Donald Trump : హష్ మనీ చెల్లింపుల కేసు.. అమెరికా మాజీ అద్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పై నేరాభియోగాలు

అమెరికాలో హష్ మనీ చెల్లింపుల కేసు సంచలనంగా మారిన విషయం తెలిసిందే. హష్ మనీ చెల్లింపుల కేసులో అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పై నేరాభియోగాలు ఉన్నాయి. ఈ కేసులో ట్రంప్ పై న్యూయార్క్ గ్రాండ్ జ్యూరి నేరాభియోగాలు మోపింది.

Donald Trump : అమెరికాలో హష్ మనీ చెల్లింపుల కేసు సంచలనంగా మారిన విషయం తెలిసిందే. హష్ మనీ చెల్లింపుల కేసులో అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పై నేరాభియోగాలు ఉన్నాయి. ఈ కేసులో ట్రంప్ పై న్యూయార్క్ గ్రాండ్ జ్యూరి నేరాభియోగాలు మోపింది. 2016 ఎన్నికలకు ముందు ఓ ఫోర్న్ స్టార్ కు ట్రంప్ పెద్ద మొత్తంలో డబ్బులు చెల్లించారన్న ఆరోపణలు రుజువు అయ్యాయి.  ఈ క్రమంలో న్యూయార్క్ లోని గ్రాండ్ జ్యూరీ ట్రంప్ పై నేరాభియోగాలు మోపింది.

దీంతో అమెరికాలో నేరారోపణలు రుజువైన తొలి మాజీ అధ్యక్షుడిగా ట్రంప్ చరిత్ర కెక్కారు. డోనాల్డ్ ట్రంప్ 2006లో తనతో శృంగారం చేశారని పోర్న్ సినిమాల్లో నటించే స్టార్మీ డేనియల్స్ ఆరోపించారు. ఆ విషయాన్ని బయటపెట్టకూడదంటూ తనను బెదిరించినట్లు ఆమె తెలిపారు. 2016 ఎన్నికలకు ముందు ఈ విషయం బయటకు రాకుండా ఉండేందుకు ట్రంప్ లాయర్ తనకు 1.30 లక్షల డాలర్లు ఇచ్చారని స్టార్మీ డేనియల్స్ పేర్కొన్నారు.

Iran Cruise Missile: డొనాల్డ్ ట్రంప్‌ను చంపేస్తాం.. క్రూయిజ్ మిస్సైల్‌తో మా ప్రతీకారం తీర్చుకుంటాం ..

ఆ తర్వాత ట్రంప్ లీగల్ టీమ్ లోని ఓ న్యాయవాదే డేనియల్స్ ఆరోపణలు నిజమేనని ప్రకటించడం గమనార్హం. ట్రంప్ మాజీ లాయర్ మైఖేల్ కోహెల్ 1,30,000 డాలర్లు స్టార్మీ డేనియల్స్ కు ఇచ్చారని, తర్వాత ఆ మొత్తాన్ని కోహెన్ కు ట్రంప్ అందజేశారని న్యాయవాది రూడీ గియాలియానీ పేర్కొన్నారు. రికార్డులో ఈ మొత్తాన్ని లీగల్ ఫీజు కింద చెల్లించినట్లు ఉందని చెప్పారు.

ఈ కేసులో ఐదేళ్లుగా డొనాల్డ్ ట్రంప్ పై విచారణ కొనసాగుతోంది. ఇప్పటికే 76 ఏళ్ల డొనాల్డ్ ట్రంప్ పై అనేక ఆరోపణలు ఉన్నాయి. వాటిల్లో ఇది కూడా ఒకటి. కాగా, ఇప్పటివరకు ఏ కేసులోనూ నేరం రుజువు కాలేదని, తాను ఏ తప్పూ చేయలేదని ట్రంప్ వాదిస్తున్నారు. 2024 ఎన్నికలకు సిద్ధమవుతున్న ట్రంప్ ఒకవేళ నేరం రుజువు అయినా ప్రచారం కొనసాగిస్తానని చెప్పడం శోచనీయం.

ట్రెండింగ్ వార్తలు