కరోనా టీకా తీసుకుంటే..2 నెలల పాటు లిక్కర్ బంద్!

  • Published By: madhu ,Published On : December 10, 2020 / 07:22 AM IST
కరోనా టీకా తీసుకుంటే..2 నెలల పాటు లిక్కర్ బంద్!

No drinking alcohol : మందుబాబులకు షాక్ ఇచ్చే వార్త. కరోనా వ్యాక్సిన్ తీసుకున్న అనంతరం రెండు నెలల పాటు మద్యం తాగొద్దని అధికారులు హెచ్చరిస్తున్నారు. అత్యధికంగా మద్యం తాగే దేశాలకు మింగుడు పడని వార్తేనని అంటున్నారు విశ్లేషకులు. వ్యాక్సిన్ ప్రభావవంతం కావడానికి 42 రోజుల్లో రష్యా ప్రజలు అదనపు జాగ్రత్తలు పాటించాల్సి వస్తుందని రష్యా ఉప ప్రధాని టటియానా గోలికోవా వెల్లడించారు. రద్దీగా ఉండే ప్రదేశాలను సందర్శించిన సమయంలో ప్రజలు జాగ్రత్తలు పాటించాలని సూచించారు.



ఫేస్ మాస్క్ లు ధరించడం, శానిటైజర్ లు ఉపయోగించడం, పరిచయాలను తగ్గించడం లాంటివి అలవాటు చేసుకోవాలన్నారు. శరీరంపై ఒత్తిడి లేకుండా ఉండాలని, ఆరోగ్యంగా ఉండడం, రోగ నిరోధక శక్తి పెంచుకోవడం కోసం మద్యం సేవించవద్దని సూచించారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకారం మద్యం సేవించే దేశాల్లో రష్యా నాలుగో స్థానంలో ఉంది. సంవత్సరానికి 15.1 లీటర్ల అల్కాహాల్ వినియోగిస్తారని ఏజెన్సీ వెల్లడించింది. ఇక వ్యాక్సిన్ ప్రజలకు అందించడానికి రష్యా ప్రయత్నాలు ప్రారంభించింది. ఇప్పటికే లక్ష మందికి టీకాలు వేసినట్లు ఆరోగ్య అధికారులు అంచాని వేస్తున్నారు.



Sputnik V vaccine 90 శాతానికిపైగా ప్రభావవంతంగా ఉందని అంటున్నారు. రష్యాలో 2.4 మిలియన్ల కరోనా వైరస్ కేసులు నమోదయ్యాయి. 42 వేల మందికిపైగా మరణించారు. కరోనా వ్యాక్సిన్ పెట్టేందుకు ఎన్నో దేశాలు ప్రయత్నాలు ముమ్మరం చేసిన సంగతి తెలిసిందే. వ్యాక్సిన్ ట్రయల్స్ చివరి దశకు చేరుకున్నాయి కూడా. తొలి దశలో కోవిడ్ వ్యాక్సిన్ కరోనా వారియర్స్ కు ఇవ్వనున్నారు.