కరోనా వైరస్‌ కథలో ఊహించని ట్విస్ట్

  • Published By: veegamteam ,Published On : March 1, 2020 / 12:40 AM IST
కరోనా వైరస్‌ కథలో ఊహించని ట్విస్ట్

కరోనా వైరస్ స్టోరీలో ఇప్పుడు కొత్త ట్విస్ట్ చోటు చేసుకుంది. చైనా నుంచే కాదు..ఈ మహమ్మారి ఏ దేశంలోనైనా తనంతట తానే విజృంభించే అవకాశం ఉందని తేలింది. అమెరికాలోని ఓ మహిళకి ఇప్పుడు కోవిడ్ 19 వైరస్ సోకడం ఇదే అనుమానాన్ని కలగజేసింది..దీంతో అమెరికాలో హై అలర్ట్ నెలకొంది.

చైనాలోనే కాదు కరోనా వైరస్ ఎక్కడైనా పుట్టుకురాగలదా..?
కరోనా వైరస్ చైనాలో తగ్గినట్లే తగ్గి మళ్లీ విజృంభిస్తోంది…మరోవైపు ఈ మహమ్మారి అమెరికాలోనూ అడుగుపెట్టింది. దీంతో అమెరికా వాసులు చిగురుటాకుల్లా వణికిపోతున్నారు. కాలిఫోర్నియాలోని సొలానో కౌంటీలో ఓ మహిళకు కోవిడ్ 19 వైరస్ సోకినట్లు స్థానిక వైద్యులు నిర్ధారించారు..ఐతే ఈ మహిళ వైరస్ ప్రభావిత దేశాలకు వెళ్లి వచ్చిన చరిత్ర లేకపోవడంతో అసలు వైరస్ ఒక్క చైనాలోనే పుట్టిందా లేక ఇంకెక్కడైనా పుట్టగలదా అనే చర్చ కూడా అమెరికన్లను వణికిస్తోంది. ప్రస్తుతం ఈ మహిళకు యూసీ డేవిస్ మెడికల్ సెంటర్‌లో చికిత్స చేస్తున్నారు. మరోవైపు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తాజా పరిస్థితిని పర్యవేక్షించేందుకు వైస్ ప్రెసిడెంట్ మైక్ పెన్స్‌ని ఇన్‌ఛార్జ్‌గా నియమించారు. 

ఇప్పుడు అమెరికాలో విలయతాండవం చేయబోతోందా..?
కోవిడ్ 19 వైరస్‌ ఎక్కడ ఎలాగైనా వ్యాపించగలదు..అందులోనూ గాలిలో వ్యాపించే శక్తి కరోనాకి ఉండటంతో వ్యాధి సోకినవారి దగ్గరకు వెళ్లినవారితో పాటు..ఇతర రూపాల్లో కూడా వ్యాధి బారిన పడే అవకాశం ఉంది. కాలిఫోర్నియాలోని మహిళకు సోకడంతో హైటెన్షన్‌ వాతావరణం నెలకొంది..ఎయిర్ పోర్టులు..రెస్టారెంట్లలో అప్రమత్తమయ్యారు. ఒక్క చైనాలోనే 82వేలమందికి కోవిడ్ 19 సోకగా 2800మంది పిట్టల్లా రాలిపోయారు.. ఈ నేపధ్యంలోనే అమెరికాలోనూ వైరస్ బ్రేకవుట్ అవడంతో.. కాలిఫోర్నియా ఆరోగ్యసిబ్బంది యుద్ధప్రాతిపదికన చర్యలు చేపడుతున్నారు

8వేల 400మందిని పరీక్షిస్తోన్న అమెరికా వైద్యశాఖ:
కాలిఫోర్నియాలో వైరస్ కలకలంతో అప్రమత్తమైన వైద్య సిబ్బంది దాదాపు 8400మందిని మానిటర్ చేస్తున్నారు. వీరిందరికి కూడా కరోనా టెస్టులు చేయాల్సి ఉండగా మెడికల్ కిట్స్ సరిపోయినన్ని లేకపోవడం ఆందోళన కలిగించే అంశంగా చెప్తున్నారు. కేవలం 200 కిట్లు మాత్రమే ఇక్కడ అందుబాటులో ఉండగా..వీరందరికీ టెస్ట్ చేయాలంటే కనీసం 4 రోజులు పడుతుందని అంచనా…రాబోయే రెండు వారాల్లో దేశవ్యాప్తంగా కూడా కోవిడ్ 19 కిట్లను సరఫరా చేయబోతున్నట్లు ఇక్కడి ప్రభుత్వం ప్రకటించింది. ఇతర దేశాలకు వెళ్లి వచ్చిన వారిలో 33మందికి కరోనా పాజిటివ్ లక్షణాలను కనుక్కున్నారు. ఐతే వీరిలో ఐదుగురు మాత్రమే ఇతర దేశాలకు వెళ్లి వచ్చినట్లు తెలిసింది. ముందు చెప్పుకున్న మహిళకి మాత్రమే ఎక్కడకూ వెళ్లకపోయినా కూడా కరోనా సోకడం అమెరికా వాసులను ఆందోళనకు గురి చేస్తోన్న అంశం. ఇప్పుడు ఈ మహిళ చుట్టుపక్కల ఎవరెవరు నివసిస్తున్నారు..వారి పరిస్థితి ఏంటనే అంశం యూఎస్ సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ సంస్థ కనుక్కునే పనిలోపడింది..వీరందరినీ కూడా ఐసోలేషన్ వార్డులో ఉంచి చికిత్స చేయబోతున్నారు. 

చైనా నిర్లక్ష్యమే కొంపముంచిందా?
మరోవైపు కరోనా వైరస్‌పై అలర్ట్ చేసినా..చర్యలు ఎందుకు ఆలస్యంగా తీసుకున్నారనే అంశంపై చైనాలోనే అంతర్గతంగా ఆగ్రహం వ్యక్తమవుతోంది..అప్పటి నిర్లక్ష్యమే ఇప్పుడు 
ప్రపంచ దేశాలకు శాపంగా మారిందని విమర్శలు చేస్తున్నారు.. సౌత్ కొరియా, ఇటలీ, ఇరాన్, ఇరాక్ సహా అనేక దేశాలకు ఈ మహ్మమారి వ్యాపించింది.. తాజాగా అమెరికాలోనూ 
కేసులు నమోదు కావడంతో ఇక వైరస్ పూర్తిగా తన ప్రతాపం చూపించేందుకు సిద్ధమైందనే ఆందోళన వ్యక్తమవుతోంది..ఎందుకంటే మొదటి నుంచీ అమెరికా తన దేశస్థులకు ఈ వైరస్ సోకలేదని చెప్తూ వచ్చింది..పైగా తన దేశంలోనే వేక్సిన్ కూడా తయారు చేస్తున్నట్లు ప్రకటించింది..ఈ నేపధ్యంలో తాజా పరిణామాలు కోవిడ్ 19 రూపంలో ప్రపంచానికి పొంచి ఉన్న ముప్పును సూచిస్తోంది