సరిహద్దుల్లోకి ఒక్కర్ని కూడా అడుగుపెట్టనివ్వలేదు.. అంగుళం కూడా ఆక్రమించనివ్వలేదు: పీఎం మోడీ

  • Published By: Subhan ,Published On : June 19, 2020 / 04:13 PM IST
సరిహద్దుల్లోకి ఒక్కర్ని కూడా అడుగుపెట్టనివ్వలేదు.. అంగుళం కూడా ఆక్రమించనివ్వలేదు: పీఎం మోడీ

ఇండియా బోర్డర్లోకి అడుగుపెట్టనూ లేదు.. ఒక్క పోస్ట్ ను కూడా ఎవ్వరూ ఆక్రమించలేదని ప్రధాని మోడీ అఖిల పక్ష భేటీ సందర్భంగా అన్నారు. ఇండియా-చైనా బోర్డర్ ఘర్షణల్లో లడఖ్ ప్రాంతంలో 20మంది సైనికులు అమరులైన సంగతి తెలిసిందే. ఇదే అంశంపై మీటింగ్ లో మాట్లాడిన మోడీ.. 

‘మన బోర్డర్ లోపలికి ఒక్కరు కూడా అడుగుపెట్టలేదు. ఒక్క ప్రాంతాన్ని కూడా ఆక్రమించుకోలేదు. చైనా చేసినదానికి యావత్ దేశమంతా బాధపడుతుంది. ఎల్ఏసీ వద్ద జరిగిన ఘటనపై దేశమంతా కోపంతో ఉంది’ అని ఆల్ పార్టీ మీటింగ్ లో మోడీ అన్నారు. ఇండియా భూభాగంలోకి వచ్చేందుకు చైనా ఇస్తున్న సలహాలను తిరస్కరిస్తున్నామని అన్నారు. 

‘మన సైనికుల్లో 20మంది లడఖ్ లో అమరులయ్యారు. అంతకంటే ముందే వారు ఓ పాఠం చెప్పి భారత మాత తల ఎత్తుకుని చూసేలా చేశారు. జాతిని కాపాడటానికి మన దేశం ఏ మాత్రం వెనుకాడటం లేదు. మన భూభాగంలో అంగుళం వైపైనా చూసే సామర్థ్యం లేదు’

‘మన ఆర్మీ బలగాలకు స్వేచ్ఛ ఇచ్చాం. అంతే స్థాయిలో చైనాపై మన స్టాండ్ ఏంటో చెప్పేశాం. ఇండియా శాంతి, స్నేహబంధం కోరుకుటుంది. వాటి కంటే మనల్ని కాపాడుకోవడం ప్రధానం. ఎల్ఏసీ గుండా కొత్త ఇన్‌ఫ్రాస్టక్చర్ తో పాట్రోలింగ్ కెపబిలిటీ పెరిగింది. ఎల్ఏసీ వద్ద పెరిగిన అప్రమత్తతతో భద్రతను కట్టుదిట్టం చేశాం’ అని మోడీ అన్నారు. 

ప్రధానికి కాంగ్రెస్ ప్రెసిడెంట్ సోనియా గాంధీ ప్రశ్నలు సంధించారు. ఘర్షణ ఎప్పుడు మొదలైంది. చర్చల ఫలితం ఏంటి. అని అడిగారు. అఖిల పక్ష భేటీకి ఇప్పటికే ఆలస్యమైందని అన్నారు. తెలుగు రాష్ట్రాల సీఎంలతో పాటు ఇతర రాష్ట్రాల సీఎంలు, ప్రముఖులు అంతా.. మోడీకి మద్ధతు తెలియజేశారు.