Sudan : పాస్‌పోర్ట్ లాక్కున్నారు….జీతాలు లేవు… సూడాన్ లో ఇరుక్కుపోయిన 62 మంది భారతీయులు
సూడాన్ లోని నోబుల్స్ గ్రూప్ అనే పెద్ద సెరామిక్ టైల్స్ కంపెనీ లో ఉద్యోగానికి భారతదేశం లోని పలు రాష్ట్రాల నుంచి కొంతమంది వెళ్లారు. సూడాన్ ఎప్పుడైతే రిపబ్లిక్ గా అవతరించిందో అప్పటి ను

Sudan Indians
Sudan : నాలుగు డబ్బులు సంపాదించుకుందామని దేశంకాని దేశం వస్తే అక్కడ జరిగిన రాజకీయ పరిణామాలతో 62 మంది భారతీయులు చేతిలో చిల్లిగవ్వలేక.. తినటానికి తిండిలేక.. స్వదేశం వెళ్లటానికి పాస్‌పోర్టు లేక నరక యాతన అనుభవిస్తున్నారు. సూడాన్‌లోని నోబుల్స్ గ్రూప్ కంపెనీలో పనిచేస్తున్న భారతీయ కార్మికుల దీనస్ధితి ఇది.
సూడాన్ లోని నోబుల్స్ గ్రూప్ అనే పెద్ద సెరామిక్ టైల్స్ కంపెనీ లో ఉద్యోగానికి భారతదేశం లోని పలు రాష్ట్రాల నుంచి కొంతమంది వెళ్లారు. సూడాన్ ఎప్పుడైతే రిపబ్లిక్ గా అవతరించిందో అప్పటి నుంచి అక్కడ పనిచేసే వర్కర్లకు కష్టాలు మొదలయ్యాయి. గత అక్టోబర్ నెలలో సైనికుల తిరుగుబాటు చర్యల వల్ల ప్రస్తుతం అక్కడ మిలటరీ ప్రభుత్వం నడుస్తోంది.
దీంతో నోబుల్ కంపెనీ ఓనర్ మహమ్నద్ మామౌన్ దేశం విడిచి పారి పోయాడు. దీంతో నోబుల్స్ గ్రూప్ కంపెనీని మిలటరీ స్వాధీనం చేసుకుంది. అక్కడ పనిచేసే ఉద్యోగుల పాస్ పోర్టులు లాక్కోంది. జీతాలు సరిగ్గా ఇవ్వక వాళ్లు దేశం విడిచి వెళ్లకుండా వారిని ఇబ్బందులకు గురిచేస్తోంది. నోబుల్స్ కంపెనీకి చెందిన రాక్ సెరామిక్స్ ఫ్యాక్టరీ, ఏఎల్ మసా పోర్సెలైన్ ఫ్యాక్టరీలో భారతీయులు పని చేస్తున్నారు.
మిలటరీ జీతాలు ఇవ్వకపోయేసరికి భారతీయులు నరక యాతన అనుభవిస్తున్నారు. సూడాన్ నుంచి ఇంటికి డబ్బులు పంపించుకోవాల్సింది పోయి…. అక్కడి నుంచి తినడానికి డబ్బులు తెప్పించుకుంటున్నామని ఉద్యోగులు బాధపడ్డారు. రోజుకు ఒకపూట తినటం,, కొన్ని రోజులు ఏమీ తినకుండా పస్తులు ఉండాల్సిన పరిస్ధితి ఏర్పడిందని ఒక ఉద్యోగి తెలిపాడు.
చివరికి ఉద్యోగులంతా కలిసి సూడాన్ రాజధాని ఖౌర్జామ్ లో ఉన్న ఇండియన్ ఎంబసీని సంప్రదించారు. జీతాలు ఇవ్వకున్నా, పని లేకున్నా పర్వాలేదు.. మా పాస్ పోర్టు మాకు ఇచ్చేలా చర్యలు తీసుకోవాలని వారు కోరారు. పాస్ పోర్ట్స్ ఇప్పిస్తామని ఇండియన్ ఎంబసీ హామీ ఇచ్చింది. కానీ ఇంతవరకు ఆ పని జరగలేగదు. కొన్నివారాలుగా ఇండియన్ ఎంబసీవద్ద పడిగాపులు కాస్తున్నామని కార్మికులు తెలిపారు.
అయితే ప్రస్తుతానికి వాళ్ల అవసరాల కోసం ఇండియన్ ఎంబసీ కొన్ని డబ్బులు ఇచ్చి వారిని ఆదుకుంది. వారిని సూడాన్ తీసుకువుచ్చిన సూపర్ వైజర్ కూడా మోసం చేసాడని ఉద్యోగులు వాపోయారు. తమ వీసాలను రెసిడెంట్ వీసాలుగా మార్చాలని కోరినా అది కూడా జరగలేదని ఉద్యోగులు చెప్పారు.
Also Read : Retirements in RTC: ఆర్టీసీలో పదవీ విరమణలు మొదలు కానున్నాయా?
తమ వీసా గడువు ముగిసిపోవటంతో వాటిని రెసిడెంట్ వీసాలుగా మార్చకపోతే సూడాన్ నుంచి ఇండియా వెళ్లినప్పుడు జరిమానా కట్టాల్సి ఉంటుందని…. ఇమ్మిగ్రేషన్ కు కూడా తమ వద్ద డబ్బులు లేవని వారు ఆవేదన వ్యక్తం చేశారు. తమ సమస్యకు పరిష్కారం ఎప్పుడు దొరుకుతుందో తెలియక 62 మంది భారీతయులు కంటమీద కునుకు లేకుండా ఎదురు చూస్తున్నారు.