ఆయన మాటే శాసనం : ఉత్తరకొరియాలో ధూమపానం నిషేధం

  • Published By: nagamani ,Published On : November 5, 2020 / 12:06 PM IST
ఆయన మాటే శాసనం : ఉత్తరకొరియాలో ధూమపానం నిషేధం

North Korea Bans Smoking : ఉత్తరకొరియా అధినేత కింగ్ జోంగ్ ఉన్ మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు. కింగ్ జోంగ్ నిర్ణయం తీసుకున్నారంటే అది శిలాశాసనం అనే విషయం తెలిసిందే. ఇక మరో మాటే లేదు. ఈ క్రమంలో బహిరంగ ప్రదేశాల్లో ధూమపానం చేయడాన్ని నిషేధిస్తూ కింగ్ జోంగ్ ఉన్ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.


దీనికి సంబంధించి ఉత్తరం కొరియా పీపుల్స్ అసెంబ్లీ తీర్మానాన్ని ఆమోదించింది. పొగాకు నిషేధ చట్టంతో పాటు సిగరెట్ల ఉత్పత్తి, వాటి అమ్మకాలపై చట్టపరమైన నియంత్రణను మరింత కఠినతరం చేయాలని ప్రభుత్వం నిర్ణయించిన అనంతరం ఈ తీర్మానాన్ని ఆమోదించామని ఉన్నధికారులు తెలిపారు.




https://10tv.in/america-burger-king-is-urging-people-to-order-from-rival-mcdonalds-kfc-and-others-here-is-the-reason-at-corona-pandemic-time/
ఈ క్రమంలో ఇకనుంచి ఉత్తరకొరియా దేశవ్యాప్తంగా బహిరంగ ప్రదేశాలలో ధూమపానం చేసిన వారికి కఠిన శిక్షలు అమలు చేయనున్నామని అధికారులు హెచ్చరించారు. కొరియా ప్రజల జీవితాలను పరిరక్షించడంతో పాటు వారి ఆరోగ్య సంరక్షణ కోసమే ఈ నిర్ణయం తీసుకున్నామని వెల్లడించారు. ఇక మీదట సినిమా ధియేటర్ లు, ఆసుపత్రులు, విద్యా కేంద్రాలు వంటి పలు బహిరంగ ప్రదేశాల్లో ధూమపాన నిషేధం అమలవుతుందని అధికారులు స్పష్టంచేశారు.


కాగా ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకారం, ఉత్తర కొరియాలో ధూమపానం అధికంగా ఉందనీ తేలింది. పురుషులల్లో 43.9% మంది ధూమపానం చేస్తున్నారని తేలింది. ప్రపంచంలో అత్యధికంగా ధూమపానం చేసే పురుషులున్న దేశాల్లో ఉత్తర కొరియా కూడా ఒకటిగా ఉంది.