కరోనావైరస్‌‌ కొత్త లక్షణాలు : ముందస్తు హెచ్చరిక సంకేతాలివే..!

  • Published By: sreehari ,Published On : November 30, 2020 / 10:10 AM IST
కరోనావైరస్‌‌ కొత్త లక్షణాలు : ముందస్తు హెచ్చరిక సంకేతాలివే..!

New coronavirus symptoms : ప్రపంచాన్ని వణికిస్తోన్న కరోనా వైరస్ వేగంగా మ్యుటేషన్ అవుతోంది. కరోనా వైరస్ లక్షణాలు కూడా మారిపోతున్నాయి. కొత్త కరోనా లక్షణాలు బయటపడుతున్నాయి. ఏది కరోనా లక్షణం ఏది కాదో తెలియని పరిస్థితి. ఇప్పటికే లక్షణాలు లేని చాలామంది రోగుల్లో కరోనా వైరస్ వచ్చిపోయిన

సంగతి బయటపడటం లేదు. ఇలాంటి పరిస్థితుల్లో కరోనావైరస్ మరిన్ని కొత్త లక్షణాలు పుట్టుకొస్తున్నాయి. ఈ కొత్త లక్షణాలు ముందస్తు హెచ్చరిక సంకేతాలుగా చెప్పవచ్చు. బార్సిలోనా యూనివర్శిటీలో పరిశోధకులు జరిపిన ఓ కొత్త అధ్యయనంలో.. కరోనావైరస్ ఉన్న కొంతమంది వ్యక్తులు నాసికా సంబంధిత లక్షణాలను అనుభవించారని గుర్తించారు.



అధ్యయనం ప్రకారం.. నాసికాలో పొడిబారడం వంటి లక్షణాలు కనిపించాయని గుర్తించారు. వాస్తవానికి కరోనావైరస్ బాధితుల్లో రుచి, వాసన సామర్థ్యాన్ని కోల్పవడం అనేది వైరస్ లక్షణాల్లో ఒకటిగా చెప్పొచ్చు.

కరోనా వైరస్ వ్యాప్తిపై లోతుగా అధ్యయనం చేసిన వైద్యులు, ఆరోగ్య పరిశోధకులు కరోనావైరస్ కొత్త లక్షణాలను గుర్తించారు. కరోనా రోగులు అనుభవించని లక్షణాల కంటే జ్వరం, దగ్గు అలసట వంటివి చాలా సాధారణ లక్షణాలు మాత్రమే.



అందుకే ఫ్లూ మాదిరి కరోనా లక్షణాలు ఉండటంతో కరోనా పరీక్ష చేయించుకుంటే తప్పా బయటపడటం లేదు. నార్త్ వెస్ట్రన్ మెడిసిన్ ఇటీవల జరిపిన ఒక అధ్యయనంలో 82శాతం కరోనావైరస్ బాధితుల్లో ఆస్పత్రిలో చేరేంతగా తీవ్రమైన లక్షణాలు ఉన్నాయని కనుగొన్నారు.

జ్ఞాపకశక్తి కోల్పోవడం, గందరగోళం, సుదీర్ఘకాలం ఒక పనిపై దృష్టి పెట్టలేకపోవడం వంటి అనేక లక్షణాలు సాధారణ లక్షణాల జాబితాలో చేరాయి.

భయానక విషయం ఏమిటంటే.. చాలా మంది కరోనావైరస్ బాధిుతుల ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యాక కూడా కొన్ని వారాలు, నెలల పాటు నాడీ సమస్యలతో బాధపడ్డారు.

కరోనావైరస్ రోగం నిర్ధారణ అయిన నెలల తర్వాత ఊపిరితిత్తులు, గుండె దెబ్బతినడం వంటి సమస్యలను ఎదుర్కోనే సమస్య ఉందని అంటున్నారు.


లక్షణాలు లేని రోగుల్లో ఊపిరితిత్తులు, గుండె దెబ్బతినడాన్ని ఇమేజింగ్, లేదా ఎంఆర్ఐ వంటి సున్నితమైన ఇమేజింగ్ టెక్నాలజీల ద్వారా నిర్ధారణ చేసే అవకాశం ఉంది.

కరోనా నుంచి పూర్తిగా కోలుకున్నాక వైరస్ లక్షణాలు లేని అనేక మంది వ్యక్తుల్లో మంటగా అనిపించడం వంటి సమస్యలను నిర్ధారించినట్టు డాక్టర్ ఆంథోనీ చెప్పారు.