న్యూజిలాండ్ లో తుపాకుల అమ్మకాలపై నిషేధం

న్యూజిలాండ్ ప్రధాని జసిందా ఆర్డ్రెన్ కీలక నిర్ణయం తీసుకున్నారు. గత శుక్రవారం(మార్చి-15,2019) క్రైస్ట్ చర్చి నగరంలోని రెండు మసీదుల్లో జరిగిన ఉగ్రదాడి తమను తీవ్రంగా కలిచివేసినట్లు ఆమె తెలిపారు.

  • Published By: venkaiahnaidu ,Published On : March 21, 2019 / 10:47 AM IST
న్యూజిలాండ్ లో తుపాకుల అమ్మకాలపై నిషేధం

న్యూజిలాండ్ ప్రధాని జసిందా ఆర్డ్రెన్ కీలక నిర్ణయం తీసుకున్నారు. గత శుక్రవారం(మార్చి-15,2019) క్రైస్ట్ చర్చి నగరంలోని రెండు మసీదుల్లో జరిగిన ఉగ్రదాడి తమను తీవ్రంగా కలిచివేసినట్లు ఆమె తెలిపారు.

న్యూజిలాండ్ ప్రధాని జసిందా ఆర్డ్రెన్ కీలక నిర్ణయం తీసుకున్నారు. గత శుక్రవారం(మార్చి-15,2019) క్రైస్ట్ చర్చి నగరంలోని రెండు మసీదుల్లో జరిగిన ఉగ్రదాడి తమను తీవ్రంగా కలిచివేసినట్లు ఆమె తెలిపారు. దేశంలో మరోసారి ఇలాంటి ఘటనలు జరుగకుండా గన్ చట్టాల్లో మార్పులు చేస్తూ ఆమె నిర్ణయం తీసుకున్నారు. మిలటరీ స్టైల్ సెమీ ఆటోమెటిక్ గన్స్,అన్ని రకాల అసాల్ట్  రైఫిల్స్, సెమీ ఆటోమెటిక్ రైఫిళ్లును బయటి మార్కెట్లో అమ్మకాలపై పూర్తిగా నిషేధం విధిస్తన్నట్లు ప్రధాని జసిందా ప్రకటించారు.
Read Also : తేడా వస్తే జైలుకే : సోషల్ మీడియా ప్రచారానికి ఈసీ బ్రేక్

హై కెపాసిటీ రైఫిళ్లతో పాటూ ఫైర్ ఆర్మ్‌ను మిలిటరీ తరహా ఆటోమేటిక్ తుపాకులుగా మార్చే పరికరాలను కూడా ఇకపై ఎవరూ అమ్మడానికి వీల్లేదన్నారు. సెమీ ఆటోమెటిక్ రివాల్వర్లతోపాటు శుక్రవారం నాటి కాల్పుల్లో నిందితుడు బ్రెంటన్ వాడిన అన్ని రకాల ఆయుధాలపైనా నిషేధం విధిస్తున్నట్లు ఆమె ప్రకటించింది.ఈ నిషేధం వెంటనే అమల్లోకి వస్తుందంటూ ప్రధాని అధికారిక ప్రకటన జారీ  చేశారు.అదేవిధంగా కఠినమైన గన్ చట్టాలు ఏప్రిల్-11 నాటికి తీసుకురానున్నామని తెలిపారు.

తుపాకీ చట్టం అమల్లోకి రావడానికంటే ముందు మధ్యంతర చర్యగా  ఆయుధాల అమ్మకాలపై  బ్యాన్‌  విధించినట్టు జసిండా తెలిపారు.క్రైస్ట్ చర్చి సిటీలోని మసీదుల్లో గత శుక్రవారం ఆస్ట్రేలియా యువకుడు విచక్షణారహితంగా జరిపిన కాల్పుల్లో 50మంది ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. దీంతో వెంటనే స్పందించిన ప్రధాని జసిందా గన్ చట్టాల్లో వెంటనే మార్పులు తీసుకొచ్చారు.
Read Also : చిత్తుకాగితాలు కాదురా అవి : పాకిస్తాన్ ప్రింటింగ్ ప్రెస్ ల్లో భారత నోట్ల ముద్రణ