రెండూ అణుబాంబులే : చేతులు కలిపిన కిమ్,పుతిన్

రెండూ అణుబాంబులే : చేతులు కలిపిన కిమ్,పుతిన్

రష్యా అధ్యక్షుడు వాద్లిమిర్ పుతిన్ తో ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్ సమావేశమయ్యారు.రష్యాలోని వ్లాడివోస్టోక్ సిటీలో గురువారం(ఏప్రిల్-25,2019)వీరిద్దరూ సమావేశమయ్యారు.పుతిన్,కిమ్ సమావేశమవడం ఇదే మొదటిసారి కావడం విశేషం. కొరియా న్యూక్లియర్ ప్రోగ్రామ్ పై అంతర్జాతీయంగా నెలకొన్న ప్రతిష్ఠంభనపై వీరిద్దరూ చర్చించనున్నారు.అయితే సంయుక్త ప్రకటన,ఒప్పందాలపై సంతకాలు వంటివి ఈ  సమావేశం సందర్భంగా ఉండవు. పుతిన్ తో సమావేశం కోసం కిమ్ తన ప్రత్యేక రైలులో రష్యా చేరుకున్నారు.విమానం కన్నా ఎక్కువగా ట్రైన్ జర్నీకే  కిమ్ ప్రాధాన్యత ఇస్తాడు.భధ్రత దృష్యా ట్రైన్ జర్నీ బెటర్ అని కిమ్ భావిస్తాడు.