North Korea: ఉత్తర కొరియాలో రెండేళ్ల చిన్నారికి ఎలాంటి శిక్ష విధించారో తెలుసా?

2021 డిసెంబర్ నెలలో కొరియా ఫ్యూచర్ అనే ఓ సంస్థ కూడా కిమ్ ఆగడాలపై ఓ నివేదిక విడుదల చేసింది.

North Korea: ఉత్తర కొరియాలో రెండేళ్ల చిన్నారికి ఎలాంటి శిక్ష విధించారో తెలుసా?

North Korean President Kim Jong Un

Kim Jong Un: ఉత్తరకొరియా పేరు వింటే చాలు.. ఆ దేశ అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్ అరాచకపాలన మనకు గుర్తుకొస్తుంది. నిత్యం క్షిపణుల ప్రయోగం, అణుబాంబుల ముచ్చట్లతో కిమ్ ప్రపంచ దేశాలను భయపెడుతుంటాడు. అంతేకాదు.. కిమ్ అరాక పాలనతో ఆ దేశంలోని ప్రజలుసైతం బిక్కుబిక్కు మంటూ జీవనం సాగించాల్సిందే. కిమ్ రాజ్యంలో విధించిన నిబంధనలు అతిక్రమిస్తే వారిపని అంతే. చిన్నచిన్న నేరాలకే అక్కడ మరణ శిక్షలు విధించడం పరిపాటే. అమెరికా విదేశాంగ శాఖ ‘అంతర్జాతీయ మత స్వేచ్ఛ 2022’ పేరుతో ఓ నివేదికను విడుదల చేసింది. ఈ నివేదికలో నమ్మలేని నిజాలు వెలుగులోకి వచ్చాయి.

Kim Jong Un : నార్త్ కొరియా నియంత కిమ్ గురించి గూగుల్లో చదివిన గూఢాచారికి మరణశిక్ష

ఉత్తర కొరియాలోని క్రైస్తవులపై ప్రభుత్వం ఆగడాలు అన్నీఇన్నికావు. నివేదిక ప్రకారం.. ఆ దేశంలో క్రైస్తవులు తమ పవిత్ర గ్రంథంతో కనిపిస్తే కఠిన శిక్షలు ఎదుర్కోవాల్సిందే. ఈ క్రమంలోనే ఓ రెండేళ్ల చిన్నారికిసైతం జీవిత ఖైదు విధించినట్లు తాజా నివేదికలో వెల్లడైంది. ఇప్పటి వరకు ఆ దేశంలో సుమారు 70వేల మంది క్రైస్తవులకు శిక్షలు విధించినట్లు నివేదిక పేర్కొంది. మత గ్రంథాన్ని కలిగి ఉండటంతో పాటు మతపరమైన కార్యకలాపాలకు పాల్పడ్డారన్న అభియోగాలతో 2009లో ఆ చిన్నారి కుటుంబాన్ని అరెస్టు చేశారు. రెండేళ్ల తరువాత చిన్నారి సహా కుటుంబ సభ్యులందరికీ జీవిత ఖైదు విధించినట్లు అమెరికా విదేశాంగశాఖ నివేదిక వెల్లడించింది.

Kim Jong Un: ఉత్తరకొరియాలో ఆకలి చావులు .. మిలటరీ గొప్పల్లో మునిగితేలుతున్న కిమ్..!

2021 డిసెంబర్ నెలలో కొరియా ఫ్యూచర్ అనే ఓ సంస్థ కూడా కిమ్ ఆగడాలపై ఓ నివేదిక విడుదల చేసింది. మత స్వేచ్ఛను కోరుకునే వారు ఆ దేశంలో అత్యంత కఠినమైన శిక్షలను ఎదుర్కొంటున్నారని నివేదికలో పేర్కొంది.