TikTok New Challenge : టిక్‌టాక్‌లో కొత్త చాలెంజ్.. తంతే డోర్ విరగాల్సిందే
సోషల్ మీడియాలో చాలెంజ్‌ల పర్వం కొనసాగుతుంది.. వారానికో కొత్త చాలెంజ్‌తో నెటిజన్లు తెగ ఎంజాయి చేస్తున్నారు.

Tiktok New Challenge
TikTok New Challenge : : సోషల్ మీడియాలో చాలెంజ్‌ల పర్వం కొనసాగుతుంది.. వారానికో కొత్త చాలెంజ్‌తో నెటిజన్లు తెగ ఎంజాయి చేస్తున్నారు. ఈ చాలెంజ్‌ల పర్వం ఎక్కువగా టిక్‌టాక్‌లోనే జరుగుతుంది. ఇది భారత్‌లో బ్యాన్ అయింది కానీ.. ఇతర దేశాల్లో మాత్రం హల్‌చల్ చేస్తుంది. ఇక టిక్‌టాక్ వీడియో క్రియేటర్లు కొత్త కొత్త వీడియోలతో నెటిజన్లకు ఆహ్లాదాన్ని పంచుతున్నారు. వీడియోలే కాదు చాలెంజ్‌లు కూడా విసుకుంటున్నారు.
చదవండి : TikTok Ban : నాల్గోసారి.. టిక్‌టాక్‌పై నిషేధం ఎత్తేసిన పాక్!
తాజాగా మిల్క్ ట్రే చాలెంజ్ టిక్‌టాక్‌లో తెగ ఫేమస్ అయింది. పిరమిడ్ ఆకారంలో మిల్క్ ట్రేలను అమర్చి.. వాటిపై ఎక్కి చివరి ట్రే వరకు చేరుకొని ఫోటో, వీడియో తీసి టిక్‌టాక్‌లో షేర్ చేసి.. ఆ చాలెంజ్‌ను మరికొందరికి విసరాలి. అయితే.. పిరమిడ్ ఆకారంలో అమర్చిన ట్రేలపై ఎక్కే క్రమంలో చాలామంది కింద పడి కాళ్లు చేతులు కూడా విరగ్గొట్టుకున్నారు.
ఇక తాజాగా మరో చాలెంజ్ టిక్‌టాక్‌లో చక్కర్లు కొడుతోంది. కెనడాలోని నార్త్‌బే సిటీలో ఈ చాలెంజ్ తెగ వైరల్ అవుతోంది. ఫేమస్ సాంగ్ డై యంగ్ అనే పాట ప్లే అవుతున్నప్పుడు ఇంటి డోర్ ముందు నిలబడి.. డోర్‌ను కాళ్లతో తన్నాల్సి ఉంటుంది. కాలితో డోర్ తన్నాలి కాబట్టి ఈ చాలెంజ్ పేరును డోర్‌కిక్ చాలెంజ్ పెట్టారు. అయితే ఈ చాలెంజ్ వలన కొందరు చిక్కుల్లో పడ్డారంట.. ఇంట్లో వారికి తెలియకుండా ఇంటి డోర్ తన్నడంతో దొంగలు వచ్చారేమో అనే భయంతో ఇంట్లోని వారు పోలీసులకు ఫిర్యాదు చేసిన సందర్భాలు కుండా ఉన్నాయట. పలు అపార్ట్‌మెంట్స్‌లో ప్రపార్టీలు డ్యామేజ్ అవడం జరిగిందట.
చదవండి : TikTok Star : 2027 నాటికి భూమిపై ఇతనొక్కడే బతికి ఉంటాడట..!
దీంతో అప్రమత్తమైన పోలీసులు ఇటువంటి వారిపై ఓ నిఘా పెట్టారు. చాలెంజ్ ల పేరుతో ఇంటి తలుపును ఎవరు తన్నినా.. డ్యామేజ్ చేసినా చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారట. అయితే ఈ చాలెంజ్ ని కొందరు ఆకతాయిలు రాత్రిపూట చేస్తుండటంతో హడలిపోతున్నారు ప్రజలు.
Y’all wild for this ??? pic.twitter.com/8L0uzsaYDo
— Where’s the Gifts ? (@_JayPeg) October 24, 2021