No vaccine, No Dinner : టీకా వేయించుకుంటేనే రెస్టారెంట్‌లోకి అనుమతి- గ్రీకులో కొత్త రూల్

కరోనా వైరస్ టీకాలు వేయించుకున్న కస్టమర్లను మాత్రమే ఇండోర్ రెస్టారెంట్లు, బార్ లు, కేఫ్ ల్లోకి అనుమతించాలని గ్రీకు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.  ఇండోర్ రెస్టారెంట్లు బార్లు, కేఫ్‌ల  లోపలకు వచ్చేవారు వ్యాక్సిన్ వేయించుకున్నామని సర్టిఫికెట్ తప్పని సరిగా చూపించాలి. ఈ ఆదేశాలు బహిరంగ ప్రదేశాల్లో నిర్వహించే రెస్టారెంట్లకు వర్తించదు.

No vaccine, No Dinner : టీకా వేయించుకుంటేనే రెస్టారెంట్‌లోకి అనుమతి- గ్రీకులో కొత్త రూల్

No Vaccines, No Dinner Indoor Greek Restaurants

No vaccine, No Dinner :  కరోనా వైరస్ టీకాలు వేయించుకున్న కస్టమర్లను మాత్రమే ఇండోర్ రెస్టారెంట్లు, బార్ లు, కేఫ్ ల్లోకి అనుమతించాలని గ్రీకు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.  ఇండోర్ రెస్టారెంట్లు బార్లు, కేఫ్‌ల  లోపలకు వచ్చేవారు వ్యాక్సిన్ వేయించుకున్నామని సర్టిఫికెట్ తప్పని సరిగా చూపించాలి. ఈ ఆదేశాలు బహిరంగ ప్రదేశాల్లో నిర్వహించే రెస్టారెంట్లకు వర్తించదు.

ఈవిధానం వలన వేసవి కాలంలో వచ్చే పర్యాటకుల ద్వారా వైరస్ వ్యాప్తిని నిరోధించవచ్చని ప్రభుత్వం తెలిపింది. కాకపోతే టీకాలు వేసుకోని వారు చెల్లించాల్సిన ధరలు కాస్త ఎక్కువ ఉంటాయి. టీకాలు వేయించుకున్న ప్రజలకు కొన్ని అదనపు సౌకర్యాలు కలిగి ఉండాలని అనుకుంటున్నానని ఏథెన్స్ లోని ఇండోర్ కేఫ్ కు వచ్చిన కస్టమర్ యిన్నిస్ కమలకిస్ అన్నారు. ఎవరైతే టీకాలు వేయించుకోరో వారు కొన్ని నియమాలకు కట్టుబడి జీవించాల్సి ఉంటుందని ఆయన తెలిపారు.

ప్రభుత్వం టీకాలు వేసే కార్యక్రమాన్ని వ్యతిరేకిస్తూ ఇటీవస సుమారు 5 వేల మంది గ్రీకు జెండాలు, చెక్క శిలువలు చేతపట్టి ఏథెన్స్ పార్లమెంట్ వద్ద ధర్నా చేశారు. గ్రీకు దేశంలో ఇప్పటి వరకు 15 ఏళ్లు పైబడిన వారిలో 41 శాతం మందికి టీకాలు వేయటం పూర్తయ్యింది. ఈ వారంలో ఆరోగ్య కార్యకర్తలకు, నర్సింగ్ హోమ్ సిబ్బందికి టీకాలు వేయాలని ప్రభుత్వం ఆదేశించింది.

నేను నా చుట్టుపక్కల వారు  టీకాలు వేసుకోవాలని కోరుకుంటున్నానని  ఇండోర్ కేఫ్ లోని కస్టమర్ లియోనిడాల్ చలారిస్ అన్నారు. మళ్లీ లాక్ డౌన్ పెట్టకుండా ఉండేందుకు అధికారులు యత్నాలు  చేస్తున్నారు. వ్యాపారాలు సక్రమంగా సాగి దేశం ఆర్ధిక పరిపుష్టిని పొందటానికి తమ వంతు కృషి చేస్తామని వారు చెప్పారు. కరోనా వైరస్ కారణంగా గతేడాది ఆర్ధికవ్యవస్ధ అతలాకుతులం అయ్యింది. ఆర్ధిక సూచి గతేడాది 8.2 శాతం క్షీణించింది.

మేము ప్రభుత్వానికి పూర్తి మద్దతు ఇస్తున్నాము. ధరల పెరుగుదలే ఆందోళనకరంగా ఉందని ఏథెన్స్ ట్రేడ్ చాంబర్ల అధిపతి యియానిస్ చాట్జిథియోడోసియో అన్నారు. జులై16 శుక్రవారం గ్రీక్ లో 2,691 కోవిడ్ కేసులు నమోదయ్యాయి. దీనితో దేశంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 4,53,200 కి చేరింది. కోవిడ్ తో నిన్న 14 మంది మరఁణించటంతో, మొత్తం మరణించిన వారి సంఖ్య 12,833 కి చేరింది.