Finland to India : 9 దేశాలు దాటి..ఫిన్లాండ్ To ఇండియాకు సరుకు తరలింపు..రవాణా చరిత్రలోనే కొత్త అధ్యాయం..

రవాణా చరిత్రలోనే ఇదో కొత్త అధ్యాయానికి శ్రీకారం. 9 దేశాలు దాటి..ఫిన్లాండ్ To ఇండియాకు సరుకు తరలింపు జరుగుతోంది. ఫిన్లాండ్ నుంచి ఇండియాకు సరుకు రవాణా చేయటం ఇప్పుడు చాలా తక్కువ ఖర్చుతో..చాలా తక్కువ సమయంలోనే జరిగుతోంది.

Finland to India : 9 దేశాలు దాటి..ఫిన్లాండ్ To ఇండియాకు సరుకు తరలింపు..రవాణా చరిత్రలోనే కొత్త అధ్యాయం..

Finland To India Transport (1)

Finland to India Super Transport : సరకు రవాణాలో అద్భుతం. తొమ్మిది దేశాలు.. 25రోజులు.. మూడు రకాల మార్గాలు దాటుకొని.. సరుకు యూరప్ నుంచి ఇండియాకు చేరుకోబోతోంది. యూరప్, సెంట్రల్ ఏసియా దేశాల ద్వారా ట్రావెల్ అవుతూ అది ఇండియాకు చేరుకోబోతోంది. ఇంతకీ ఈ రవాణా ప్రత్యేకత ఏంటంటే..ఏ వస్తువు అయినా.. ఎగుమతి అయినా దిగుమతి అయినా చేసుకోవాలంటే జల, వాయు, భూ మార్గాలు ఉంటాయనే విషయం తెలిసిందే. సముద్రమో, రైలో, లేక విమానమో అంటాం. అలాంటిది మూడు మార్గాల్లో జరిగితే..! సూపర్ అనిపిస్తోంది. ఫిన్‌లాండ్‌లో సరుకు లోడ్ చేసుకున్న ఓ రైలు.. ఇండియా వైపు దూసుకువస్తుంది. స్వీడన్‌కు చెందిన ఓ కంపెనీకి చెందిన పేపర్ బేస్డ్ ఉత్పత్తులకు సంబంధించి 32 కంటైనర్లలో సరుకు నింపగా.. ఫిన్‌లాండ్‌ హెల్సింకిలోని వుసారి సీపోర్టు నుంచి బయల్దేరనున్న సరుకు… రోడ్డు, రైలు, జల మార్గాల్లో ఇండియాకు చేరుకుంటుంది. రవాణా సమయం తగ్గడంతో పాటు.. ఖర్చు కూడా కలిసి వచ్చే అవకాశాలు ఉంటాయని.. ట్రాన్స్‌పోర్ట్ సంస్థ ప్రతినిధులు చెప్తున్నారు.

ఫిన్లాండ్ హెల్సింకి నుంచి ముంబై పోర్టు వరకు మొత్తం రవాణా చేయాల్సిన మార్గం దూరం 7వేల 2వందల కిలోమీటర్లు. షిప్, రైల్, రోడ్డు.. ఇలా అన్ని మార్గాల్లో ఆ సరుకు రవాణా అవుతుంది. రష్యా, అజర్ బైజాన్, ఇరాన్, యూరప్, మధ్య ఆసియా దేశాల నుంచి ఆ సరుకు ట్రావెల్ అవుతుంది. ఫిన్లాండ్ నుంచి ఇండియాకు అది 25రోజుల్లో చేరుకోనుండగా.. అందులో సగం సమయం సముద్ర మార్గానికే పట్టనుంది. సూయిజ్ కాలువలో ప్రయాణం ఆలస్యం అయ్యే అవకాశాలు ఉన్నాయ్. సరుకు రవాణా చేయాల్సిన మొత్తం దూరంలో.. ఎక్కువ భాగం రైల్లోనే కవర్ అవుతుంది.

హెల్సింకి నుంచి అజర్‌బైజాన్‌లోని అస్తారా స్టేషన్ వరకు రైలు మార్గంలో సరుకు రవాణా కానుంది. అస్తారా నుంచి రోడ్డు మార్గం ద్వారా ఇరాన్‌లోని బందర్‌అబ్బాస్ పోర్టు వరకు రోడ్డు మార్గంలో వస్తుంది. అక్కడి నుంచి సరుకును షిప్‌లోకి తరలిస్తారు. ఆ షిప్ సూయిజ్ కాలువ గుండా ప్రయాణించి ముంబై పోర్టుకు చేరుకుంటుంది. మొత్తం 25 రోజులు పడుతుంది. ఐతే ఈ రవాణా.. రాబోయే రోజుల్లో ట్రాన్స్‌పోర్టుకు సంబంధించి కీలక నిర్ణయాలు తీసుకోవడంతో పాటు విధివిధానాలు మార్చేందుకు ఉపయోగపడే అవకాశం ఉంటుందన్న అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయ్.

మూడు మార్గాల ప్రయాణం ద్వారా సమయం కలిసి రావడంతో పాటు రవాణా ఖర్చు కూడా భారీగా తగ్గనుంది. మాములుగా ఫిన్లాండ్ నుంచి ఇండియాకు సరకు రవాణా చేయాలంటే.. యూనిట్‌కు 49వందల డాలర్లు ఖర్చు అయ్యేది. ఐతే ఇప్పుడు దీనిద్వారా 34వందల డాలర్లనే పూర్తికాబోతోంది. ఏమైనా.. మూడు మార్గాల్లో ప్రయాణం అద్భుతం అనిపించబోతోంది. రవాణా చరిత్రలోనే ఇదో కొత్త అధ్యాయమన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయ్.