ఉత్తర కొరియా చేతిలో 60 న్యూక్లియర్ బాంబులు

  • Published By: madhu ,Published On : August 19, 2020 / 08:59 AM IST
ఉత్తర కొరియా చేతిలో 60 న్యూక్లియర్ బాంబులు

ఉత్తర కొరియా చేతిలో 60 న్యూక్లియర్ బాంబులు ఉన్నట్లు, ప్రపంచంలో పెధ్ద ఎత్తున్న రసాయన ఆయుధాలు కలిగిన దేశాల్లో మూడో దేశంగా ఉందని అమెరికన్ మిలట్రీ నివేదిక వెల్లడిస్తోంది.



North Korea Tactics పేరిట ఓ నివేదికను అమెరికా సైన్యం ప్రచురించింది. ఇతర దేశాలను నిరోధించే విధంగా పెద్ద ఎత్తున నిల్వలు చేపట్టిందని వెల్లడించింది. ఉత్తరకొరియా ఇటీవలి కాలంలో అణ్వాయుధాలను అభివృద్ధి చేసి పరీక్షిస్తున్నట్లు గుర్తించింది.

2006, 2009, 2013 సంవత్సరాల్లో ఒకటి, 2016 లో రెండు, 2017లో ఒకటి…మొత్తం ఆరు అణు పరీక్షలు నిర్వహించిందని వెల్లడించింది. అణు నిరాయుధీకరణకు సంబంధించి అమెరికా అధ్యక్షుడు ట్రంప్, ఉత్తర కొరియా అధినేత కిమ్ జొంగ ఉన్ మూడు సార్లు సమావేశమైనా..ఎలాంటి ఒప్పందాలు జరుగలేదు.



20 నుంచి 60 బాంబుల వరకు ఉంటాయని, ప్రతి సంవత్సరం ఆరు కొత్త ఆయుధాలను ఉత్పత్తి చేయగలిగే సామర్థ్యం ఉందని నివేదికలో వెల్లడించారు. 2020 సంవత్సరం చివరినాటికి 100 అణుబాంబులను కలిగి ఉండే అవకాశాలున్నాయని అంచన వేస్తోంది.

సైనిక వివాదం తలెత్తితే..రసాయన ఆయుధాలను మోహరించే అవకాశం ఉందని, ఒక కిలో సామర్థ్యం రసాయన ఆయుధం ప్రయోగిస్తే…50 వేల మంది వరకు చనిపోతారని అంచనా వేసింది. అంతేగాకుండా..ఉత్తర కొరియా 6 వేల మంది కంప్యూటర్ల హ్యకర్లను తయారు చేసిందని తెలిపింది.