New Post To Catch Rats : ఎలుకలు పట్టేందుకు ఉద్యోగి నియామకం.. జీతం రూ.కోటి 38లక్షలు

అమెరికాలో ఎలుకలు పట్టేందుకు ప్రత్యేకంగా ఉద్యోగ నియామకాలను చేపట్టారు. న్యూయార్క్ మేయర్ ఎరిక్ ఆడమ్స్ ఎలుకలు పట్టేందుకు కొత్త పోస్టును సృష్టించారు. ఆ ఉద్యోగికి వార్షిక జీతం రూ.కోటి 38 లక్షల 55 వేలుగా నిర్ణయించారు.

New Post To Catch Rats : ఎలుకలు పట్టేందుకు ఉద్యోగి నియామకం.. జీతం రూ.కోటి 38లక్షలు

new post to catch rats

New Post To Catch Rats : అమెరికాలో ఎలుకలు పట్టేందుకు ప్రత్యేకంగా ఉద్యోగ నియామకాలను చేపట్టారు. న్యూయార్క్ మేయర్ ఎరిక్ ఆడమ్స్ ఎలుకలు పట్టేందుకు కొత్త పోస్టును సృష్టించారు. ఆ ఉద్యోగికి వార్షిక జీతం రూ.కోటి 38 లక్షల 55 వేలుగా నిర్ణయించారు. ఈ మేరకు ఎరిక్ ఆడమ్స్ తన ట్విట్టర్ లో పోస్టు చేశారు. ఎలుకలంటే తనకు అసహ్యమని ఆడమ్స్ తెలిపారు.

న్యూయార్క్ లో కనికరం లేని ఎలుకలపై పోరాడే శక్తి మీకు ఉందా? మీరు ఎలుకలను చాకచక్యంగా పట్టుకోగలరా? అయితే మీ ఉద్యోగం రెడీగా ఉందంటూ అంటూ ట్విట్టర్ లో ట్వీట్ చేశారు. ఈ మేరకు మేయర్ కార్యాలయం కూడా ప్రకటన విడుదల చేసింది.

Telangana : ఎలుకలను పట్టే గ్లూట్రాప్‌లపై నిషేధం!

ఈ కొత్త ఉద్యోగాన్ని చిట్టెలుక ఉపశమన డైరెక్టర్ అని పిలుస్తారని పేర్కొంది. ఆ ఉద్యోగికి ఏడాదికి 170 వేల డాలర్లు ( రూ.కోటి 38 లక్షల 55 వేలు) జీతం ఉంటుందని వెల్లడించారు. అయితే అభ్యర్థికి నాయకత్వ లక్షణాలు, సత్తువ, ఎలుకలను పట్టుకునే సామర్థ్యంలాంటి అర్హతలు ఉండాలని సూచించింది.