బీజేపీ లెక్కలు ఎంతవరకు నిజం: పాక్, బంగ్లాల్లో ముస్లిమేతరులు తగ్గారా

బీజేపీ లెక్కలు ఎంతవరకు నిజం: పాక్, బంగ్లాల్లో ముస్లిమేతరులు తగ్గారా

పౌరసత్వపు బిల్లు ప్రవేశపెట్టిన బీజేపీ పాక్‌లో ముస్లిమేతరులు తగ్గిపోయారంటూ వాదన వినిపించింది. ఇందులో వాస్తవం కనిపించడం లేదు. కేంద్ర హోం మంత్రి బిల్లుపై సోమవారం లోక్ సభలో మాట్లాడుతూ.. పాకిస్తాన్ స్వాతంత్ర్యం వచ్చిన సమయం నుంచి ఇప్పటికీ పాక్‌లో ముస్లిమేతరుల నిష్పత్తి తగ్గిపోతుందని చెప్పుకొచ్చారు. 

పాకిస్తాన్‌లో.. 1947వ సంవత్సరం ముస్లిమేతరుల నిష్పత్తి 23శాతం ఉండగా 2011సంవత్సరానికి 3.7శాతానికి పడిపోయింది. అది బంగ్లాదేశ్‌లో 22 శాతం నుంచి 2011కు 7.8శాతానికి తగ్గింది. వీరంతా ఎక్కడికి వెళ్లారు. లేదా వారి ధర్మాన్ని మార్చుకున్నారా.. లేదా వాళ్లని చంపేశారా.. అక్కడి నుంచి తరిమేశారా.. భారత్‌కు పంపేశారా..’ అని వ్యాఖ్యానించారు. 

నాయకుడి మాటలను అనుసరిస్తూ బీజేపీ మొత్తం అదే పాట పాడుతోంది. నిజానికి పాకిస్తాన్‌లో, బంగ్లాదేశ్‌లో వారు చెప్పిన అంకెలు నిజమేనా.. చారిత్రక ఆధారాలు ఏమంటున్నాయి. ఓ సారి తెలుసుకుందాం. 1947 స్వాతంత్ర్యం తర్వాత పాకిస్తాన్ సొంత దేశంగా ఉనికి సంపాదించుకుంది. అధికారికంగా అప్పటి జనాభా గురించి ఎటువంటి ఆధారాలు లేకపోయినా హుడ్‌సన్ ఇన్‌స్టిట్యూట్ 2013లో ప్రచురించిన కథనం ప్రకారం వివరాలిలా ఉన్నాయి. 

1951లో ముస్లిం జనాభా దేశాల వారీగా:

పాకిస్తాన్ – 85.8 %
బలూచిస్తాన్ – 98.5 %
ఈస్ట్ బెంగాల్ – 76.8%
ఫెడరల్ క్యాపిటల్ ఏరియా కరాచీ – 96 %
NWFP – 99.9 %
పంజాబ్ – 97.9 %
సింద్ – 90.5 %

పాకిస్తాన్‌లో 1951లో ఉన్న ముస్లింలు, ముస్లిమేతరులు

సంవత్సరం   ముస్లింలు  ముస్లిమేతరులు
 1998      96.3  3.7
1981 96.67 3.3
1972 96.75 3.25
1961 97.2 2.8    
1951 96.56 3.25

దీనిని బట్టి చూస్తే పాకిస్తాన్ లో 23శాతం ముస్లిమేతరులు ఉన్నారనేది అవాస్తవమని ఓ ఇంగ్లీష్ మీడియా కథనాన్ని ప్రచురించింది. పాకిస్తాన్ విడిపోక ముందు కూడా ఆ ప్రాంతంలో ముస్లిమేతరులు ఎప్పుడూ 15శాతానికి చేరుకోలేదు. 1951లో మాత్రమే 14.2శాతంగా ఉంది. 

బంగ్లాదేశ్ లో ముస్లింలు, ముస్లిమేతరులు వివరాలిలా ఉన్నాయి. 
 

సంవత్సరం     ముస్లింలు      ముస్లిమేతరులు    
1951     76.9 23.2
1961 80.4     19.57    
1971 85.4 14.6
1981 86.7 13.4
1991 88.3 11.7
2001 89.6 10.4
2011 90.4 9.6

2011లో జనాభా లెక్కల ప్రకారం.. బంగ్లాదేశ్ లో ముస్లిమేతరులు దాదాపు 10శాతం మంది ఉన్నారు. అంటే 1951నుంచి 2011వ సంవత్సరానికి 23.20శాతం నుంచి 9.40శాతానికి మాత్రమే తగ్గారు.