అమెరికాలో కరోనా : న్యూయార్క్ టైమ్స్ కన్నీటి నివాళి

  • Published By: madhu ,Published On : May 24, 2020 / 06:45 AM IST
అమెరికాలో కరోనా : న్యూయార్క్ టైమ్స్ కన్నీటి నివాళి

అగ్రరాజ్యాన్ని కరోనా వైరస్ వణికిస్తోంది. లక్షల సంఖ్యలో వైరస్ బారిన పడుతుండడం అందర్నీ భయపెడుతోంది. ఈ వైరస్ బారిన పడి…చనిపోయిన వారి సంఖ్య…లక్షకు చేరువలో ఉంది. దీనిపై ప్రముఖ ఆంగ్ల పత్రిక న్యూయార్క్ టైమ్స్ మృతులకు కన్నీటి నివాళి అర్పించింది. 2020, మే 24వ తేదీ ఆదివారం వెలువడిన ఎడిషన్ ఫస్ట్ పేజీలో ప్రత్యేకంగా రూపొందించింది. వివిధ ప్రాంతాల్లో కరోనా వైరస్ కారణంగా చనిపోయిన వేయి మంది పేర్లను ప్రచురించింది.

వీరంతా మనవారే అని వెల్లడించింది. వేయి మంది పేర్లు, వయస్సు, ఏ ప్రాంతానికి చెందిన వారు ? వారి జీవితం గురించి ప్రచురించింది. మొదటి పేజీ మొత్తం నలుపు, తెలుపు రంగుల్లో ఉంది. గత నెలలో ది బోస్టన్ గ్లోబ్ న్యూస్ పేపర్ కూడా ఇదే విధంగా ప్రచురించింది. ఆదివారం ఎడిషన్ 15 పేజీలను మృతుల వివరాల ఫొటోలను ప్రచురించింది. 

ఇక కరోనా వైరస్ విషయానికి వస్తే…గత 24 గంటల్లో అమెరికా సంయుక్త రాష్ట్రాల్లో మొత్తం 1260 మంది మరణించారు. దీంతో మృతుల సంఖ్య 97 వేల 647 మంది చేరుకుంది.