Expensive City: ఖరీదైన నగరాలుగా న్యూయార్క్, సింగపూర్.. ద్రవ్యోల్బణం, పెట్రో ధరల పెరుగుదలే కారణం

అమెరికాలోని న్యూయార్క్, సింగపూర్ నగరాలు ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన నగరాలుగా నిలిచాయి. ఈ ఏడాది వివిధ నగరాల్లో ఖరీదైన జీవన విధానం ఆధారంగా ఒక మీడియా సంస్థ తాజా జాబితా రూపొందించింది.

Expensive City: ఖరీదైన నగరాలుగా న్యూయార్క్, సింగపూర్.. ద్రవ్యోల్బణం, పెట్రో ధరల పెరుగుదలే కారణం

Expensive City: ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన నగరాలుగా నిలిచాయి న్యూయార్క్, సింగపూర్. ఈ ఏడాదికి సంబంధించి ఖరీదైన నగరాల జాబితాను ఒక అంతర్జాతీయ మీడియా సంస్థ విడుదల చేసింది. ఈ జాబితా ప్రకారం.. అత్యంత ఖరీదైన నగరాల జాబితాలో న్యూయార్క్, సింగపూర్ సంయుక్తంగా మొదటి స్థానంలో నిలిచాయి.

Maharashtra: బాలికపై పదిహేనేళ్ల బాలుడి హత్యాచారం.. బాలిక తండ్రిపై ప్రతీకారం తీర్చుకునేందుకు దారుణం

చమురు ధరల పెరుగుదల, ద్రవ్యోల్బణం వంటి కారణాలతో ఈ నగరాల్లో జీవనం చాలా ఖరీదైన వ్యవహారంగా మారింది. దీంతో నగరాలు చాలా ఖరీదుగా మారిపోతున్నాయి. ఈ జాబితాకు సంబంధించి న్యూయార్క్ మొదటిసారి టాప్ ప్లేస్ సాధించింది. సింగపూర్ గత పదేళ్లలో ఎనిమిదిసార్లు టాప్ ప్లేస్ సాధించింది. టాప్-10లో తొలిసారిగా ఆస్ట్రేలియాలోని సిడ్నీ నగరం నిలిచింది. రష్యాకు చెందిన మాస్కో, సెయింట్ పీటర్స్ బర్గ్ కూడా ఈ జాబితాలో ఉన్నాయి. వెనిజులా రాజధాని సరాకస్ 132వ స్థానంలో నిలిచింది. పెట్రో ధరల పెరుగుదల, కరెన్సీ విలువ తగ్గడం, ద్రవ్యోల్బణం, అమెరికా డాలర్ బలంగా ఉండటం వంటి అంశాల వల్ల ఇవి ఖరీదైన నగరాల జాబితాలో ఉన్నాయి.

ఈ జాబితాలో గతంలో టాప్‌లో నిలిచిన నగరాలు తమ స్థానాన్ని కోల్పోయాయి. జపాన్ రాజధాని టోక్యో, ఒసాకా, స్టాక్‌హోమ్, లగ్జెంబర్గ్ వంటి నగరాలు ఈ జాబితాలో కిందికి పడిపోయాయి.