చైనాలో కలకలం…పుట్టిన 30గంటల్లోనే పసికందుకు కరోనా వైరస్

  • Published By: venkaiahnaidu ,Published On : February 5, 2020 / 09:40 PM IST
చైనాలో కలకలం…పుట్టిన 30గంటల్లోనే పసికందుకు కరోనా వైరస్

చైనాలోని వూహన్ సిటీలో వెలుగులోకి వచ్చిన కరోనా వైరస్ ఇప్పటివరకు ఆ దేశంలో 490మంది ప్రాణాలు తీసింది. 24వేల662 కరోనా కేసులు చైనాలో నమోదయ్యాయి. అయితే ఈ వైరస్ కు ఎలాంటి వ్యాక్సిన్ ఇప్పటివరకు అందుబాటులో లేకపోవడంతో రోజురోజుకీ ప్రాణాలు కోల్పోతున్న వారి సంఖ్య పెరుగుతూ పోతుంది. అప్పుడే పుట్టిన పిల్లలను కూడా ఈ వైరస్ వదలిపెట్టడం లేదు. చైనాలోని వూహన్‌లో ఓ గర్భిణికి ఈ వైరస్ సోకగా. ఆమెకు జన్మించిన బిడ్డకు కూడా ఈ వైరస్ సోకినట్లు వైద్యులు గుర్తించారు. అయితే ఇలాంటి కేసు ఇదే మొదటిది కావడంతో ప్రజలంతా భయాందోళనలకు గురవుతున్నారు. 

వుహాన్ నగరానికి చెందిన ఓ మహిళ ప్రసవం కోసం ఇటీవల హాస్పిటల్ లో చేరగా…బిడ్డకు జన్మనివ్వడానికి ముందు కరోనా పాజిటివ్‌ అని తేలింది. పుట్టిన బిడ్డకు కూడా సోకిందేమోననే అనుమానంతో పరీక్షలు చేయగా.. ఊహించిందే జరిగింది. పుట్టిన 30 గంటలకే చిన్నారికి వైరస్ సోకింది. కరోనా పరీక్షల్లో పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. బుధవారం (ఫిబ్రవరి 5) ఉదయం ఈ విషయం వెలుగులోకి వచ్చింది. వెర్టికల్‌ ట్రాన్స్‌మిషన్‌‌లో తల్లి నుంచి బిడ్డకు వైరస్ సంక్రమించినట్లు డాక్టర్లు తెలిపారు.

ఇప్పటికే వందలాది మంది ప్రాణాలను బలిగొన్న కరోనా వైరస్‌..ఇప్పుడు పుట్టిన 30 గంటలకే ఓ చిన్నారికి సోకింది. కరోనా పరీక్షల్లో పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. బుధవారం (ఫిబ్రవరి 5) ఉదయం ఈ విషయం వెలుగులోకి వచ్చింది. వెర్టికల్‌ ట్రాన్స్‌మిషన్‌‌లో తల్లి నుంచి బిడ్డకు వైరస్ సంక్రమించినట్లు డాక్టర్లు తెలిపారు. గర్భధారణ సమయంలో గానీ, ప్రసవ సమయంలో గానీ తల్లి నుంచి బిడ్డకు అంటువ్యాధులు సంక్రమించడాన్ని వెర్టికల్‌ ట్రాన్స్‌మిషన్‌ అంటారు. ఇప్పటి వరకూ కరోనా వైరస్‌ బారిన పడిన వారిలో ఈ చిన్నారే అత్యంత పిన్న వయస్కురాలు కావడం గమనార్హం. తల్లి, బిడ్డలకు ట్రీట్మెంట్ కొనసాగుతున్నట్లు అధికారులు తెలిపారు.

అయితే గత వారం హార్బిన్‌ నగరంలో వైరస్‌ సోకిన ఓ గర్భిణి బిడ్డకు జన్మనివ్వగా…ఆ బిడ్డకు మాత్రం వైరస్ సోకలేదని డాక్టర్లు చెబుతున్నారు. కరోనా వైరస్ బాధితులకు ట్రీట్మెంట్ కోసం 10 రోజుల్లోనే 1000 పడకలతో కూడిన భారీ హాస్పిటల్ ను చైనా నిర్మించింది. ఇందులోని కరోనా వైరస్ బాధితులకు ట్మీట్మెంట్ కల్పిస్తోంది. మరికొన్ని రోజుల్లోనే 1500 పడకల వసతి కలిగిన మరో హాస్పిటల్ ను ప్రారంభించనున్నారు. కరోనా వైరస్ చైనాతో పాటు ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపే అవకాశముంది. 

చైనాలో కరోనా వైరస్ బారిన పడి అనధికారికంగా వేలాది మంది మరణించినట్లు కొన్ని ఆంగ్ల పత్రికలు కథనాలను ప్రచురించడం ఆందోళన కలిగిస్తోంది. ఇప్పటికే 26 దేశాల్లో కరోనా వైరస్ కేసులు నమోదయ్యాయి. భారత్ లోకి కూడా కరోనా వైరస్ ఎంట్రీ ఇచ్చింది. కేరళలో ముగ్గురుకి కరోనా వైరస్ సోకినట్లు డాక్టర్లు నిర్థారించారు. ఇక హైదరాబాద్‌లో మరో నాలుగు కరోనా అనుమానిత కేసులు నమోదవడం హాట్ టాపిక్‌గా మారింది. మరోవైపు గబ్బిలాల నుంచే కరోనా వైరస్ వచ్చిందని నిర్ధారించే మరిన్ని ఆధారాలు లభించినట్లు చైనా శాస్త్రవేత్తలు చెబుతున్నారు. వుహాన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ నిపుణుల పరిశీలనలో ఏడుగురు కరోనా వైరస్ రోగులకు గబ్బినాల నుంచి వైరస్ సోకినట్లు తేల్చారు.