కాలుష్యమే లేని ఐల్యాండ్‌లో వింత సమస్య : ముగ్గురంటే ముగ్గురే చిన్నారులు..వృద్దులతోనే ఆటలు

కాలుష్యమే లేని ఐల్యాండ్‌లో వింత సమస్య : ముగ్గురంటే ముగ్గురే చిన్నారులు..వృద్దులతోనే ఆటలు

Nokodo Island In South Korea Where Only 3 Kids 

Nokodo island in south korea where only 3 kids  : చైనా, భారత్ వంటి దేశాలకు జనాభా పెరుగుల సమస్యగా ఉంటే జపాన్ వంటి దేశాలకు జననాల కొరత సమస్య ఉంది. జపాన్ దేశంలాంటి సమస్యే ఉంది దక్షణ కొరియాలోని ఒక ద్వీపంలో. ఆ ద్వీపంలో కే కేవలం వందమంది ప్రజలు మాత్రమే ఉన్నారు. ఈ వందమందిలో చిన్నపిల్లలు కేవలం ముగ్గురంటే ముగ్గురు మాత్రమే ఉన్నారు.

7

2

దక్షిణ కొరియాలో ఇక్కడ మరో సమస్య ఏమిటంటే..వృద్ధుల జనాభా పెరగడం. శిశు జననాలు తగ్గిపోవటం. ఈ జననాల సంఖ్య గణనీయంగా తగ్గిపోతుండటం పెద్ద సమస్యగా తయారవుతోంది. ఈ క్రమంలో నోకోడ్ అనే ద్వీపంలో ముగ్గురు చిన్నారులు మాత్రమే ఉండగా..ల్యూ చాన్ అనే బాలుడు..తని ఇద్దరు అక్కాచెల్లెళ్లు మాత్రమే ఉన్నారు.

3

6

మీరు ఎవరితో ఆడుకుంటారు? ఇతర పిల్లలు లేకపోవటం వల్ల మీకు ఏమనిపిస్తుంది? అని ల్యూ చాన్‌ అడిగితే ఆ బుడతడు ఏమంటాడో తెలుసా? ఇక్కడ మేం ముగ్గురం మాత్రమే ఉన్నాం. ఇంకా మరింతమంది పిల్లలు ఉంటే బాగుంటుంది. వారందరితో కలసి మేమంతా ఆడుకునేవాళ్లం అని చెప్పాడు. ఇక్కడ మాలాంటి పిల్లలెవ్వరూ లేరు…అందుకే మేం కిమ్ సీ యంగ్‌తో అనే 66 ఏళ్ల తాతతో ఆడుకోవాల్సి వస్తోందని చెప్పాడు.

8

దక్షిణకొరియాలో కొన్ని దశాబ్ధాలుగా పట్టణీకరణ ముమ్మరంగా కొనసాగుతోంది. దీంతో పట్టణ శివారు ప్రాంతాల్లో నివసించేవారి సంఖ్య అంతకంతకూ తగ్గుతోంది. ఇటువంటి పరిస్థితుల్లో నోకోడ్ ద్వీపంలో కేవలం వందమంది మాత్రమే నివసిస్తున్నారు. చిన్నారులు కూడా కేవలం ముగ్గురే ఉండటంతో ఇక్కడ స్కూల్ పరిస్థితి కూడా అధ్వాన్నంగా తయారై 10 సంవత్సరాల క్రితమే ఈ స్కూల్ ను మూసివేశారు. దీంతో ఆ ముగ్గురు చిన్నారులకు స్కూల్ కు వెళ్లే పరిస్థితి కూడా లేదు.

1

ఈ ద్వీపంలో ఉన్న ఏకైక పాఠశాల కూడా పిల్లలు లేక మూగబోయి దశాబ్దం క్రితమే మూతపడింది. దీంతో అక్కడున్న చిన్నారులు ధార్మిక పాఠశాలలో చదువుకోవలసి వస్తోంది. కాగా ఈ ద్వీపం ఫిషింగ్ చాలా చాలా ప్రత్యేకమైనది. ఈ ఫిషింగ్ తోనే ఆదరణ పొందింది.

4

ఈ ద్వీపం పరిస్థితి గురించి 66 ఏళ్ల వృద్ధుడు కిమ్ మాట్లాడుతూ.. ఈ ప్రదేశం అంటే చాలామందికి ఇష్టమని, అయితే ఇక్కడ జనాభా గణనీయంగా తగ్గడం ఆందోళన కలిగిస్తోంది. దక్షిణ కొరియా రాజధాని సియోల్‌లో మాదిరిగానే ఇక్కడ కాలుష్యం లేదు. అది చాలా మంచి పరిణామం. జనాల సంఖ్య బాగాలేకపోవటంతో ఇక్కడి జనాభా ఒంటరితనంతో పోరాడాల్సి వస్తున్నదన్నారు.