Chinese Woman: చైనా భద్రతా దళాలకు ఎదురు నిలిచిన మహిళ… సిబ్బంది ఏం చేశారో చూడండి.. వీడియో వైరల్

చైనాలో కోవిడ్ ఆంక్షల్ని ఎత్తివేయాలని కోరుతూ ప్రజలు తీవ్రంగా ఉద్యమిస్తున్నారు. ప్రభుత్వం భద్రతా దళాలతో వాటిని అణచివేస్తోంది. అయితే, తాజాగా ఒక మహిళ భద్రతా దళాలకు ఎదురు నిల్చింది.

Chinese Woman: చైనా భద్రతా దళాలకు ఎదురు నిలిచిన మహిళ… సిబ్బంది ఏం చేశారో చూడండి.. వీడియో వైరల్

Chinese Woman: చైనాలో కోవిడ్ రూల్స్‌కు వ్యతిరేకంగా పౌరుల నిరసనలు కొనసాగుతున్నాయి. అయితే, ఎక్కడికక్కడ నిరసనల్ని ఆపేసేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. దీనికోసం చైనా భద్రతా దళాల్ని వినియోగిస్తోంది. అయినప్పటికీ ప్రజలు వెనుదిరగడం లేదు. తాజాగా చైనాలో ఒక మహిళ భద్రతా దళాలకు ఎదురు నిల్చింది.

Delhi Murder: శ్రద్ధా తరహాలో మరో హత్య.. భర్త శవాన్ని పది ముక్కలుగా నరికి ఫ్రిజ్‌లో దాచిన భార్య

భద్రతా దళాలు నిరసనల్ని అడ్డుకునేందుకు ప్రయత్నిస్తుంటే ఒక మహిళ వారికి ఎదురుగా వెళ్లి నిలబడింది. చుట్టపక్కల వాళ్లపై దాడి చేస్తున్నా కదలకుండా అలాగే ఉంది. తన మొబైల్ ఫోన్‌తో అక్కడి దృశ్యాల్ని చిత్రీకరించేందుకు ప్రయత్నించింది. అయితే, భద్రతా సిబ్బంది ఆమెపై దాడి చేశారు. అది కూడా మగవాళ్లైన సిబ్బంది ఆమెను తోసేశారు. ఫోన్ కింద పడేశారు. దూరంగా లాక్కెళ్లి కొట్టారు. ఈ దృశ్యాన్ని అక్కడున్న కొందరు వీడియో తీశారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. నెటిజన్లు ఆమె ధైర్యాన్ని ప్రశంసిస్తున్నారు. ఆమెను ‘ట్యాంక్ మ్యాన్’తో పోలుస్తున్నారు. చైనాలోనే 1989లో ఒక వ్యక్తి యుద్ధ ట్యాంకులకు ఎదురుగా నిలబడ్డాడు.

Ruturaj Gaikwad: ఒకే ఓవర్లో ఏడు సిక్సర్లు.. సరికొత్త చరిత్ర సృష్టించిన రుతురాజ్ గైక్వాడ్.. ట్రెండింగ్ వీడియో

సైన్యానికి ఎదురు నిలిచిన అతడి ధైర్యాన్ని అప్పట్లో అందరూ మెచ్చుకున్నారు. పేరు తెలియని ఆ వ్యక్తిని అప్పట్నుంచి ‘ట్యాంక్ మ్యాన్’గా పిలవడం మొదలుపెట్టారు. ఇప్పుడు కూడా పేరు తెలియని ఈ చైనా మహిళను ఆయనతో పోలుస్తూ నెటిజన్లు ఈ వీడియోను వైరల్ చేస్తున్నారు. కాగా, ప్రజలు కోవిడ్ నిబంధనలపై తీవ్ర నిరసన వ్యక్తం చేస్తుండటంతో ప్రభుత్వం కొన్ని చోట్ల స్వల్పంగా ఆంక్షలు ఎత్తివేసింది. అయితే, కోవిడ్ నిబంధనల్ని పూర్తిగా తొలగించాలని కోరుతూ ప్రజలు చేస్తున్న ఆందోళనలు ఇంకా పెరుగుతూనే ఉన్నాయి.