Fertility Doctor : పిల్లల కోసం ఆస్పత్రికి వెళ్లిన మహిళలకు తన వీర్యంతోనే గర్భం చేస్తున్న డాక్టర్

తన వద్దకు వచ్చే మహిళలకు తన సొంత వీర్యంతోనే గర్భం వచ్చేలా చేస్తున్నాడు ఓ ఫెర్టిలిటీ డాక్టర్. ఆ డాక్టర్ పై ఓ మహిళ కోర్టులో పిటీషన్ వేసింది.

Fertility Doctor : పిల్లల కోసం ఆస్పత్రికి వెళ్లిన మహిళలకు తన వీర్యంతోనే గర్భం చేస్తున్న డాక్టర్

Fertility Doctor

woman accuses fertility doctor of secretly using own sperm : డాక్టర్ అంటే దేవుడితో సమానం అంటారు. కానీ డాక్టర్ మాత్రం తనను నమ్మి వచ్చిన మహిళనే మోసం చేస్తున్నాడు. తన వీర్యంతోనే వారు గర్భం ధరించేలా చేస్తున్నాడు. ఈ విషయం తెలిసిన ఓ బాధితురాలు ఆ డాక్టర్ పై కోర్టుకెక్కటంతో సదరు డాక్టర్ బండారం బయటపడింది. పిల్లల కోసం తన వద్దకు వచ్చే మహిళలకు వారికి తెలియకుండా తన వీర్యంతోనే గర్భం ధరించేలా చేస్తున్న ఓ ఫెర్టిలిటీ డాక్టర్ పై ఫిర్యాదు చేయటంతో తన చేసిన పనిని ఒప్పుకోవాల్సి వచ్చింది సదరు డాక్టర్.

అది అమెరికా. రోచెస్టర్ కు చెందిన డాక్టర్ మోరిస్ వోర్ట్ మన్ అనే డాక్టర్ ఫెర్టిలిటీ డాక్టర్ గా పనిచేస్తున్నారు. పిల్లల కోసం తన వద్దకు వచ్చే మహిళలకు దాతల నుంచి సేకరించిన వీర్యం కాకుండా తన సొంత వీర్యం ద్వారానే గర్భం వచ్చేలా చేస్తున్నాడనే ఆరోపణలు వస్తున్నాయి. డాక్టర్ మోరిస్ పై న్యూయార్క్ కు చెందిన ఓ మహిళ ఫిర్యాదు చేసింది ఆ డాక్టర్ దాతల నుంచి సేకరించిన వీర్యాన్ని కాకుండా తన సొంత వీర్యంతోనే తన వద్దకు వచ్చే మహిళలకు గర్భం వచ్చేలా చేస్తున్నాడని ఆరోపిస్తోంది.

Read more : ‘Baby Factory’: సరోగసీ వ్యాపారం..రూ.40 లక్షలకు పసికందుల అమ్మకం..

1980లో దాతల నుంచి సేకరించిన వీర్యంతో ఓ మహిళ గర్బం దాల్చింది. రోచెస్టర్ కు చెందిన మోరిస్ వోరట్ మన్ అనే డాక్టర్ ఆమెకు ఫెర్టిలిటీ చికిత్స ద్వారా గర్భం దాల్చేలా చేశారు. స్థానిక మెడికల్ స్టూడెంట్ నుంచి సేకరించిన వీర్యంతోనే చికిత్స చేశానని ఆ డాక్టర్ తెలిపాడు. కానీ అది ఆ డాక్టర్ వీర్యమేనని ఆ మహిళకు జన్మించిన కుమార్తె ఆరోపిస్తోంది. దీనిపైనే కోర్టులో పిటీషన్ దాఖలు చేశారామె. కాగా ఫిర్యాదు చేసిన మహిళ అదే డాక్టర్ వద్ద గైనకాలజీ చికిత్స చేయించుకుంటోంది.

తాను 1985లో పుట్టానని చెబుతున్న పిటీషన్ వేసిన మహిళ.. డీఎన్ ఏ జీనాలజీ ( తమ వంశంలోని వ్యక్తులను గుర్తించేందుకు) పరీక్ష చేయించుకుంది. ఈ పరీక్షల రిపోర్టులను బట్టి తనకు 9మంది తోబుట్టువులు ఉన్నట్లుగా తెలుసుకుంది. దీనిపై డాక్టర్ వోర్ట్ మన్ ఏమాత్రం స్పందించలేదు.

కాగా గత కొన్నేళ్లుగా ఇటువంటి ఘటనలు వెలుగులోకి వస్తున్నాయి.సేకరించిన వీర్యాన్ని కాకుండా డాక్టర్లు వారి సొంత వీర్యంతోనే తమ వద్దకు వచ్చే మహిళలకు గర్భం చేస్తున్నారని ఆరోపణలు కొంతమంది డాక్టర్లపై వస్తున్నాయి. దాతల నుంచి సేకరించిన వీర్యంతోనే చికిత్స చేస్తున్నాని చెప్పిన ఇండియానాకు చెందిన డాక్టర్ డొనాల్డ్ క్లైన్ పదుల సంఖ్యలో మహిళలకు తన సొంత వీర్యాన్నే ఉపయోగించాడని తేలింది. ఆ తరువాత ఇది వివాదం కావటంతో డాక్టర్ డొనాల్డ్ క్లైన్ తను చేసిన పని అంగీకరించాడు.దీంతో కోర్టు అతని డాక్టర లైసెన్సు ని ఏడాదిపాటు రద్దు చేసింది.