New York:కరోనా భయంతో ఆన్‌లైన్‌లో పెళ్లిళ్లు.. న్యూయార్క్‌లో Zoom ద్వారా చట్టపరంగా పెళ్లి చేసుకోవచ్చు!

పెళ్లంటే పందిళ్లు.. సందళ్లు.. తప్పెట్లు.. తాళాలు.. తలంబ్రాలు... మూడు ముళ్లు.. ఏడు అడుగులు.. మంత్రాలు ఇది కరోనాకు ముందు.. ఇప్పుడు అలా కాదు.. ఎందుకుంటే ఇది కరోనా కాలం.. మునపటిలా పెళ్

New York:కరోనా భయంతో ఆన్‌లైన్‌లో పెళ్లిళ్లు.. న్యూయార్క్‌లో Zoom ద్వారా చట్టపరంగా పెళ్లి చేసుకోవచ్చు!

New York::పెళ్లంటే పందిళ్లు.. సందళ్లు.. తప్పెట్లు.. తాళాలు.. తలంబ్రాలు… మూడు ముళ్లు.. ఏడు అడుగులు.. మంత్రాలు ఇది కరోనాకు ముందు.. ఇప్పుడు అలా కాదు.. ఎందుకుంటే ఇది కరోనా కాలం.. మునపటిలా పెళ్లి చేసుకుంటామంటే కుదరదు.. కరోనా పుణ్యామనా పెళ్లిళ్లు అన్నీ ఆన్ లైన్‌లో జరిగిపోతున్నాయి. మ్యారేజ్ ఇన్విటేషన్ అంతా ఆన్ లైన్‌లోనే.. ఎవరి ఇంట్లో వారు.. ఎక్కడి వారు అక్కడే ఉండి పెళ్లి చూడొచ్చు.. వధువరులు కూడా ఎవరి ఇంట్లో వారే ఉండి పెళ్లి చేసుకోవచ్చు.

అటు అబ్బాయి బంధువులు, ఇటు అమ్మాయి బంధువులు అంతా ఆన్ లైన్ లోనే ఆశీర్వదించొచ్చు. అక్షింతలు అక్కర్లేదు.. లైక్స్, కామెంట్లతో విషెస్ తెలియజేయొచ్చు. ఇంటర్నెట్లో వీడియో కాన్ఫెరెన్స్ ద్వారా పెళ్లిళ్లు వేగంగా జరిగిపోతున్నాయి. ఆన్ లైన్లో జంటలు ఒకటైపోతున్నాయి.

న్యూయార్క్‌లోనూ ఆన్‌లైన్‌లో‌నే పెళ్లిళ్లు :
ఇక న్యూయార్క్ విషయానికి వస్తే.. అక్కడ కరోనా వైరస్ ఎంత తీవ్ర స్థాయిలో ఉందో ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. ఇలాంటి పరిస్థితుల్లో బంధువులను పిలిచి ఘనంగా పెళ్లిళ్లు జరుపుకోవడం సాధ్యపడదు. అందుకే న్యూయార్క్ వాసులంతా ఆన్ లైన్లోనే పెళ్లిళ్లు చేసుకుంటున్నారు. వీడియో కాన్ఫెరెన్స్‌లో న్యూయార్క్ జంటలు ఒకటైపోతున్నాయి. న్యూయార్క్ ప్రభుత్వం కూడా ఆన్ లైన్ పెళ్లిళ్లను లీగల్ చేసింది. న్యూయార్క్ గవర్నర్ ఆండ్రూ క్యుమో (D) ఒక ఎగ్జిక్యూటీవ్ ఆర్డర్ జారీ చేశారు.

ఈ ఆర్డర్ ద్వారా న్యూయార్క్ వాసులు వీడియో కాన్ఫెరెన్స్ ద్వారా చట్టపరంగా పెళ్లి చేసుకోవచ్చు. తద్వారా వారికి మ్యారేజ్ లైసెన్స్ పొందవచ్చు. ప్రస్తుత పరిస్థితుల్లో ఎగ్జిక్యూటీవ్ ఆర్డర్ ద్వారా ప్రొవిజన్ లాను తాత్కాలికంగా నిషేధిస్తున్నట్టు గవర్నర్ కార్యాలయం నుంచి ఒక పత్రికా ప్రకటన వెల్లడించింది. పెళ్లిళ్లకు అనుమతి లేదా అంటే లేదని అంటున్నారు ఆండ్రూ.. Zoom లో వీడియో కాన్ఫెరెన్స్ ద్వారా మ్యారేజీకి అటెండ్ కావొచ్చు.. అవునా? కదా? అని ఆండ్రూ ఫన్నీగా స్పందించారు.

ప్రపంచమంతా Zoom ద్వారానే వివాహాలు :
మరోవైపు కరోనా వైరస్ కారణంగా.. చాలా మ్యారేజీ బ్యూరోలు తాత్కాలికంగా మూతపడ్డాయి. అమెరికాలో న్యూయార్క్‌లోనే కరోనా తీవ్రస్థాయిలో వ్యాపి చెందిన కేంద్రం. అందరూ ఇంట్లోనే ఉండాల్సిందిగా ఆదేశాలు జారీ అయ్యాయి. మే 15 వరకు లాక్ డౌన్ పొడిగించారు. పెళ్లిళ్లు వంటి ఇతర ఫంక్షన్లకు మరి కొన్ని నెలల పాటు దూరంగా ఉండాల్సిన అవసరం ఉంది.

లాక్ డౌన్ ఎత్తేసినా కూడా ఇప్పట్లో ఎలాంటి శుభ కార్యక్రమాలు నిర్వహించే పరిస్థితి ఉండదు. అందుకే ఆన్ లైన్ పెళ్లిళ్లకు ఫుల్ డిమాండ్ పెరిగింది. ప్రపంచవ్యాప్తంగా Zoom వెడ్డింగ్స్ జరుగుతున్నాయి. జంటలు ఒకటవ్వడాన్ని వీడియో కాన్ఫిరెన్స్ టూల్స్ ద్వారా కాల్ చేసి బంధువులు, స్నేహితులు వీక్షిస్తున్నారు.

కానీ, ఇలాంటి కార్యక్రమాలు చట్టపరమైనవి కావు. కొంతమంది జంటలు మ్యారేజీ లైసెన్స్ పెళ్లికి ముందే పొందవచ్చు లేదా కరోనా ప్రభావం తగ్గిన తర్వాత అధికారిక వివాహాన్ని నిలిపివేస్తున్నారు. క్యూమో ఎగ్జిక్యూటీవ్ ఆర్డర్ ప్రకారం.. సామాజిక దూరం పాటించడం ద్వారా ఎంపైర్ స్టేట్ లోని జంటలు అధికారికంగా పెళ్లిచేసుకునేందుకు అనుమతి ఉంటుంది.

కొలరాడోలో జంటలు ఇప్పుడు వివాహ అనుమతి కోసం దరఖాస్తు ఆన్ లైన్‌లో అనుమతి లభించింది. ఒహియోలోని కుయాహోగా కౌంటీలో, ప్రత్యేక పరిస్థితులతో ఉన్న జంటలు (తీవ్రమైన అనారోగ్యంతో బాధపడటం, ఆరోగ్య బీమా సమస్యలు లేదా ఆరోగ్య సంరక్షణలో పనిచేస్తుంటే వంటివి) వీడియో కాల్ ద్వారా వారి వివాహ లైసెన్స్ పొందవచ్చు.