నార్త్ కొరియాలో ఆకలి కేకలు : కిమ్ సంచలన నిర్ణయం

నార్త్ కొరియాలో ఆహార సంక్షోభం తలెత్తింది. దశాబ్ద కాలంగా పంట దిగుబడి దారుణంగా పడిపోవడంతో దేశంలో తీవ్ర ఆహారం కొరత ఏర్పడింది. ఆహారపు కొరత కారణంగా ఉత్తర కొరియాలో అత్యవసర పరిస్థితి ఏర్పడింది.

  • Published By: sreehari ,Published On : May 6, 2019 / 11:57 AM IST
నార్త్ కొరియాలో ఆకలి కేకలు : కిమ్ సంచలన నిర్ణయం

నార్త్ కొరియాలో ఆహార సంక్షోభం తలెత్తింది. దశాబ్ద కాలంగా పంట దిగుబడి దారుణంగా పడిపోవడంతో దేశంలో తీవ్ర ఆహారం కొరత ఏర్పడింది. ఆహారపు కొరత కారణంగా ఉత్తర కొరియాలో అత్యవసర పరిస్థితి ఏర్పడింది.

నార్త్ కొరియాలో ఆహారం సంక్షోభం తలెత్తింది. దశాబ్ద కాలంగా పంట దిగుబడి దారుణంగా పడిపోవడంతో దేశంలో తీవ్ర ఆహార కొరత ఏర్పడింది. ఆహారపు కొరత కారణంగా ఉత్తర కొరియాలో అత్యవసర పరిస్థితి ఏర్పడింది. తినడానికి సరైన ఆహారం లేక అక్కడి ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

ఆహారం సంక్షోభాన్ని ఎదుర్కొనే దిశగా చర్యలు చేపట్టిన కొరియా అధ్యక్షుడు కిమ్ జాంగ్ ఉన్ ఓ సంచలన నిర్ణయాన్ని ప్రకటించినట్టు ఓ నివేదిక వెల్లడించింది. ఆహారంలో కోత విధించారు. రోజుకు ఒక్కొక్కరికి అందించే రేషన్ 300 గ్రాములకే పరిమితి విధించినట్టు తెలిపింది. 10 మందిలో నలుగురు నార్త్ కొరియన్లు దీర్ఘకాలికంగా ఆహారం కొరతతో బాధపడుతున్నారు. 

ప్యాంయాంగ్ అభ్యర్థన మేరకు UN ఆహారపు అంచనా వేయగా.. 10.1 మిలియన్ల మంది ప్రజలు తీవ్రమైన ఆహారపు అభ్రదతాభావంతో జీవిస్తున్నట్టు గుర్తించింది. అంటే.. మరో పంట చేతికి వచ్చేవరకూ ఆహారపు కొరత సమస్య తప్పదని దీని అర్థం. కొరియాలో ప్రస్తుత పరిస్థితులు ప్రమాదకరంగా మారిపోయాయి. 1990 మధ్యకాలంలో ఉత్తర కొరియా తీవ్ర కరువుతో అల్లాడిపోయింది. 

కరువు కారణంగా 3 మిలియన్ల మంది ప్రజలు ఆకలితో అలమటించి మృతిచెందారు. కొన్ని ఏళ్ల పాటు యూఎన్ ఫుడ్ ఎయిడ్ కింద ఆహారాన్ని నార్త్ కొరియాకు పంపిణీ చేశారు. నార్త్ కొరియాలో 2008-2009 నుంచి వ్యవసాయ పరంగా 4.9 మిలియన్ల టన్నులు రాబడి వస్తే.. 2018-2019 మార్కెటింగ్ ఏడాదికి 1.36 మిలియన్ల టన్నుల వరకు ఆహారపు లోటుకు దారితీసినట్టు వరల్డ్ ఫుడ్ ప్రొగ్రామ్ నివేదిక తెలిపింది.