ఒకే ఒక్క డాలర్ కే ప్రముఖ మీడియా సంస్థ అమ్మకం..కొనేసిన సీఈవో

  • Published By: nagamani ,Published On : May 25, 2020 / 07:38 AM IST
ఒకే ఒక్క డాలర్ కే ప్రముఖ మీడియా సంస్థ అమ్మకం..కొనేసిన సీఈవో

ఒకే ఒక్క డాల‌ర్‌కు పెద్ద పేరు ప్రఖ్యాతులు ఉన్న ప్ర‌ముఖ మీడియా సంస్థ అమ్ముడుపోయింది. ఆ మీడియా సంస్థ సీఈవోనే దాన్ని కొనేశారు. ఇది నమ్మలేని విషయం. కానీ జరిగింది.

వివరాల్లోకి వెళితే..న్యూజిలాండ్‌కు చెందిన స్ట‌ఫ్ మీడియా సంస్థకు చాలా మంచి పేరుంది. ఆ సంస్థలో 900ల ఉద్యోగులు..400ల మంది జర్నలిస్టులు ఉన్నారు. న్యూజిలాండ్‌లో స్ట‌ఫ్ మీడియా సంస్థ‌కు ప్ర‌త్యేక గుర్తింపు ఉన్న‌ది. ప‌లు జాతీయ దిన‌ప‌త్రిక‌ల‌ను, ఓ పాపుల‌ర్ వెబ్‌సైట్‌ను కూడా స్ట‌ఫ్ న‌డిపిస్తోంది స్టఫ్. 

ఆస్ట్రేలియాకు చెందిన నైన్ ఎంట‌ర్‌టైన్మెంట్‌లో భాగ‌మైన స్టఫ్ సంస్థ‌ను సీఈవో సినియాబ్ బౌచ‌ర్ ఒక డాల‌ర్‌కు కొనేశారు. ఈ కొనుగోలుకు సంబంధించిన ఒప్పందం మే 31కి పూర్తికానుంది.  ఉద్యోగుల‌కు త‌మ కంపెనీలో వాటా ఇవ్వాల‌న్న‌దే త‌మ ఉద్దేశ‌మ‌ని ఈ సంద‌ర్భంగా సీఈవో బౌచ‌ర్ తెలిపారు. 

కాగా..కరోనా మహమ్మారి దెబ్బకు స్టఫ్ సంస్థ కూడా తప్పించుకోలేకపోయింది. ఈ సంస్థకు ఉండే మంచి పేరుతో పలు ప్రకటనలు దీనికి వచ్చేవి. కానీ కరోనా దెబ్బకు ఆర్థిక సవాళ్లను స్టఫ్ ను చుట్టుముట్టాయి. కానీ  ప్రకటన రావటం తగ్గిపోవటంతో సంస్థ ఆదాయం పడిపోయింది. 

దీంతో ఆస్ట్రేలియాకు చెందిన నైన్ ఎంట‌ర్‌టైన్మెంట్‌లో భాగ‌మైన స్టఫ్ సంస్థ‌ను అమ్మేయటంతో ఆ సంస్థ సీఈవోనే కొనుగోలు చేశారు. ఈ సంస్థలో పనిచేసే ఉద్యోగుల్ని దీంట్లో భాగస్వామ్యుల్ని చేస్తామనీ..తద్వారా ఆర్థిక సమస్యల నుంచి తప్పించుకోవటానికి ఉద్యోగులంతా కష్టపడి పనిచేసి బైటపడతామని ధీమా వ్యక్తం చేస్తున్నారు సీఈవో  బౌచ‌ర్. కాగా..తిరిగి తమ సంస్థను తాము దక్కించుకుంటామని సదరు సంస్థ యాజమాన్యం చెబుతోంది. 

Read: భూకంపం వ‌చ్చినా..TVలైవ్‌లో చిరునవ్వుతో ఇంట‌ర్వ్యూని కొనసాగించిన ప్ర‌ధాని: ఆమె గుండె ధైర్యానికి హ్యాట్సాఫ్