New York : న్యూయార్క్ భవనంలో మంటలు.. 9మంది పిల్లలతో పాటు 19మంది మృతి

హాస్పిటల్ లో చికిత్స పొందుతున్న బాధితుల్లో 9మంది పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలుస్తోంది.

New York : న్యూయార్క్ భవనంలో మంటలు.. 9మంది పిల్లలతో పాటు 19మంది మృతి

New York City Fire Accident

New York : యునైటెడ్ స్టేట్స్‌లోనే అత్యంత జనాభా ఉన్న న్యూయార్క్ సిటీలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. కమర్షియల్ స్పేస్ ఎక్కువగా ఉన్న 19 అంతస్తుల భారీ భవంతిలో కిందవైపు ఉన్న ఓ అపార్టుమెంట్లో మంటలు చెలరేగాయి. ఈ మంటలు, ప్రమాదంతో వెలువడిన దట్టమైన పొగ కారణంగా 19 మంది ప్రాణాలు కోల్పోయారు. ఇందులో 9మంది చిన్నారులు ఉన్నారు. న్యూయార్క్ సిటీలో గడిచిన 3 దశాబ్దాల్లోనే అతిపెద్దదైన భవన అగ్నిప్రమాదంగా చెప్పుకుంటున్నారు.

Read More : Platform Ticket: ప్లాట్‌ఫామ్ టికెట్ ధరలను రూ.50 చేసిన దక్షిణ మధ్య రైల్వే!

2022 జనవరి 10, ఆదివారం ఉదయం 11గంటలకు ఈ ప్రమాదం జరిగింది. ఫైర్ యాక్సిడెంట్ వార్త తెలిసి ఫైర్ ఫైటింగ్ టీమ్ వేగంగా స్పందించింది. రెస్క్యూ ఆపరేషన్ చేసి మంటలు ఆర్పింది. మొత్తం 60 మంది గాయపడ్డారు. 32 మంది హాస్పిటల్ లో చేరారు. 19మంది చనిపోయారని న్యూయార్క్ సిటీ మేయర్ ఎరిక్ ఆడమ్స్ ట్విట్టర్‌లో ధ్రువీకరించారు. 9మంది చిన్నారులు చిన్నప్రాయంలోనే ప్రాణాలు కోల్పోవడం బాధగా ఉందన్నారు. చనిపోయిన పిల్లలంతా 16 ఏళ్లు, అంతకు తక్కువ వయసు వాళ్లే. హాస్పిటల్ లో చికిత్స పొందుతున్న బాధితుల్లో 9మంది పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలుస్తోంది.

ఫైర్ ఫైటింగ్ టీమ్ రెస్క్యూ టైంలో ప్రతి అపార్టుమెంట్లోనూ బాధితులను గుర్తించారు. చాలామంది పొగ కారణంగా స్పృహ కోల్పోయారు. కొందరు శ్వాస సంబంధ సమస్యతో ఫ్లోర్ పైనే నిస్సహాయ స్థితిలో కనిపించారని ఫైర్ సిబ్బంది తెలిపారు. కొందరు ఫస్ట్ ఎయిడ్ తో కోలుకున్నారని.. మరికొంతమందిని హాస్పిటల్ కు షిఫ్ట్ చేశామని చెప్పారు.

Read More : Oscar 2022: ఆస్కార్‌ బరిలో జేమ్స్ బాండ్.. 4 విభాగాలకు నామినేట్‌!

మంటలు ఎందుకు చెలరేగాయన్నదానిపై ఇన్వెస్టిగేషన్ నడుస్తోంది. ఐతే.. సరిగ్గా పనిచేయని ఓ స్పేస్ హీటర్ లో షార్ట్ సర్క్యూట్ వల్ల మంటలు చెలరేగాయని.. ముందుగా ఓ రూమ్. ఆ తర్వాత ఫ్లోర్ అంతా వ్యాపించాయని అనుమానిస్తున్నారు. ఫ్లోర్ లో మంటల కారణంగా.. పొగ మిగతా అంతస్తుల వారిని ఉక్కిరిబిక్కిరి చేసిందని చెబుతున్నారు. పొగ తీవ్రత తట్టుకోలేక కొందరు.. తమ ఫ్లోర్ ఎక్కడ తగలబడిపోతుందోనన్న ఆందోళనతో మరికొందరు కిటికీల్లోంచి కిందకు దూకారని స్థానికులు తెలిపారు. దీనివల్ల కూడా కొంత ప్రాణనష్టం పెరిగిందని సమాచారం. మెట్ల మార్గంలోనూ తొక్కిసలాట జరిగింది. ఈ తొక్కిసలాటలో డజన్లకొద్దీ జనం గాయపడ్డారు.

Read More : Trump Socia Media : ట్రంప్ సోషల్ మీడియా యాప్ లాంఛింగ్ ఆ రోజే!

ఈ అపార్ట్‌మెంట్లో ఉంటున్నవాళ్లలో ఎక్కువ మంది వెస్ట్ ఆఫ్రికన్ కంట్రీ జాంబియా నుంచి వచ్చినవాళ్లు. 1973లో ఈ బిల్డింగ్ కట్టారు. రెస్క్యూ మెజర్స్ ఏ స్థాయిలో తీసుకున్నారన్నదానిపై అధికారుల దర్యాప్తు కొనసాగుతోంది. ప్రమాదం జరిగినప్పుడు.. బాధితుల హాహాకారాలతో ఆ ప్రాంతం దద్దరిల్లింది. కనీసం 2వందలమంది ఫైర్ ఫైటర్స్ రెస్క్యూ ఆపరేషన్ లో పాల్గొన్నారు.

1990లో న్యూయార్క్ సిటీలోని హ్యాపీ ల్యాండ్ సోషల్ క్లబ్ లో ఫైర్ యాక్సిడెంట్ కారణంగా 87మంది చనిపోయారు. ఆ ప్రమాదం తర్వాత ఈ 30 ఏళ్లలో ఇదే అతిపెద్ద అగ్నిప్రమాదంగా చెప్పుకుంటున్నారు. 2017లో బ్రాంక్స్ పట్టణంలోనూ ఫైర్ యాక్సిడెంట్ లో 13మంది చనిపోయారు.