Newzealand Smoke Free : న్యూజిలాండ్ లో ధూమపానంపై జీవితకాల నిషేధం

న్యూజిలాండ్ లో ధూమపానంపై జీవితకాల నిషేధం విధించే ఓ వినూత్న యోచనకు శ్రీకారం చుట్టింది. ఇది అమలులోకి వస్తే ఇక ఆదేశంలో ఎవ్వరు సిగిరెట్ కాల్చలేరు.

Newzealand Smoke Free : న్యూజిలాండ్ లో ధూమపానంపై జీవితకాల నిషేధం

Newzealand Smoke Free

Newzealand smoke free : పొగ త్రాగటం హానికరం. అయినా పొగరాయుళ్లు మానరు. గుప్పు గుప్పుమని పొగ వదులు దమ్ముకొట్టేస్తుంటారు. లంగ్స్ పాడైపోయినా సిగిరెట్లు కాల్చటం మాత్రం మానరు. ఇదిలా ఉంటే పొగరాయుళ్లకు చెక్ పెట్టాలని న్యూజిలాండ్ ప్రభుత్వం వినూత్న ప్రతిపాదన తెచ్చింది. ఒకేసారి నిషేధించకుండా వినూత్న యోచన చేసింది ప్రభుత్వం. అదేమిటంటే..పొగతాగేవారి కనీస అర్హతను పెంచే ప్రతిపాదన చేసింది. అలా ఒక్కో సంవత్సరం ఆ కనీస అర్హత వయస్సును పెంచుతామని ప్రభుత్వం వెల్లడించింది. ఈ ప్రతిపాదనను విశ్లేషించి చూస్తే అలా పెరుగు పెరుగుతు చివరికి..వారు జీవితంలో ఇక పొగతాగే అవకాశం లేని ఓ వినూత్న ప్రతిపాదన తెచ్చింది న్యూజిలాండ్ ప్రభుత్వం.

ధూమపానంపై నిషేధం విధించడమే లక్ష్యంగా న్యూజిలాండ్​ ప్రభుత్వం ఈ వినూత్న ప్రతిపాదన తీసుకొచ్చింది. ఏటా ధూమపానం చేసేందుకు యువతకు ఉండాల్సిన కనీస వయసును పొడగించనుంది. ఇందుకు సంబంధించి అక్కడి ప్రభుత్వం గురువారం (డిసెంబర్ 9,2021) కీలక ప్రకటన చేసింది. ప్రస్తుతం..న్యూజిలాండ్ 18 ఏళ్లలోపు వారికి పొగాకు అమ్మకాలను నిషేధించింది. ఈక్రమంలో ఈ వయస్సును మరింతగా తగ్గించనుంది.

ఈ బిల్లు గురించి ఆరోగ్యశాఖా మంత్రిత్వ శాఖ ప్రతినిథి మాట్లాడుతూ.. 2027 నుండి పొగ రహితంగా ఉంచడానికి వయస్సు నిషేధం ఏటా ఒక సంవత్సరం పెరుగుతుందని తెలిపారు. న్యూజిలాండ్ ఆరోగ్య సహాయ మంత్రి అయేషా వెరాల్ మాట్లాడుతు..గత 10ఏళ్లుగా న్యూజిలాండ్ లో ధూమ పానం చేసేవారి సంఖ్య తగ్గిందని తెలిపారు. 15 ఏళ్లు పైబడినవారిలో 11.6శఆతం తగ్గిందని అదే దశాబ్దం క్రితం చూసుకుంటే 18 శాతం మంది పొగతాగేవారని తెలిపారు. చిరు వ్యాపారులు వారి వ్యాపారం కోసం దొంగతనంగా సిగిరెట్లు అమ్ముతున్నారని..ఇకనుంచి అలా సాగనివ్వబోమని హెచ్చరించారు.సిగిరెట్ అమ్మకాలపై 2024 నుండి దశలవారీగా ఆంక్షలు అమలులోకి వస్తాయనీ..దీంతో ఇక సిగిరెట్ల అమ్మకాలు గణనీయంగా తగ్గుతాయని తెలిపారు.

సిగిరెట్లు తాగటం వల్ల న్యూజిలాండ్ దేశ వ్యాప్తంగా రోజుకు 14మంది మరణిస్తున్నారని..ధూమపానం చేసే ప్రతి ముగ్గురిలో ఇద్దరు ధూమపానం కారణంగానే చనిపోతున్నారని న్యూజిలాండ్ మెడికల్ అసోసియేషన్ చైర్ అలిస్టర్ హంప్రీ తెలిపారు. ఈ కొత్త ప్రతిపాదన చట్టంగా వస్తే 65 ఏళ్ల తర్వాత సిగిరెట్లు కొనుగోలు చేసేందుకు ఉండాల్సిన కనీస వయసు 80 ఏళ్లకు చేరుతుంది. ఇలా చేయడం వల్ల దేశంలో రానురానూ.. సిగిరెట్​ వినియోగం తగ్గిపోతుందని అధికారులు అంచనా వేస్తున్నారు.

2025 నాటికి దేశంలో పొగతాగేవారి సంఖ్య 5 శాతం కన్నా తక్కువ ఉండాలన్నది న్యూజిలాండ్​ ప్రభుత్వ లక్ష్యం.ప్రస్తుతం న్యూజిలాండ్​లో సిగిరేట్​ కాల్చాలంటే ఉండాల్సిన కనీసం 18 ఏళ్లు. ఈ ప్రతిపాదన అమలులోకి వస్తే..14 ఏళ్లు లేదా అంతన్నా తక్కువ వయసు ఉన్న వారికి సిగిరెట్లపై జీవితకాల నిషేధం విధించినట్లైంది. అలా అలా పొగతాగేవారి కనీస అర్హతన వయస్సు తగ్గిస్తు తగ్గిస్తు..చివరికి ఇక న్యూజిలాండ్ లో ఎవ్వరు సిగిరెట్ తాగే అర్హత కోల్పోతారు. అలా 2027నాటికి న్యూజిలాండ్ లో పొగతాగం పూర్తిగా నిషేధమైపోతుంది. ఎవ్వరు ఇక పొగతాగలేదు.