Kim Jong : ఓటమి ఎరుగని సైన్యం నిర్మిస్తా.. దేశాధినేత ప్రతిజ్ఞ

ఉత్తర కొరియా నియంత కిమ్ జోంగ్ ఉన్న దూకుడు పెంచారు. మాటలతో మంటలు పుట్టిస్తున్నారు. ఇప్పటికే ఎయిర్ క్షిపణులు ప్రయోగించి ఉద్రిక్తలు పెంచిన కిమ్.. తాజాగా మరో హాట్ స్టేట్ మెంట్ ఇచ్చా

Kim Jong : ఓటమి ఎరుగని సైన్యం నిర్మిస్తా.. దేశాధినేత ప్రతిజ్ఞ

Kim Jong

Kim Jong : ఉత్తర కొరియా నియంత కిమ్ జోంగ్ ఉన్న దూకుడు పెంచారు. మాటలతో మంటలు పుట్టిస్తున్నారు. ఇప్పటికే ఎయిర్ క్షిపణులు ప్రయోగించి ప్రత్యర్థులకు వార్నింగ్ ఇచ్చిన కిమ్.. తాజాగా మరో హాట్ స్టేట్ మెంట్ ఇచ్చారు. అజేయ(ఓటమి ఎరుగని) సైన్యం నిర్మాస్తానని కిమ్ ప్రతిజ్ఞ చేశారు. అమెరికా అనుసరిస్తున్న ఉద్రిక్త పాలసీల నేపథ్యంలో కిమ్ చేసిన ఈ ప్రకటన చర్చనీయాంశంగా మారింది.

రక్షణ ఉత్పత్తుల ప్రదర్శనలో పాల్గొన్న కిమ్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఉత్తర కొరియా ఆయుధ అభివృద్ధి కేవలం ఆత్మరక్షణ కోసం మాత్రమే అని, యుద్ధం చేయడానికి కాదని స్పష్టం చేశారు. ఉత్తర కొరియా ఇటీవలే సూపర్‌ సోనిక్‌, యాంటీ ఎయిర్‌ క్రాఫ్ట్‌ క్షిపణులను ప్రయోగించిన సంగతి తెలిసిందే.

సెల్ఫ్‌ డిఫెన్స్‌ ఎగ్జిబిషన్‌ను ప్యాంగ్‌యాంగ్‌లో ప్రారంభించారు కిమ్. ఇందులో ట్యాంక్‌లు, క్షిపణులను ప్రదర్శించారు. దక్షిణ కొరియా సైనిక పరంగా బలపడటంపై స్పందించిన కిమ్.. ఉత్తరకొరియా తన పొరుగు దేశంతో యుద్ధం చేయాలనుకోవడం లేదని అన్నారు. అదే సమయంలో దేశ సార్వభౌమత్వ రక్షణ కోసం ప్రత్యర్థుల్లో భయాన్ని పెంచడంపై మాట్లాడతామని అన్నారు. ఉత్తర కొరియా- దక్షిణ కొరియాల మధ్య ఉద్రిక్తలు పెరగడానికి అమెరికానే కారణమని కిమ్ ఆరోపించారు. కొన్ని నెలలుగా ఉత్తరకొరియా వరుస క్షిపణి పరీక్షలు నిర్వహిస్తోంది. మరోపక్క ఫ్లుటోనియం తయారు చేసే రియాక్టర్‌ను కూడా పునరుద్ధరించింది.

Lifespan: ఇది తింటే.. మీ జీవితంలో 36నిమిషాలు తగ్గిపోయినట్లే

కొరియా ద్వీపకల్పంలో ఉద్రిక్తతలకు అమెరికాయే కారణమని కిమ్ జోంగ్ ఉన్ మరోసారి ఆరోపించారు. అస్థిరతకు అమెరికా మూల కారణమని మండిపడ్డారు. అణ్వాయుధ పరీక్షలు, బాలిస్టిక్ క్షిపణి ప్రయోగాలను భారీగా నిర్వహిస్తున్న ఉత్తర కొరియాపై అంతర్జాతీయంగా ఆంక్షలు కొనసాగుతున్నాయి. అయితే, వాటిని బేఖాతరు చేస్తూ కిమ్ జోంగ్ ఉన్ వరుస ప్రయోగాలతో దూసుకెళ్తున్నారు. ఇటీవల అత్యాధునిక హైపర్ సోనిక్ క్షిపణిని ఉత్తర కొరియా పరీక్షించిన విషయం తెలిసిందే.

Digestive : తిన్న ఆహారం త్వరగా జీర్ణం కావటం లేదా?..అయితే ఇలా ప్రయత్నించి చూడండి…

ఇక, అమెరికా మొత్తం భూభాగాన్ని చేరుకోగల ఖండాంతర క్షిపణులను 2017లో ఉత్తర కొరియా పరీక్షించింది. అమెరికా దాడుల నుంచి తనను తాను రక్షించుకోవడానికే ఆయుధాలను సమకూర్చుకుంటున్నామని అప్పట్లో ప్రకటించింది. ఈ వరుస ప్రయోగాలు ప్రపంచ దేశాలను కలవరానికి గురిచేసింది. అమెరికా, ఉత్తర కొరియా మధ్య ఉద్రిక్తలతో మరో ప్రపంచ యుద్దం తప్పదేమోనని ఆందోళన వ్యక్తమైంది.

ఆగస్టులో అమెరికా, దక్షిణ కొరియా దేశాలు సంయుక్త సైనిక విన్యాసాలను నిర్వహించడం ఉత్తర కొరియా ఆగ్రహానికి కారణమైంది. తొలిసారిగా జలాంతర్గామి క్షిపణిని దక్షిణ కొరియా పరీక్షించింది. ఈ విన్యాసాలపై కిమ్ జోంగ్ ఉన్ మండిపడ్డారు.