Welcome 2020 : సిడ్నీలో గ్రాండ్ గా న్యూఇయర్ వేడుకలు

కొత్త సంవత్సరం వచ్చేసింది. ఆస్ట్రేలియా రాజధాని సిడ్నీ వాసులు నూతన సంవత్సరం 2020కి గ్రాండ్ గా వెల్ కమ్ చెప్పారు. సిడ్నీలో న్యూఇయర్ వేడుకలు ఘనంగా

  • Published By: veegamteam ,Published On : December 31, 2019 / 01:16 PM IST
Welcome 2020 : సిడ్నీలో గ్రాండ్ గా న్యూఇయర్ వేడుకలు

కొత్త సంవత్సరం వచ్చేసింది. ఆస్ట్రేలియా రాజధాని సిడ్నీ వాసులు నూతన సంవత్సరం 2020కి గ్రాండ్ గా వెల్ కమ్ చెప్పారు. సిడ్నీలో న్యూఇయర్ వేడుకలు ఘనంగా

కొత్త సంవత్సరం వచ్చేసింది. ఆస్ట్రేలియా రాజధాని సిడ్నీ వాసులు నూతన సంవత్సరం 2020కి గ్రాండ్ గా వెల్ కమ్ చెప్పారు. సిడ్నీలో న్యూఇయర్ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. సంబరాలు అంబరాన్నంటాయి. కొత్త ఏడాదికి ఘనంగా స్వాగతం పలుకుతూ ఒకరికొకరు విషెస్ చెప్పుకుంటున్నారు. సిడ్నీ హార్బర్ లో ఫైర్ వర్క్స్ కనువిందు చేస్తున్నాయి. ఒపెరా హౌస్ దగ్గర వేడుకలు మిన్నంటాయి.

దేశ విదేశాల నుంచి.. సిడ్నీలో జరిగే లైట్‌ షోకు హాజరయ్యారు. సిడ్నీ హార్బర్ బ్రిడ్జి దగ్గర లక్షలాది మంది చేరుకున్నారు. న్యూయర్ వేడుకలను కళ్లారా చూసి ఎంజాయ్ చేస్తున్నారు. కొత్త సంవత్సరాన్ని ఆహ్వానించారు. మన దేశం కంటే దాదాపు 5 గంటల ముందు న్యూఇయర్ ని ఆహ్వానిస్తుంది ఆస్ట్రేలియా.

వాస్తవంగా న్యూఇయర్ సెలెబ్రేషన్స్‌ అంటే.. సిడ్నీ నగరం గుర్తుకొస్తుంది. ఇక్కడ జరిగే ఫైర్ వర్క్స్ చాలా స్పెషల్‌. న్యూయర్ సెలబ్రేషన్స్ ఎంతో కలర్ ఫుల్‌గా ఉంటాయి. రకరకాల డిజైన్లతో కూడిన టపాసులను కాలుస్తారు. వీటి కోసం 2 నెలల నుంచి కసరత్తు మొదలు పెడతారు. ఈ టపాసులకు కోట్లలో ఖర్చు పెడతారు. రెండున్నర గంటల సేపు ఈ లైట్ షో జరుగుతుంది.

ఇక ప్రపంచంలో అందరికంటే ముందుగా కొత్త సంవత్సరం ‘సమోవా’ దేశంలో వస్తుంది. ఆ తర్వాత న్యూజిలాండ్‌లో. న్యూజిలాండ్‌‌లో న్యూయర్ సంబరాలు అంబరాన్నంటాయి. బాణాసంచా వెలుగులు, లేజర్‌ షోలతో న్యూజిలాండ్ వాసులు 2020కి గ్రాండ్ గా వెల్ కమ్ చెప్పారు. 2019 ఇచ్చిన తీపి గుర్తులను గుండెల్లో దాచుకొని.. సరైన దారుల్ని వెతుక్కొంటూ 2020లోకి అడుగు పెట్టేస్తున్నారు. హ్యాపీ న్యూ ఇయర్‌ అంటూ కొత్త సంవత్సర ఘడియల్లో సందడి చేస్తున్నారు. ప్రపంచమంతా కొత్త ఏడాదికి సగర్వంగా స్వాగతం పలుకుతోంది.