DNA Test: డీఎన్ఏ పరీక్షల ఆధారంగా చిన్నారుల కెరీర్ ప్రణాళిక చేసుకోవచ్చా? ఇందుకోసం సాప్ట్‌వేర్ సిద్ధమైందట!

ముస్తఫా రూపొందించిన సాప్ట్‌వేర్ పిల్లల్లోని జన్యువుల విశ్లేషణపై ఆధారపడి వారు ఎలాంటి నైపుణ్యం కలిగిఉన్నారో గుర్తించి వారికి అనువైన కెరీర్‌ను ప్రణాళిక చేసుకొనే అవకాశం ఉంటుంది.

DNA Test: డీఎన్ఏ పరీక్షల ఆధారంగా చిన్నారుల కెరీర్ ప్రణాళిక చేసుకోవచ్చా? ఇందుకోసం సాప్ట్‌వేర్ సిద్ధమైందట!

build career plans

Mohammad Mustafa: ప్రతి చిన్నారికీ ప్రత్యేక నైపుణ్యాలు ఉంటాయి. వాటిని గుర్తించి వారిని ఆ రంగంలో శిక్షణ అందిస్తే అద్భుతాలు సృష్టించటం పెద్దపనేం కాదు. అయితే, పిల్లల్లో సామర్థ్యాలను గుర్తించి వారిని ఆయా రంగాల్లో ఉన్నతులుగా తీర్చిదిద్దడం అనేది కష్టమైన పనే. ఇందుకోసం భారత అమెరికన్ వ్యాపార వేత్త మహ్మద్ ముస్తఫా ఓ సాప్ట్‌వేర్‌ను రూపొందించారు. ఈ సాప్ట్ వేర్ పిల్లల లాలాజలం నుంచి సేకరించిన జన్యవులను విశ్లేషించడం ద్వారా వారికి అనువైన కెరీర్ ప్రణాళికను సూచిస్తుందట. దీంతో పిల్లలకు 10 – 15 సంవత్సరాల వయస్సు వరకు వారి కెరీర్ వృద్ధి, నైపుణ్య ప్రణాళికను సాప్ట్‌వేర్ ద్వారా మేం అందించగలమని ముస్తఫా చెప్పారు.

Wrestlers Protest: ప్రభుత్వం ఎవరినీ రక్షించడం లేదు.. రెజ్లర్ల సమస్యపై క్రీడా మంత్రి అనురాగ్ ఠాకూర్ కీలక వ్యాఖ్యలు

ప్రతి చిన్నారిలో ప్రత్యేక నైపుణ్యాలు ఉంటాయి. ముస్తఫా రూపొందించిన సాప్ట్‌వేర్ పిల్లల్లోని జన్యువుల విశ్లేషణపై ఆధారపడి వారు ఎలాంటి నైపుణ్యం కలిగిఉన్నారో గుర్తించి వారికి అనువైన కెరీర్‌ను ప్రణాళిక చేసుకొనే అవకాశం ఉంటుంది. దీని ఆధారంగా సంబంధిత చిన్నారికి ప్రత్యేకమైన పాఠశాల విద్యను అందించొచ్చని, దీనిద్వారా మెరుగైన భారతదేశాన్ని నిర్మించగలమని ముస్తఫా వివరించారు. అయితే, పిల్లల సామర్థ్యాన్ని జన్యువుల ద్వారా తెలుసుకోవడానికి పూర్తిస్థాయిలో జీన్ మ్యాపింగ్ చేస్తామని ముస్తఫా తెలిపారు.

Rahul Gandhi: భారత్‌లో రెండు సిద్ధాంతాల మధ్య పోరాటం.. న్యూయార్క్‌లో బీజేపీ, ఆర్ఎస్ఎస్‌పై రాహుల్ గాంధీ సంచలన వ్యాఖ్యలు

భారత్ విద్యా వ్యవస్థతో పాటు ప్రపంచ వ్యాప్తంగా ప్రతి చిన్నారికి అన్నీ బోధించాలి అనే రీతిలో విద్యావిధానం సాగుతుంది. తర్వాతి దశలో కొన్ని దేశాలు మేధో పరీక్షలు నిర్వహించి పిల్లల సామర్థ్యాన్ని అర్థం చేసుకోవటానికి ప్రయత్నాలు చేస్తున్నాయి. వాటి ఆధారంగా చిన్నారుల కెరీర్‌ను నిర్ణయిస్తున్నారు. తాజాగా భారత అమెరికన్ వ్యాపారవేత్త మహ్మద్ ముస్తఫా రూపొందించిన సాప్ట్‌వేర్ ద్వారా 10 – 15ఏళ్ల వరకు చిన్నారుల కెరీర్‌ను మనమే ప్రణాళిక చేసుకొనే అవకాశం వస్తుండటం గమనార్హం. అయితే, దీనిని ఇప్పటి వరకు ఉపయోగించనప్పటికీ.. ఇది దేశాల్లోని ప్రతిభను సరైన మార్గంలో నిర్మించడంలో సహాయపడుతుందని ముస్తఫాతో పాటు పలువురి వాదన.