బతికిపోయాడు…రేసు గుర్రాల మధ్యలో కెళ్లిన కుర్రాడు

బతికిపోయాడు…రేసు గుర్రాల మధ్యలో కెళ్లిన కుర్రాడు

New Zealand ‘Lucky to be alive’: Punter charged after entering Trentham racetrack : కొన్నిప్రమాదాలు చూస్తే ఒళ్లు గగుర్పోడుస్తుంది. ఆ ప్రమాదంనుంచి బయటపడిన వాళ్లను చూసి వీడికింకా నూకలున్నాయంటుంటాం. గుర్రప్పందాలు చూడటానికి వెళ్లిన ఓ చిన్నోడు ఉన్నట్టుండి ఫీల్డ్ లోకి వెళ్లి పరిగెడుతున్న గుర్రాలకడ్డంగా నిలబడ్డాడు. అదృష్టం కొద్దీ ఏ గుర్రం అతడ్ని ఢీకొట్టకపోవటంతో ప్రాణాలతో బయట పడిపోయాడు.

వాస్తవానికి గుర్రాల రేసులను ప్రత్యక్షంగా గానీ, టీవీల్లోగానీ చూస్తే తెలుస్తుంది గుర్రాలు ఎంత వేగంగా పరిగెత్తుతాయో.. అలాంటప్పడు గుర్రాలకు ఏదైన వస్తువు అడ్డంగా వస్తే గుర్రాలతోపాటు జాకీలకు కూడా తీవ్ర గాయాలు అవుతుంటాయి. కొన్నికొన్నిసార్లు చనిపోతుంటారు.

అందుకే రేసింగ్‌ జరిగే ఫీల్డ్‌లోకి ఎవరూ వెళ్ళకుండా ఫెన్సింగ్‌ పెడతారు. రేస్‌కోర్స్‌ సిబ్బందిగానీ, ఫొటోగ్రాఫర్లుగానీ, ఇతర వ్యక్తులు గానీ ట్రాక్‌పైకి రాకుండా కట్టుదిట్టమైన భద్రతా చర్యలు తీసుకుంటుంటారు. అయితే, కొన్నిసార్లు మనకు తెలియకుండానే ఏదో ఒక వస్తువు ట్రాక్‌పైకి వచ్చి ఇబ్బందిపెడుతుంటది. అలాంటి ఇబ్బంది ఒకటి ఇటీవల న్యూజీలాండ్‌లో జరిగింది. అది కాస్త ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది

రేసు గుర్రాలు పోటీపడి మరీ పరిగెడుతున్నాయి. విజేతలుగా నిలిచేందుకు ఒకదాని కంటే ఒకటి వేగంగా పరిగెడుతున్నాయి. మరికాసేపట్లో ఫైనల్‌ లైన్‌ చేరుతాయి అనుకుంటూ ఉండంగా… ఉన్నట్లుండి ఓ వ్యక్తి ట్రాక్‌ మధ్యలోకి వచ్చాడు. అయితే, సదరు చిన్నోడికి అదృష్టం బాగుండటంతో అసలు ఎలాంటి ప్రమాదం జరుగకుండా గుర్రాలు ఒకదాని వెంట ఒకటి వెళ్లిపోయాయి. ట్రాక్‌ మధ్యలోకి వెళ్లి ఎలాంటి ప్రమాదం జరుగకుండా బయటపడటంతో.. భూమ్మీద నూకలు ఇంకా మిగిలి ఉన్నాయంటూ రేస్‌కోర్సులో ఉన్న పలువురు వ్యాఖ్యానించారు.

ఈ ఘటన న్యూజీలాండ్‌లోని అప్పర్‌ హట్స్‌ ట్రెన్థాం రేస్‌కోర్సులో వెల్లింగ్టన్‌ కప్‌ సందర్భంగా జరిగినట్లు తెలుస్తున్నది. విజయం సాధించినట్లుగా రెండు చేతులు పైకి చాపి అరుస్తూ ట్రాక్‌ మధ్యలోకి వెళ్తుండటం చూశామని పలువురు రేసర్లు తెలిపారు. సదరు వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. నెటిజెన్లు మాత్రం ఈయనగారికి ‘ఈడియట్ ఆఫ్‌ ది ఇయర్‌-2021’ అంటూ కామెంట్స్‌ పోస్ట్‌ చేశారు.