Null Stern : చుట్టూ కొండలు,పైన ఆకాశం..ప్రకృతి ఒడిలో పవళింపు

చుట్టూ పచ్చని చల్లని కొండలు. మధ్యలో బెడ్, పైన ఆకాశం, కనువిందు చేసే నక్షత్రాలను చూస్తే ప్రకతి ఒడిలో సేదతీరే అత్యంత సుందరమైన అద్భుతనమైన హొటల్ అది. పర్వతసానువుల్లో పవళించాలనుకునేవారికి స్వర్గధామం ఆ హొటల్. బిజీ బిజీ లైఫ్ నుంచి మనస్సునిసేద తీర్చి పంపించే ఆ హొటల్ కు డిమాండ్ అంతా ఇంతా కాదు.

Null Stern : చుట్టూ కొండలు,పైన ఆకాశం..ప్రకృతి ఒడిలో పవళింపు

Null Stern Hotel

swiss hotel Null stern : ఈ బిజీ బిజీ జీవితాలను వదిలి ప్రశాంతంగా ఉండే చోటికి రెక్కలు కట్టుకుని ఎగిరిపోవాలి. హాయిగా ప్రకృతిని ఆస్వాదించాలి. పచ్చని తోటల్లో ప్రశాంతంగా విహరించాలి. చల్లని వాతావరణంలో సేది తీరాలి. అనే ప్రతీ మనిషికి చాలాసార్లు అనిపించే ఉంటుంది. ఆస్వాదించాలనే మనస్సే ఉండాలిగానీ ఈ అందమైన లోకంలో అద్భుతమైన ప్లేసులు చాలానే ఉన్నాయి. వినూత్నమైన సౌకర్యాలు అందుబాటులో ఉన్నాయి. అటువంటి ఎన్నో పర్యాటక ప్రాంతాలున్నా..ఓ హోటల్ కమ్ రెస్టారెంట్ మాత్రం వెరీ వెరీ డిఫరెంట్.

2

ఏ హొటల్ అయినా సౌకర్యాలు మనం పెట్టే డబ్బుల రేంజ్ ను బట్టి ఉంటాయి.కొన్ని లగ్జరీగా ఉంటే..మరికొన్ని సాదాసీదాగా ఉంటాయి. మరికొన్ని అటూ ఇటుగా ఉంటాయి. టేస్టీ ఫుడ్సీ,ఏసీలు, చక్కటి డెకరేషన్ తో ఉండొచ్చు. కానీ ప్రశాంతమైన నిర్మానుష్య ప్రదేశంలో ప్రకృతి ఒడిలో సేదతీరే అవకాశం మాత్రం కలిగిన ఓ ప్రత్యేక హొటల్ అండ్ రెస్టారెంట్ మాత్రం ‘నల్ స్టెర్న్’ అని చెప్పాల్సిందే. దీని గురించి తెలిస్తే అవాక్కవడం ఖాయం. ఈ రెస్టారెంట్‌కు పైకప్పూ ఉండదు. అస్సలు గోడలే ఉండవ్.

6

దీంతో ఇక తలుపులు అనే మాటే లేదు. కానీ ఆహ్లాదం కోరుకునేవారికి మాత్రం కావలసిన అన్ని సదుపాయాలు ఈ రెస్టారెంట్‌లో ఉన్నాయి.ఈ రెస్టారెంట్ పేరు ‘నల్ స్టెర్న్’ స్విట్జర్లాండ్‌లోని స్విస్ ఆల్ప్స్ పర్వతాల మధ్య ఉంది. ప్రకృతి ఒడిలో స్వేచ్చగా సేదతీరేలా సౌకర్యాలు కల్పిస్తోందీ నల్ స్టెర్న్. జంటలు అమితంగా ఇష్టపడే రెస్టారెంట్‌గా దీనికి మాంచి పేరుంది. ఈ రెస్టారెంట్‌లో ఆరుబయటనే పడుకోవాలి. చుట్టూ పచ్చని..చల్లని కొండలు.మద్యలో మంచం వేసుకుని పడుకుంటే పైనా ఆకాశం..చుక్కలు కనువిందు చేస్తుంటే ఆహా ఆ సుఖం ఎంతిస్తే వస్తుంది అనిపిస్తుంది.

7

డిఫరెంట్ గా ఆలోచించిన ఆర్టిస్ట్ ఫ్రాంక్, రికలిన్ అనే వ్యక్తులు ఈ రెస్టారెంట్ ను ఒకే ఒక్క పడకతో 2016 జులైలో ప్రారంభించారు. దీంట్లో ఒక రాత్రి స్టే చేయాలంటే 17 వేల రూపాయలు చెల్లించాలి. ఆరు బయట కాబట్టి ఈ రెస్టారెంట్‌లో ఉండాలంటే అందుకు అనువైన వాతావరణం కూడా తప్పనిసరండోయ్. వాష్‌రూమ్ కూడా ఉండదు.

4

3

పబ్లిక్ టాయిలెటే ప్రకృతి ఒడిలో. నలువైపులా కొండలు, పైన ఆకాశం ఇవే ఈ రెస్టారెంట్ హద్దులు. ఇంతటి అందమైన ఈ రెస్టారెంట్‌లో బుకింగ్స్ ముందే బుక్ అయిపోతాయి మరి. అదీ నల్ స్టెర్న్ కు ఉండే డిమాండ్.