ఒకే గదిలో నీరవ్ మోడీ, విజయ్ మాల్యా

బ్యాంకులకు వేలకోట్లు మోసం చేసి లండన్‌లో తల దాచుకుంటున్న నీరవ్ మోడీ, విజయ్ మాల్యాలు ఒకే గదిలో ఉంబోతున్నారా?

  • Published By: vamsi ,Published On : March 30, 2019 / 07:04 AM IST
ఒకే గదిలో నీరవ్ మోడీ, విజయ్ మాల్యా

బ్యాంకులకు వేలకోట్లు మోసం చేసి లండన్‌లో తల దాచుకుంటున్న నీరవ్ మోడీ, విజయ్ మాల్యాలు ఒకే గదిలో ఉంబోతున్నారా?

బ్యాంకులకు వేలకోట్లు మోసం చేసి లండన్‌లో తల దాచుకుంటున్న నీరవ్ మోడీ, విజయ్ మాల్యాలు ఒకే గదిలో ఉంబోతున్నారా? ఈ రకమైన చర్చను లేవనెత్తింది ఎవరంటే వెస్ట్‌మినిస్టర్‌ మేజిస్ట్రేట్స్‌ కోర్టు చీఫ్‌ మేజిస్ట్రేట్‌ ఎమ్మా ఆర్బుత్‌నాట్‌. పంజాబ్‌ నేషనల్‌ బ్యాంక్‌ను వేల కోట్లకు మోసగించిన వజ్రాల వ్యాపారి నీరవ్‌ మోడీ బెయిల్ పిటిషన్‌ను లండన్‌లోని వెస్ట్‌మినిస్టర్‌ న్యాయస్థానం కొట్టివేసింది. ఈ పిటీషన్ విచారణ సంధర్భంగా ఎమ్మా ఇటువంటి వ్యాఖ్యలు చేశారు.
Read Also : మీరు SBI కస్టమరా..? మీకు బ్యాంకు విధించే 5 ఛార్జీలు ఏంటో తెలుసా?

ఒకవేళ విజయ్ మాల్యాను, నీరవ్ మోడీని ఇద్దరినీ భారత్‌కు అప్పగిస్తే ఎక్కడ ఉంచుతారు అని ప్రశ్నించిన ఎమ్మాకు.. భారత ప్రభుత్వం తరఫున వాదనలు వినిపించిన క్రౌన్‌ ప్రాసిక్యూషన్‌ సర్వీస్‌ న్యాయవాది స్పందిస్తూ.. ‘విజయ్‌ మాల్యా కోసం సిద్ధం చేసిన ముంబైలోని ఆర్థర్‌ రోడ్‌ జైల్లో నీరవ్‌ను  ఉంచవచ్చునంటే చెప్పారు. దీంతో వెంటనే న్యాయమూర్తి స్పందిస్తూ..  ఒకే గదిలో కూడా ఉంచొచ్చేమో. మీరు ఇచ్చిన వీడియోలో ఉన్న గదిలో స్థలం కూడా ఎక్కువగానే ఉంది. అంటూ చమత్కరించారు.

విజయ్‌ మాల్యాను భారత్‌కు అప్పగించే కేసును కూడా జస్టీస్ ఎమ్మానే విచారిస్తున్నారు. భారత్‌లో జైళ్లు సరిగా ఉండవు అంటూ మాల్యా గతంలో ఆరోపించగా.. మాల్యాను ఎక్కడ ఉంచుతారో చెప్పాలంటూ యూకే కోర్టు భారత్‌ను అడిగింది. దీంతో ముంబైలోని అర్థర్‌ రోడ్‌ జైల్లో మాల్యాను ఉంచేందుకు సిద్ధం చేసిన గది వీడియోను భారత అధికారులు యూకే కోర్టుకు సమర్పించారు. ఆ గది గురించే న్యాయమూర్తి తాజాగా ప్రస్తావించారు.
Read Also : బాబోయ్.. బిల్లు కట్టేదెట్టా : కేబుల్, డీటీహెచ్ ఛానళ్లు వెరీ కాస్ట్‌లీ