North Korea: ఉత్తరకొరియా క్షిపణి ప్రయోగం.. తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తంచేసిన దక్షిణ కొరియా సైన్యం

ఉత్తర కొరియా ఆదివారం స్వల్ప శ్రేణి క్షిపణిని ప్రయోగించింది. ఈ విషయాన్ని దక్షిణ కొరియా సైన్యం వెల్లడించింది. ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి తీర్మానాలను ఉల్లంఘించడమేనని దక్షిణ కొరియా సైన్యం ఖండించింది.

North Korea: ఉత్తరకొరియా క్షిపణి ప్రయోగం.. తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తంచేసిన దక్షిణ కొరియా సైన్యం

North Korea

North Korea: ఉత్తర కొరియా ఆదివారం స్వల్ప శ్రేణి క్షిపణిని ప్రయోగించింది. ఈ విషయాన్ని దక్షిణ కొరియా సైన్యం వెల్లడించింది. పశ్చిమ లోతట్టు పట్టణం టైకాన్ నుండి ప్రయోగించిన క్షిపణి ఉత్తర కొరియా తూర్పు తీరానికి సమీపంలోని సముద్రంలో పడటాన్ని గుర్తించినట్లు తెలిపారు. అయితే అది గరిష్టంగా 60 కి.మీ ఎత్తులో ప్రయాణించి దాదాపు 600 కి.మీ దూరంలో పడిందని అన్నారు. ఉత్తర కొరియా ప్రయోగాన్ని ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి తీర్మానాలను ఉల్లంఘించడమేనని దక్షిణ కొరియా సైన్యం ఖండించింది.

Saindhava Lavana : సాధారణ ఉప్పుకు ఆరోగ్యకరమైన ప్రత్యామ్నాయం సైంధవ లవణం! సైంధవ లవణం నీరు తాగితే?

ఉత్తర కొరియా బాలిస్టిక్ క్షిపణిని ప్రయోగించడం కొరియా ద్వీపకల్పం, అంతర్జాతీయ సమాజం యొక్క శాంతి, భద్రతకు ముప్పు కలిగించే తీవ్రమైన రెచ్చగొట్టే చర్య అని దక్షిణ కొరియా యొక్క జాయింట్ చీఫ్ ఆఫ్ స్టాఫ్ ఒక ప్రకటనలో తెలిపారు. ఇదిలాఉంటే దక్షిణ కొరియాతో సంయుక్తంగా నిర్వహించనున్న సైనిక విన్యాసాల కోసం అమెరికా అణుశక్తి ఎయిర్ క్రాప్ట్ క్యారియర్ రొనాల్డ్ రీగన్ కొరియా ద్వీపకల్పంలోని బుసాన్ పోర్టుకు చేరుకుంది. అదే సమయంలో ఈ క్షిపణి పరీక్షించడం గమనార్హం. మరొకొన్ని రోజుల్లో అమెరికా ఉపాధ్యక్షురాలు హ్యారిస్ కూడా దక్షిణ కొరియాను సందర్శించనున్నారు.

Ankita Bhandari: పేదదాన్నే.. కానీ పది వేలకు నన్ను నేను అమ్ముకోలేను.. స్నేహితురాలికి మెసేజ్ చేసిన అంకిత

మరోవైపు జపాన్ కోస్టు గార్డులు కూడా ఈ క్షిపణి పరీక్షను ధ్రువీకరించారు. ఈ విషయంపై జపాన్ రక్షణ మంత్రి యసుకాజు హమదా మాట్లాడుతూ.. జపాన్ ప్రత్యేక ఆర్థిక మండలి వెలుపల ఉత్తర కొరియా యొక్క తూర్పు తీరానికి సమీపంలో క్షిపణి పడిపోయిందని ఆయన తెలిపారు. ఉత్తరకొరియా క్షిపణి పరీక్ష తీవ్రమైన కవ్వింపు చర్య అని సియోల్ వర్గాలు ఆరోపించాయి. తమ సైన్యం సర్వసన్నద్ధంగా ఉందని దక్షిణ కొరియా పేర్కొంది. అమెరికాతో కలిసి రక్షణ సహకారాన్ని  మరింత బలోపేతం చేసుకుంటామని పేర్కొంది.