ఇదీ నిజం : ప్రజలు ఇళ్లు దాటకుండా...సింహాలను రోడ్లపైకి వదిలిన రష్యా

ఇదీ నిజం : ప్రజలు ఇళ్లు దాటకుండా…సింహాలను రోడ్లపైకి వదిలిన రష్యా

ఇదీ నిజం : ప్రజలు ఇళ్లు దాటకుండా…సింహాలను రోడ్లపైకి వదిలిన రష్యా

కరోనా కట్టడిలో భాగంగా రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ఓ కీలక నిర్ణయం తీసుకున్నడంటూ సోషల్ మీడియాలో ఓ వార్త చక్కర్లు కొడుతోంది. సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న ఆ వార్త సారాంశమేమిటంటే…రష్యాలో కరోనా ఎఫెక్ట్ ఎంతగా ఉందో చూడండి. కరోనా వైరస్ సందర్భంగా లౌక్ విధించారు రష్యాలో. లాక్ డౌన్ సమయంలో ప్రజలు ఇళ్లు వదిలి వీధుల్లోకి రాకుండా,వారిలో భయం పుట్టించేందుకు వందల సింహాలను,పులలను రోడ్లపైకి పుతిన్ సర్కార్ వదిలిపెట్టినట్లు ఆ వార్తలో ఉంది.

అయితే,ముఖ్యంగా భారత్ లో సోషల్ మీడియాతో వేగంగా షేర్ అవుతున్న ఈ వార్త ఫేక్(అబద్దం). ఓ సింహం రోడ్డుపై తిరుగుతున్న 2016ఏప్రిల్ నాటి పాత ఫొటోతో ఈ ఫేక్ వార్తను షేర్ చేస్తున్నారు. అంతేకాకుండా ప్రజలు ఇళ్లకే పరిమితమయ్యేలా పుతిన్ ఇన్ని కఠిన చర్యలు తీసుకంటుంటే మనదేశం మాత్రం అన్ని కఠిన చర్యలు తీసుకోవట్లేదని కొంతమంది ఈ తప్పుడు వార్తను చూసి కామెంట్స్ పెడుతున్నారు.

ఆ ఫేక్ పోస్ట్ లో ఉన్న సింహం ఫొటో 2016ఏప్రిల్ లో దక్షిణాఫ్రికాలోని జోహెన్స్ బర్గ్ లో తీసింది. అంతేకానీ సోషల్ మీడియాలో కొందరు చెబుతున్నట్లుగా సెయింట్ పీటర్స్ బర్గ్ లో కానీ,మరే ఇతర రష్యా సిటీలో కానీ తీసింది కాదు.

కాగా,మిగిలిన యూరప్ దేశాల కన్నా రష్యాలో కరోనా ప్రభావం తక్కువగానే ఉంది. రష్యాలో ఇప్పటివరకు 495మందికి కరోనా సోకినట్లు నిర్థారణ అయింది. మంగళవారం ఒక్కరోజే 57 కరోనా కేసులు నమోదైనట్లు రష్యా ప్రకటించింది.

×