New corona : మలేషియాలో కొత్త కరోనా….కుక్కల ద్వారా మనుషుల్లోకి..

New corona : మలేషియాలో కొత్త కరోనా….కుక్కల ద్వారా మనుషుల్లోకి..

New Coronavirus In Malaysia

New Coronavirus in Malaysia : కరోనా…కరోనా ప్రపంచ వ్యాప్తంగా ఈ మహమ్మారికి భయపడని దేశమంటూ లేదు. మనుషుల ప్రాణాలు తీస్తున్నీ ఈకరోనా విభిన్న రూపాలు మార్చుకుంటూ ప్రభావాన్ని చూపిస్తోంది. వాతావరణానికి అనుగుణంగా మారిపోతూ..జనాల ఉసురు తీస్తున్న ఈ వైరస్ ఇప్పటి వరకూ మనుషుల నుంచి మనుషులకు వ్యాపిస్తో మహమ్మారిగా మారియింది. కానీ కరోనాలో మరో రకం కరోనా వైరస్‌ను శాస్త్రవేత్తలు గుర్తించారు. మలేసియాలో వెలుగుచూసిన ఈ వైరస్ కుక్కల నుంచి మనుషుల్లోకి చొరబడుతోందని శాస్త్రవేత్తలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.

దీనివల్ల మనుషులకు ప్రమాదం జరిగినట్లుగా ఎటువంటి ఆధారాలు లభ్యం కాకపోవటం కాస్త ఊరట కలిగించే అంశమని చెప్పవచ్చు. ఈ కొత్తరకం వైరస్‌కు శాస్త్రవేత్తలు ‘సీసీవోవీ-హెచ్‌యూపీఎన్-2018’ అని పేరుపెట్టారు. కరోనా కారక సార్స్‌కోవ్-2 తర్వాత మానవుల్లోకి వచ్చిన వైరస్ ఇదేనని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.

2017-18 మధ్య న్యూమోనియా బారినపడి కొందరు బాధితుల నమూనాలను పరీక్షించగా..ఈ వైరస్ వెలుగులోకి వచ్చిందని తెలిపారు. కరోనా కారక సార్స్‌కోవ్-2 తర్వాత మానవుల్లోకి వచ్చిన వైరస్ ఇదేనని తెలిపారు. కుక్కల్లోంచి కరోనా వైరస్‌ను మనుషుల్లో గుర్తించడం ఇదే తొలిసారని శాస్త్రవేత్తలు తెలిపారు. ఈ వైరస్ మానవుల నుంచి మానవులకు సోకుతుందా? అనేది మరింత అధ్యయనం చేయాల్సి ఉంది. ఇలాంటి వైరస్‌లు రాత్రికి రాత్రే మహమ్మారిగా మారే అవకాశం లేదని స్పష్టం చేశారు. మనుషుల శరీరంలోని రోగ నిరోధకశక్తికి అనుగుణంగా ఈ వైరస్ మారుతుందని ఈ క్రమంలో ఇన్ఫెక్షన్ కలిగించడానికి కొన్ని సంవత్సరాలు పట్టవచ్చని శాస్త్రవేత్తలు అంచనావేశారు.

కాగా..కరోనా పేరు చెబితేనే ప్రజలు హడలిపోతున్న ఈ మహమ్మారి క్రమంలో కుక్కల నుంచి మనుషుల్లోకి సోకినా..ఇది ప్రమాదకరం కాదని సైంటిస్టులు చెబుతున్నా..ప్రజలు మాత్రం తీవ్ర్ భయాందోళనలు వ్యక్తంచేస్తున్నారు.