Accident In Alabama :15 వాహనాలు ఢీ..9మంది చిన్నారులు మృతి

అమెరికాలోని అల‌బామా రాష్ట్రంలో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో ఓ వ్యక్తితో సహా 9మంది పిల్లలు మృతి చెందారు. పిల్లలంతా 3 నుంచి 17 ఏళ్ల మధ్య ఉన్నవారే.అలబామాలోని ఇంటర్‌స్టేట్ హైవేపై జరిగిన ఈ ప్రమాదంలో మొత్తం 10 మంది చనిపోగా వీరిలో తొమ్మిదిమంది పిల్లలే ఉన్నారు.

Accident In Alabama :15 వాహనాలు ఢీ..9మంది చిన్నారులు మృతి

Accident In Alabama

Accident in Alabama US : అమెరికాలోని అల‌బామా రాష్ట్రంలో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో ఓ వ్యక్తితో సహా 9మంది పిల్లలు మృతి చెందారు. పిల్లలంతా 3 నుంచి 17 ఏళ్ల మధ్య ఉన్నవారే.అలబామాలోని ఇంటర్‌స్టేట్ హైవేపై జరిగిన ఈ ప్రమాదంలో మొత్తం 10 మంది చనిపోగా వీరిలో తొమ్మిదిమంది పిల్లలే. ఓ బీచ్‌లో విహార‌యాత్ర‌కు వెళ్లిన చిన్నారులు వ్యాన్‌లో తిరిగి వ‌స్తుండ‌గా ప్ర‌మాదం జ‌రిగింది.

అల‌బామాలో గ‌త కొన్ని రోజులుగా టొర్నడోలు విజృంభిస్తుండ‌టంతో ఈ ప్ర‌మాదం జ‌రిగినట్లుగా తెలుస్తోంది. వ‌ర‌ద‌నీటిలో కొట్టుకొచ్చిన దాదాపు 15 వాహ‌నాలు ఒక‌దానికొక‌టి ఢీకొంటూ చిన్నారులు ప్ర‌యాణిస్తున్న వ్యాన్‌ను ఢీకొట్టటంతో ఈ ప్రమాదం సంభవించింది. దాంతో పిల్లలు ప్రయాణించే వ్యాన్‌లో మంట‌లు చెల‌రేగి డ్రైవ‌ర్ స‌హా చిన్నారులంతా ప్రాణాలు కోల్పోయారు. మొత్తం 15 వాహ‌నాలు ఒక‌దానికి ఒక‌టి ఢీకొన‌గా అందులో ఏడు వాహ‌నాలు ద‌గ్ధ‌మ‌య్యాయి. మిగ‌తా వాహ‌నాల్లో మ‌నుషులు లేక‌పోవ‌డంతో పెనుప్ర‌మాదం త‌ప్పినట్టైంది.