New Zealand: ఇండియా నుంచి వస్తే న్యూజిలాండ్‌లో నో ఎంట్రీ

భారత్ లో కరోనా కేసులు విపరీతంగా పెరుగుతున్నాయి. గురువారం దేశ వ్యాప్తంగా 1 లక్ష 26 వేల కేసులు నమోదయ్యాయి. కేసుల తీవ్రత అధికంగా ఉన్న నేపథ్యంలో న్యూజిలాండ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. భారత్ నుంచి ప్రయాణాలను నిలివేసింది.

New Zealand: ఇండియా నుంచి వస్తే న్యూజిలాండ్‌లో నో ఎంట్రీ

New Zealand Prime Minister

New Zealand: భారత్ లో కరోనా కేసులు విపరీతంగా పెరుగుతున్నాయి. గురువారం దేశ వ్యాప్తంగా 1 లక్ష 26 వేల కేసులు నమోదయ్యాయి. కేసుల తీవ్రత అధికంగా ఉన్న నేపథ్యంలో న్యూజిలాండ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. భారత్ నుంచి ప్రయాణాలను నిలివేసింది. న్యూజిలాండ్ పౌరులను కూడా అనుమతించేంది లేదంటూ ఆ దేశ ప్రధాని జెసిండా ఆర్డెర్న్ మీడియా సమావేశంలో వెల్లడించారు. భారత్ నుంచి ప్రయాణికులు రాకుండా నిషేధం విధించినట్లు ఆమె తెలిపారు.

ఈ నిషేధం ఏప్రిల్ 11 సాయంత్రం 4 గంటల నుంచి ఏప్రిల్ 28 వరకు అమల్లో ఉంటుందని తెలిపారు. ప్రయాణికుల రాకపోకలను నిలిపివేయడం వలన ఎదురయ్యే ఇబ్బందులు మేం అర్ధం చేసుకోగలం… కానీ వైరస్ విపరీతంగా పెరుగుతుంది. దీని అరికట్టేందుకే తాము ఈ నిర్ణయం తీసుకున్నామని తెలిపారు. కేసుల తీవ్రతను బట్టి నిషేధాన్ని పొడిగించే అవకాశం లేకపోలేదని ఆమె తెలిపారు.

న్యూజిలాండ్ లో కరోనా కేసులు చాలా తక్కువగా ఉన్నాయి. అక్కడ సామాజిక వ్యాప్తి లేదు. అయితే ఇతర దేశాల నుంచి వస్తున్న వారు కరోనాను మోసుకొస్తుండటంతో న్యూజిలాండ్ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. ఇటీవల విదేశాల నుంచి న్యూజిలాండ్ కు వచ్చిన ప్రయాణికులకు సరిహద్దుల్లో పరీక్షలు నిర్వహించారు. ఇందులో 23 మందికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయింది.. వీరిలో 17 మంది భారత్ నుంచి వచ్చిన వారే ఉన్నారు.

దీంతో న్యూజిలాండ్ ప్రభుత్వం భారత్ నుంచి ప్రజా రవాణాను నిలిపివేసింది. కరోనాను సరిహద్దుల్లోనే అడ్డుకునేందుకు న్యూజిలాండ్ కఠిన చర్యలు చేపడుతుంది. గత 40 రోజులుగా ఈ దేశంలో సామాజిక వ్యాప్తి కేసులు నమోదు కాలేదు