Svante Pääbo: వైద్యశాస్త్రంలో స్వాంటె పాబోకు నోబెల్.. ప్రకటించిన నోబెల్ బహుమతి కమిటీ

ఈ ఏడాదికి సంబంధించి నోబెల్ బహుమతుల ప్రకటన సోమవారం ప్రారంభమైంది. వైద్య శాస్త్రంలో స్వీడన్‌కు చెందిన స్వాంటె పాబోకు నోబెల్ బహుమతి లభించింది. అంతరించిపోయిన మానవ జాతి జన్యు ఆవిష్కరణలకుగాను ఆయనకు ఈ బహుమతి లభించింది.

Svante Pääbo: వైద్యశాస్త్రంలో స్వాంటె పాబోకు నోబెల్.. ప్రకటించిన నోబెల్ బహుమతి కమిటీ

Svante Pääbo: ప్రపంచంలోనే అత్యంత ప్రతిష్టాత్మకమైన నోబెల్ బహుమతుల ప్రకటన ప్రారంభమైంది. 2022కుగాను వైద్య శాస్త్రంలో స్వీడన్‌కు చెందిన స్వాంటె పాబోకు నోబెల్ బహుమతి లభించింది. మానవ పరిణామక్రమంతోపాటు, అంతరించిపోయిన హోమినిన్స్ జాతి జన్యువులకు సంబంధించిన ఆవిష్కరణలకుగాను పాబోకు ఈ బహుమతి లభించింది.

Human Sacrifice: గంజాయి మత్తులో దారుణం.. నరబలి పేరుతో ఆరేళ్ల బాలుడి హత్య.. నిందితుల అరెస్ట్

సోమవారం స్వీడన్‌లోని స్టాక్ హోంలో ఉన్న కరోలిన్‌స్కా ఇనిస్టిట్యూట్‍‪‌లోని నోబెల్ కమిటీ ఈ అవార్డును ప్రకటించింది. దాదాపు 40 వేల సంవత్సరాల క్రితమే అంతరించిపోయిన నియాండెర్తల్ మానవ జాతికి సంబంధించిన జన్యువును పాబో సీక్వెన్స్ చేయడంతోపాటు, అంతగా ప్రాచుర్యం పొందని హోమినిన్ డెనిసోవాకు సంబంధించిన జన్యువులను కూడా పాబో ఆవిష్కరించారు. గత ఏడాది వైద్య శాస్త్రంలో అమెరికాకు చెందిన డేవిడ్ జులియస్, అర్డెమ్ పటాపౌటియన్‌లు సంయుక్తంగా నోబెల్ బహుమతి అందుకున్నారు. నోబెల్ బహుమతి ప్రకటన వారం రోజులపాటు సాగుతుంది.

Lady Conductor: డ్రైవర్ సీట్లో కూర్చుని వీడియోలు తీసుకున్న లేడీ కండక్టర్.. సస్పెండ్ చేసిన అధికారులు

ముందుగా సోమవారం వైద్య శాస్త్రంలో విజేతను ప్రకటించారు. తర్వాత మంగళవారం భౌతిక శాస్త్రం, బుధవారం రసాయన శాస్త్రం, గురువారం సాహిత్యం, శుక్రవారం నోబెల్ శాంతి బహుమతి, అక్టోబర్ 10, సోమవారం అర్థశాస్త్రంలో నోబెల్ బహుమతి విజేతలను ప్రకటిస్తారు. విజేతలకు నోబెల్ బహుమతితోపాటు సుమారు 9 మిలియన్ డాలర్ల నగదు బహుమతి కూడా అందుతుంది. స్వీడన్ శాస్త్రవేత్త, ఇంజనీర్, వ్యాపారవేత్త అయిన ఆల్‌ఫ్రెడ్ నోబెల్ పేరు మీదుగా ఈ అవార్డు అందిస్తారనే విషయం తెలిసిందే.