. శిశువు గర్భంలో ఉండగా కరోనా వైరస్ సోకిందా లేక ప్రసవం తరువాతా అనే విషయం తేలాల్సి ఉంది. కాగా లండన్‌లో కరోనా బాధితుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది.