Maldives: భారత పర్యాటకులకు నో ఎంట్రీ

భారత్ లో కరోనా తీవ్రత అధికంగా ఉంది. సెకండ్ వేవ్ వేగంగా విస్తరిస్తుండటంతో అనేక దేశాలు భారత్ కు రాకపోకలు నిలిపివేశాయి. భారత్ నుంచి తమ దేశాలకు వచ్చే వారిపై ఆంక్షలు విధించాయి. ఇక తాజాగా మాల్దీవులు కూడా కీలక ప్రకటన చేసింది.

Maldives: భారత పర్యాటకులకు నో ఎంట్రీ

Maldives

Maldives: భారత్ లో కరోనా తీవ్రత అధికంగా ఉంది. సెకండ్ వేవ్ వేగంగా విస్తరిస్తుండటంతో అనేక దేశాలు భారత్ కు రాకపోకలు నిలిపివేశాయి. భారత్ నుంచి తమ దేశాలకు వచ్చే వారిపై ఆంక్షలు విధించాయి. ఇక తాజాగా మాల్దీవులు కూడా కీలక ప్రకటన చేసింది. భారత పర్యాటకులపై తాత్కాలికంగా నిషేధం విధిస్తున్నట్లు ప్రకటించింది. ఈ నిషేధం మే 13 నుంచి అమలులోకి రానున్నట్లు తెలిపింది. ఈ విషయాన్నీ మాల్దీవులు ఇమ్మిగ్రేషన్ విభాగం ట్విట్టర్ వేదికగా వెల్లడించింది.

”దక్షిణాసియా దేశాలకు చెందిన పర్యాటకులకు మాల్దీవుల్లోకి ప్రవేశాన్ని తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు పేర్కొంది. అన్ని రకాల వీసాలకు ఈ నిబంధన వర్తిస్తాయని ట్విట్ లో తెలిపారు. ఈ నిషేధంపై అక్కడి భారత హై కమిషన్‌ స్పందించింది. మాల్దీవులు నిర్ణయం.. ఇరు దేశాల మధ్య విమాన రాకపోకలపై ప్రభావం చూపే అవకాశం ఉందని ,అందువల్ల ఇక్కడ ఉన్న భారతీయులు తిరిగి స్వదేశానికి వెళ్లేందుకు తగిన ఏర్పాట్లు చేసుకోవాలని రాయబార కార్యాలయం సూచించింది.

ఇక మాల్దీవులలో భారత పర్యాటకుల తాకిడి అధికంగా ఉంటుంది. ప్రతి ఏడాది లక్షమందికి పైగా భారతీయ పర్యాటకులు మాల్దీవులు వెళ్తుంటారు. వీరిలో సినీ పరిశ్రమకు చెందిన వారు అధికంగా ఉంటారు. ఇటీవల కరోనా మొదటి దశ ఉద్ధృతి కాస్త తగ్గిన తర్వాత సినీ ప్రముఖులు వరుసగా మాల్దీవులు బాట పట్టారు.