ఆ దేశంలో అంతే : అగ్నిప్రమాదంలో పిల్లల్ని కాపాడుకున్న తల్లికి జైలుశిక్ష

  • Published By: veegamteam ,Published On : January 10, 2020 / 09:30 AM IST
ఆ దేశంలో అంతే : అగ్నిప్రమాదంలో పిల్లల్ని కాపాడుకున్న తల్లికి జైలుశిక్ష

ఓ ఇంట్లో అగ్నిప్రమాదం సంభవించింది. ఆ ప్రమాదం నుంచి ప్రాణాలకు తెగించి బిడ్డల్ని కాపాడుకుంది ఓ తల్లి. అదే పెద్ద నేరమైపోయింది. ప్రమాదం నుంచి పిల్లల్ని కాపాకుంది కానీ ఆ ఇంట్లో ఉండే ఫోటోలను కాపాడుకోలేకపోయింది. దీంతో ఆమెకు ప్రభుత్వం జైలు శిక్ష విధించింది. అదేంటీ..పిల్లల ప్రాణాలు కంటే ఫోటో ముఖ్యమా? అందుకోసం ఏకంగా జైలుశిక్ష వేసేస్తారా? అని ఆశ్చర్యపోవచ్చు. అక్కడే ఉంది మరి అసలు విషయం. ఈ ఘటన జరిగిన దేశం గురించి తెలిస్తే అలా అనుకోరు. ఆ దేశం ఉత్తర కొరియా…!. 

కొరియా  అధ్యక్షుడు కిమ్ జంగ్ ఉంగ్ నియంతృత్వం గురించి..అతని క్రూరత్వం గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. అతని మైండ్ సెట్ లాగానే ఆ దేశ చట్టాల్ని కూడా క్రూరమైన  రూపొందించాడు. అతను చెప్పిందే శాసనం..చేసందే చట్టం. అటువంటి కిమ్ క్రూరత్వానికి నిదర్శనం అగ్నిప్రమాదంలోంచి బిడ్డల్ని కాపాడుకున్న మహిళలకు జైలుశిక్ష విధించటం. ఆమె అగ్నిప్రమాదంలో వదిలివేసిన ఫొటోలు మరెవ్వరివో కావు.. కిమ్ వి..అతని ఫ్యామిలీకి సంబంధించినవి..!!
 
ఉత్తర కొరియాలో ప్రతి ఇంట్లో కిమ్ కుటుంబ సభ్యుల ఫొటోలు ఉంటాయి. ఉండి తీరాలి కూడా. అది కిమ్ శాసనం. ఆ ఫోటోలను దేశ ప్రజలంతా ఆరాధించాలి. వారినే దైవంగా భావించాలి. వాటిని ఫొటోల్లా కాకుండా సాక్షాత్తు దేవుడిలా భావించాలని కిమ్ ఆదేశాలు. ఈ క్రమంలో ఏదైనా ప్రమాదం జరిగితే ముందుగా ఆ ఫొటోలనే రక్షించాలి. లేకుంటే ఇదిగో ఈ మహిళకు జరిగిందే జరుగుతుంది. ఒక్కోసయమంలో వారి ప్రాణాలు కూడా తీసేస్తారు. ఇళ్లల్లో ప్రమాదాలు జరిగినప్పుడు ఏది కాపాడుకున్నా లేకున్నా..కిమ్ కుటుంబీకుల ఫోటోలను మాత్రం సురక్షితంగా కాపాడాల్సిందే. లేదంటే వారికి విలువ ఇవ్వలేదని ఘోరమైన శిక్షలకు గురికావాల్సిందే.అది కూడా చట్టపరంగా..!! చట్టాలు తమ పని తాము చేసుకుపోతాయి…!!

ఈ క్రమంలోనే అగ్నిప్రమాదంలో తన పిల్లల్ని కాపాడుకుని కిమ్ ఫోటోలను..వాకి కుటుంబ సభ్యుల ఫోటోలను మంటల్లో వదిలివేసిన ఆ మహిళ జైలు శిక్ష అనుభవించనుంది. కాకపోతే ఆమెకు ఎంతకాలం జైలుశిక్ష వేశారు అనేది తెలియలేదు. కానీ దీనికి ఆమెకు చాలాళ్లే జైల్లో ఉండాల్సి వస్తుందని అంటున్నాయి  స్థానిక మీడియా సంస్థలు. కాగా..ఈ ప్రమాదంలో గాయాలతో హాస్పిటల్‌లో చికిత్స పొందుతున్న పిల్లలు తల్లికోసం ఏడుస్తున్నా..కనీసం తల్లి వద్దకు పిల్లలు వెల్లటానికి అనుమతించలేదు. దటీజ్.. ఉత్తర కొరియా ప్రెసిడెంట్ కిమ్ జంగ్ ఉంగ్..! నియంతృత్వానికి క్రూరత్వానికి పరకాష్ట…!!