North Korea: అణ్వాయుధాలతో సమాధానం ఇస్తాం: ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ హెచ్చరిక

అణ్వాయుధాలతో సమాధానం ఇస్తామంటూ ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్ అమెరికా, దాని మిత్రదేశాలను ఇవాళ ఉదయం హెచ్చరించారు. ఉత్తర కొరియా ఖండాంతర క్షిపణి పరీక్ష చేసిన మరుసటి రోజే కిమ్ ఈ హెచ్చరిక చేయడం గమనార్హం. కొన్ని నెలల నుంచి ఉత్తర కొరియా వరుసగా క్షిపణి పరీక్షలు చేస్తోంది. ఉత్తర కొరియా అణ్వాయుధ పరీక్షలు కూడా చేపట్టనుందని నిఘా వర్గాలు నివేదికల్లో తెలపడంతో అమెరికా, దక్షిణ కొరియా, జపాన్ అప్రమత్తమయ్యాయి.

North Korea: అణ్వాయుధాలతో సమాధానం ఇస్తాం: ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ హెచ్చరిక

Kim Jong

North Korea: అణ్వాయుధాలతో సమాధానం ఇస్తామంటూ ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్ అమెరికా, దాని మిత్రదేశాలను ఇవాళ ఉదయం హెచ్చరించారు. ఉత్తర కొరియా ఖండాంతర క్షిపణి పరీక్ష చేసిన మరుసటి రోజే కిమ్ ఈ హెచ్చరిక చేయడం గమనార్హం. కొన్ని నెలల నుంచి ఉత్తర కొరియా వరుసగా క్షిపణి పరీక్షలు చేస్తోంది. ఉత్తర కొరియా అణ్వాయుధ పరీక్షలు కూడా చేపట్టనుందని నిఘా వర్గాలు నివేదికల్లో తెలపడంతో అమెరికా, దక్షిణ కొరియా, జపాన్ అప్రమత్తమయ్యాయి.

అమెరికా, దాని మిత్రదేశాలు తీవ్ర పరిణామాలు ఎదుర్కొంటాయంటూ వారం క్రితం కూడా ఉత్తర కొరియా హెచ్చరించింది. ఇటీవలే దక్షిణ కొరియాతో కలిసి అమెరికా పెద్ద ఎత్తున యుద్ధ విన్యాసాలు చేపట్టింది. వందలాది యుద్ధ విమానాలతో యుద్ధ విన్యాసాలు జరిగాయి. అంతేగాక, అమెరికా అణుశక్తితో నడిచే విమాన వాహక నౌక యూఎస్ఎస్ రోనాల్డ్ రీగాన్ ను కొరియా ద్వీపకల్పానికి సమపంలో మోహరించింది.

అయినపప్పటికీ ఉత్తర కొరియా ఏ మాత్రం వెనక్కు తగ్గడం లేదు. ఉత్తరకొరియా అణ్వాయుధ క్షిపణి వ్యవస్థలను కూడా పరీక్షించింది. దీంతో కొరియా ద్వీపకల్పంలో మరోసారి ఆందోళనకర పరిస్థితులు నెలకొన్నాయి. తాజాగా జరిపిన ఖండాంతర క్షిపణి పరీక్షను కిమ్ తన భార్య, కూతురితో కలిసి వీక్షించారు. ‘‘శత్రువులు ఇలాగే బెదిరింపులకు పాల్పడితే అణుదాడికి అణ్వాయుధాలతో, ఘర్షణలకు ఘర్షణలతోనే సమాధానం చెబుతామని కిమ్ జోంగ్ ఉన్ తెలిపారు’’ అని ఉత్తర కొరియా మీడియా పేర్కొంది.

10 TV live: “నాన్ స్టాప్ న్యూస్ అప్ డేట్స్ కోసం 10TV చూడండి”..